వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జగన్ గా రూ.. మీరు కడుపు మంటతో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్లలో కలుపుకొని తాగండి. కడుపు మంట తగ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీలకమైన సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంపథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో లోపాలు ఉన్నాయంటూ.. …
Read More »15 రోజుల గడువు.. `కాంగ్రెస్` రెడీ అయ్యేనా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా ప్రభుత్వానికి ఏడాదిన్నర కూడా దాటిపోయింది. ఈ క్రమంలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పేశారు. ఈ నెల ఆఖరు నాటికి నోటిఫికేషన్ ఇచ్చేసేలా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు.. ఆయనే స్వయంగా ఈ క్రతువుకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని వెల్లడించారు. ఈ స్వల్ప వ్యవధిలో పార్టీ పుంజుకుని.. స్థానిక …
Read More »‘ఫ్యాన్’కు బేరింగులన్నీ పాడయ్యాయబ్బా!
ఇంటిలో తిరుగుతున్న ఫ్యాన్ కు బేరింగులు బాగుంటేనే దాని నుంచి నలుదిక్కులా గాలి వస్తుంది. శబ్ధం లేకుండా ఫ్యాన్ ఆహ్లాదాన్ని అందిస్తుంది. రాత్రి వేళ సుఖమయ నిద్రను అందిస్తుంది. ఫ్యాన్ లొని ఇతరత్రా పరికరాల కంటే బేరింగులే కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫ్యాన్ ను పట్టుకుని ఎన్నికల ప్రచారంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్ ఇంటిలో ఉండాలి.. టీడీపీ గుర్తు …
Read More »మోడీ రాక.. 2 రోజుల ముందే.. విశాఖకు చంద్రబాబు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి మరోసారి వస్తున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రావాలంటూ.. సీఎం చంద్రబాబు ఆహ్వానించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నెల 20న రాత్రికి ఒడిశా నుంచి విశాఖకు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి.. తెల్లవారు జామున 5.30 గంటలకే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. దీనిని విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా రాజిల్లుతున్న ఆర్కేబీచ్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి …
Read More »23 ముహూర్తం.. అసలు విషయాలు తేలేది అప్పుడే!
ఏపీ సీఎం చంద్రబాబు ఓ కీలక కార్యక్రమానికి ఈ నెల 23ను ముహూర్తంగా నిర్ణయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, చేసిన సంక్షేమం వంటి కీలక అంశాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలోనే ఈ నెల 23 నుంచి ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో ప్రచారం చేయాలని ఇప్పటికే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇది మంచి …
Read More »ఏపీకి కష్టమొస్తే కేంద్రమే నడిచొస్తోంది!
నిజమే… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా ఏపీకి ఏ చిన్న సమస్య వచ్చినా… దానిని పరిష్కరించేందుకు కేంద్రం ఆఘమేఘాల మీద చర్యలు తీసుకుంటోంది. సమస్య కాస్త పెద్దది అయితే ఏకంగా ఏపీకి వస్తున్న కేంద్రం దానిని పరిష్కరించే దిశగా కృష్టి చేస్తోంది. ఇదేదో అదాటుగా చెబుతున్న మాట కాదు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పర్యటనకు వచ్చారు. పొగాకు …
Read More »బెయిలొచ్చినా.. కొమ్మినేనికి మోక్షం దక్కలేదే
దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదన్న సామెతలా మారింది సాక్షి ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా..శుక్రవారమే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తక్షణమే కొమ్మినేనిని జైలు నుంచి విడుదల చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ లభించి ఆదివారం నాటికి మూడు …
Read More »గాడ్ ఫాదర్-గేమ్ చేంజర్-రింగ్ మాస్టర్.. విషయం ఏంటంటే!
ఇవేవీ సినిమా పేర్లు కాదు. ఏపీలో పాలనకు సంబంధించి ముగ్గురు కీలక నాయకులను ఉద్దేశించి ఓ మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు. అయితే.. ఇవి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో తల్లికి వందనం పేరుతో కీలకమైన సూపర్ – 6 పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రూ.13000 చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తున్నారు. అయితే.. రూ.15 వేలు …
Read More »టీ టీడీపీ రీయూనియన్ మొదలైనట్టే!
తెలుగు దేశం పార్టీ… తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పరిరక్షణే పరమావధిగా ఏర్పాటైన పార్టీ. 40 ఏళ్లకు పైగా ప్రస్థానం సాగిస్తున్న టీడీపీ… అన్ని సమయాల్లో కంటే ఇప్పుడు అత్యంత బలీయంగా ఉందని చెప్పాలి. జనసేన, బీజేపీలతో జత కట్టిన టీడీపీ… ఏపీ అసెంబ్లీని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది. తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన టీడీపీ.. అటు కేంద్రంలోని ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో …
Read More »కవిత ఇంటి పేరు మార్చుకున్నారా..?
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె గానే కాకుండా పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత ఇంటి పేరు ఏమిటి? కల్వకుంట్ల కవితే కదా అంటారా? ఇప్పటిదాకా అయితే ప్రతి ఒక్కరూ ఆమెను కల్వకుంట్ల కవితగానే పిలుస్తున్నారు. దాదాపుగా అన్ని మీడియా సంస్థలూ అదే రాస్తున్నాయి కూడా. సడెన్ …
Read More »జీరో నుంచి మొదలు.. వైసీపీ ఏం చేయాలి ..!
ప్రజలు ఓడించి ఏడాది అయింది. మరో 4 సంవత్సరాల పాటు ఎన్నికలకు అవకాశం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ.. వైసీపీలో తలెత్తుతున్న ప్రశ్నలు. ఎందుకంటే.. ఒక్క ఏడాదిలోనే అనేక అరెస్టులు, అనేక మంది జంపింగులను పార్టీ చవి చూసింది. ఈ నేపథ్యంలో వచ్చే నాలుగు సంవత్సరాలు అంటే.. మరింత కష్టం. దీంతో పార్టీలో నాయకులు ఏం చేయాలన్నది ప్రశ్నగా మారింది. కానీ.. ఇక్కడే కీలక విషయాన్ని పార్టీ …
Read More »రెండో రోజూ ఏఐజీకి కేసీఆర్… ఏం జరుగుతోంది?
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం వరుసగా రెండో సారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం వైద్య పరీక్షలు పూర్తి కాలేదో, లేదంటే ఆ పరీక్షల్లో ఏదైనా సీరియస్ ఆరోగ్య సమస్య గుర్తించారో తెలియదు గానీ శనివారం కూడా కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates