Political News

అంబటి వంతూ వచ్చేసింది!

ఏపీలో కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, అందులో భాగంగానే వైసీపీ నేతలను వరుసబెట్టి అరెస్టు చేస్తోందని ఆరోపిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తననూ అరెస్టు చేసుకోండి అంటూ చాలా రోజులుగా సవాల్ విసురుతున్నారు. అంబటి సవాళ్లు ఇప్పుడు నిజమైపోయాయి. అంబటిపై విచారణకు ఏపీ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ వ్యవహారంలో విచారణ మొదలు …

Read More »

టార్గెట్ సీమ‌: టీడీపీ స్ట్రాట‌జీ ఇదేనా ..!

టిడిపి అధినేత చంద్రబాబు రాయలసీమను టార్గెట్గా చేసుకొని రాజకీయంగా అడుగులు మరింత వేగం పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా ఈనెల 10వ తారీఖున నిర్వహించే సూపర్ సెక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించి ఉంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది అన్నది మొదట్లో చర్చకు వచ్చింది. ఈ విషయంపై చంద్రబాబు కూడా చూచాయిగా సమాచారం అందించారు. కానీ, …

Read More »

ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి గ్రీన్ సిగ్నల్

ఏపీలో ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మేలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ఆరోగ్య శ్రీ పథకం పౌరుల ఆర్థిక స్థితిగతులను బట్టి అమలవుతోంది. దీంతో, రాష్ట్రంలోని పౌరులందరికీ ఆ పథకం ప్రయోజనం లభించడం లేదు. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్ర పౌరులందరికీ వర్తించేలా ఉచిత ఆరోగ్య బీమా పథకం తీసుకువస్తానని హామీనిచ్చింది. ఈ క్రమంలోనే ఆ హామీని …

Read More »

లోక‌ల్ వార్‌… వైసీపీ రెడీయేనా ..!

ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. ముఖ్యంగా పంచాయతీ ల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీంతో స్థానిక సమరం ఇక ప్రారంభం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమరంలో ఎవరు విజేత అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవమే. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీనే స్థానికంగా కూడా విజయం దక్కించుకుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. గ‌తంలోనూ ఇదే …

Read More »

సేమ టు సేమ్‌: క‌విత‌-ష‌ర్మిల‌… పొలిటిక‌ల్‌ బాధితులా..!

తెలంగాణకు చెందిన నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఏపీకి చెందిన వైఎస్ షర్మిల విషయం కూడా తెర‌ మీదకు వచ్చింది. ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల‌ కుమార్తెలు కావడం, ఇద్దరికీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత ఇద్దరూ …

Read More »

సుగాలి ప్రీతి.. జ‌న‌సేన‌లో సునామీ ..!

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థి 2017 లో అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఇది జరిగిన‌ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజకీయంగా పెద్ద వివాదంగా మారుతోంది. ఈ కేసును విచారించి తమకు న్యాయం చేయాలని నిందితులను పట్టుకుని శిక్షించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి కోరుతున్నారు. అయితే ఈ క్రమంలో జనసేన చుట్టూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటంగా …

Read More »

చిక్కుల్లో టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి!

అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైకోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎందుకు అరెస్టు చేయకుండా నానుస్తున్నారు అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన విమర్శలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై గతంలో హత్య కేసు నమోదయింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన చెబుతున్నప్పటికీ ఆధారాలు ఉన్నాయి …

Read More »

వైసీపీకి కార్య‌క‌ర్త‌లు.. దూర‌మా.. భార‌మా..?

వైసీపీలో కార్యకర్తలు కీలకమని, కార్యకర్తలను బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కార్యకర్తలను దూరం చేసుకుని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి.. తాము ఓడిపోయామని ఆయన గతంలో ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల‌ సెంట్రిక్‌గా వైసీపీ రాజకీయాలు సాగుతాయని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకు వచ్చి …

Read More »

టీడీపీపై రేవంత్ ఇంటరెస్టింగ్ కామెంట్స్!

ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కీలక నేతగా దాదాపుగా స్థిరపడిపోయారు. అయితే ఎంత కాంగ్రెస్ పార్టీ నేత అయినా రేవంత్ కూడా గతంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కొనసాగిన నేతే కదా. టీడీపీలో చాలా కాలం పాటు కీలక హోదాలో పనిచేశారు. తాజాగా తెలంగాణ సీఎం హోదాలో తన సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వేమూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ గురించి అత్యంత ఆసక్తికర …

Read More »

మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దు: రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యారని మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని, కాళేశ్వరం అవినీతి అంటూ కేసీఆర్ పై సీబీఐ విచారణకు పురిగొల్పారని ఆరోపించారు. అందుకే, హరీష్ రావు పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించడం లేదని, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ ను మాత్రమే రేవంత్ విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కవిత …

Read More »

రేవంత్ రెడ్డికి హరీష్ లొంగిపోయారు: కవిత

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హరీష్ రావు, సంతోష్ లపై కవిత షాకింగ్ ఆరోపణలు చేశారు. పార్టీలో లబ్ధిపొందాలని అనుకుంటున్న కొందరితో కలిసి హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను విడగొట్టి పార్టీని హస్తగతం …

Read More »

బ్రేకింగ్… ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా

తెలంగాణ రాజకీయాల్లో వరుసగా బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సమయంలో పార్టీ నుంచి దక్కిన శాసనమండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) రాజీనామా చేశారు. అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు పార్టీ నుంచి తనను సస్పెండ్ …

Read More »