ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఉండి నియోజకవర్గంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును పక్కన పెట్టి మరీ.. వైసీపీ నుంచి వచ్చి.. ఆ పార్టీపై యుద్ధం చేసిన రఘురామరాజుకు.. చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి రఘురామ గెలిచారు. అయితే.. ఉండి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఆయన ఎన్నికల సమయంలో …
Read More »గెలుపు-ఓటమి.. సహజం.. తేడా తెలుసుకోవడమే ముఖ్యం జగన్!
రాజకీయాల్లో ఉన్నవారు.. గెలవొచ్చు.. ఓడొచ్చు. ప్రజా తీర్పు. ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి గీటు రాయి కనుక.. ఎంతటి వారైనా.. దీనికి బద్ధులు కావాల్సిందే. నా మాటనే ఎదిరిస్తారా అంటూ.. దేశాన్ని తన చేతిలోకి తీసుకుని నల్లచట్టాన్ని ప్రయోగించి ఇందిరమ్మ సైతం.. ప్రజాభిప్రాయ తుఫాను కెరటాల్లో కొట్టుకుపోయిన సంగతి .. ఈ దేశం ఒక చరిత్ర. ఆమె అక్కడితో కుంగిపోలేదు.. రాటు దేలారు.. తప్పులు తెలుసుకున్నారు. ఎమర్జెన్జీ వంటి కీచక చట్టం తన …
Read More »జగన్ వెర్సస్ పవన్.. ఎంత తేడా
రెండు మూడేళ్ల కిందట వైఎస్ జగన్ ప్రభుత్వం దెబ్బకు టాలీవుడ్ ఎంతగా అల్లాడిపోయిందో గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని టార్గెట్ చేసే క్రమంలో ఏపీ అంతటా టికెట్ల ధరలను తగ్గించేసి సినిమాలను నమ్ముకున్న వాళ్లంతా విలవిలలాడిపోయేలా చేసింది జగన్ సర్కారు. రేట్ల పెంపు కోసం చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలు రకరకాలు ప్రయత్నాలు చేసి… చివరికి ముఖ్యమంత్రి జగన్‌ను కూడా కలిసి వచ్చారు. ఆ టైంలో చిరుతో పాటు ప్రభాస్, మహేష్ …
Read More »టీ-కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డికి ఏమైంది?
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సీనియర్ నాయకుడు, గతంలో పార్టీలో కీలక పదవులు కూడా చేసి, అధిష్టానం దగ్గర మెప్పు పొందిన జీవన్ రెడ్డి అలిగారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్టు అనుచరులు చెబుతున్నారు. దీంతో అసలు పార్టీలో ఏమైంది? జవన్ …
Read More »మూలాలు మరవని నేతలు.. ఆదర్శంగా కూటమి ప్రజా ప్రతినిధులు!
ఏపీలోను, కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిం దే. కొందరు కూటమి నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మూలాలను మరిచి పోకుండా వ్యవహరిస్తు న్నారు. తమ వృత్తిని మరిచిపోనివారు ఒకరైతే..తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెంచిన పార్టీని మరిచి పోని వారు మరొకరు. తమ మాతృభాషకు పట్టం కడుతున్నవారు ఇంకొకరు. ఇలా.. మొత్తంగా నాయకులు.. మూలాలు మరవకుండా ముందుకు సాగుతున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు: ఈయన …
Read More »వలంటీర్లను ఏం చేస్తున్నారు? ఏపీలో తీవ్ర చర్చ
వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గత ఎన్నికలకు ముందు ప్రకటించారు. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి తాను రూ.10 వేలకు పెంచుతానని కూడా చెప్పారు. అంతేకాదు.. అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు కూడా.. మారాలని ఆయన హితవు పలికారు. తాను వచ్చాక వలంటీర్లకు మెరుగైన నైపుణ్య శిక్షణ ఇప్పించి.. వారిని మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. …
Read More »ఏపీ స్పీడు మామూలుగా లేదు
పనిచేయాలన్న సంకల్పం.. రాష్ట్రానికి ఏదో మేలు చేయాలన్న తపన.. ఉంటే.. కష్ట సాధ్యం అయినదేదీ ఉండదు. ఇప్పుడు అదే నిరూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారంలోకి వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాకుముందే.. కీలక ప్రాజెక్టు లైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను ఆయన దాదాపు పట్టాలెక్కించేశారు. ప్రమాణస్వీకారం అనంతరం.. పోలవరం, అమరావతిలో పర్యటించిన తర్వాత.. చంద్రబాబు ఒకరకంగా నిర్వేదం వ్యక్తం చేశారు. పోలవరం నాశనం అయిందని.. అమరావతిని ముంచేశారని …
Read More »కవితక్క.. శత దినోత్సవం!
బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత జైలు పాలై 100 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఆమె దాదాపు 22 సార్లు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నారు. కారణాలు అనేకం చెప్పారు.వీటిలో పిల్లాడి చదువు ఉందన్నారు. ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. తనకు అనారోగ్యం అన్నారు. ఇంకా ఏవేవో చెప్పారు. గత సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉదహరించారు. కానీ, ఎక్కడా కోర్టులు కరుణించలేదు. ప్రస్తుతం రౌస్ అవెన్యూ …
Read More »నారా లోకేష్ సింప్లిసిటీ.. బాగుంది!
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సింప్లిసిటీ బాగుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రి గా ప్రమాణం అనంతరం.. ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. దీనిని కొనసాగిస్తున్నారు కూడా. ఈ క్రమంలో సాధారణ ప్రజలకు కొంత వెసులుబాటు కూడా కల్పించారు. దీంతో అందరూ హ్యాపీగా వెళ్లి నారా లోకేష్‌ను కలుస్తున్నారు. తాజాగా సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్. తన కుర్చీకి …
Read More »ఎంత తప్పు చేశావు జగన్.. పులివెందులే చెపుతోన్న పచ్చి నిజం…?
జగన్ అభిమానులు.. వైసీపీ సానుభూతి పరులు అంటున్న మాట ఇదే. ‘ఎంత తప్పు చేశావు జగన్’ అనే అంటున్నారు. జనాలను నమ్ముకుని.. అన్నీ వారికి ఊడ్చి పెట్టి.. అప్పులపై అప్పులు తెచ్చి పథకాలను అమలు చేశారు. ఈ క్రమంలో విపక్షాల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. సైకో అన్నా భరించారు. తుగ్లక్ అన్నా సహించారు. అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని అన్నా.. పట్టించుకోకుండా.. ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు …
Read More »మెగా డీఎస్సీకి ఆమోదం.. ఏపీ కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం
నిరుద్యోగులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీకి ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తాజాగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల నేతృత్వంలో భేటీ అయిన మంత్రి వర్గం.. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తోంది. అయితే.. తొలి చర్చగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ అయిన.. మెగాడీఎస్సీపైనే మంత్రులు చర్చించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు అత్యంత కీలకమైన ఉపాధ్యాయ పోస్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందన్నారు. …
Read More »జగన్ ఓటమి చూసి ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారా
ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరాజయాన్ని తట్టుకోలేక ఫలానా జిల్లాలో ఒకరు మృతి. మరో చోట ఇంకొకరి మరణం.. ఇదీ వైసీపీ పత్రిక, ఛానెళ్లు, సోషల్ మీడియాలో ఇప్పటికీ వస్తున్న వార్తలు. జూన్ 4 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలు వచ్చి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ ఇప్పటికీ జగన్ పార్టీ ఓటమిని …
Read More »