Political News

బాకీ వసూలు బలవంతమైతే జైలే గతి

అప్పు ఇచ్చుడు దాకా ఓకే. దానిని వసూలు చేయడం అంత వీజీ కాదు. కాస్తంత టెక్నిక్ తెలిసిన రుణ దాతలు అయితే ఫరవా లేదు గానీ… అదో లోకం రుణ దాతలు అయితే మాత్రం అప్పులు ఇవ్వరాదు, ఇబ్బందులు కొని తెచ్చుకోరాదు. ఇప్పుడు తమిళనాడుకు వెళితే… రుణ గ్రహీతలకు వర ప్రసాదం లాంటి ఓ చట్టం వచ్చింది. అదేంటంటే… అప్పు ఇచ్చిన వారు అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి …

Read More »

నిన్న నోటీసు, నేడు కేసు.. కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిజంగానే ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటిదాకా అధికార పక్షంలో దర్జాగా పాలన సాగించిన కేటీఆర్… విపక్షంలోకి మారిన తర్వాత కూడా ఏమాత్రం స్పీడు తగ్గించకుండానే సాగారు. అధికార కాంగ్రెస్ పై తనదైన శైలి ఆరోపణలతో ఆయన విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు వరుసగా ఆయనపై విచారణలు, కేసులు నమోదు అయిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి …

Read More »

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు ఇస్తున్న డీఏను 3.64 శాతం పెంచుతున్నట్లుగా రేవంత్ సర్కారు శుక్రవారం రాత్రి ఏకంగా అధికారిక ఉత్తర్వులే జారీ చేసింది. అంతేకాకుండా ఈ పెంచిన డీఏను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏడాది ముందు నుంచి వర్తింపజేస్తామనీ ఆ ఉత్తర్వుల్లో రేవంత్ సర్కారు మరింత గుడ్ న్యూస్ చెప్పింది. 2023 జనవరి 1 …

Read More »

కొమ్మినేని స‌రే.. కృష్ణంరాజుకు అంత ఈజీకాదు!

రాజ‌ధాని అమ‌రావ‌తిపై అవాకులు-చెవాకులే కాదు.. అత్యంత జుగుప్సాక‌ర వ్యాఖ్య‌లు చేసిన కేసులో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు కొమ్మినేని శ్రీనివాస‌రావు, కృష్ణంరాజుల‌పై కేసులు న‌మోదు కావ‌డం..వారిని పోలీసులు అరెస్టు చేయ‌డం.. జైలుకు వెళ్ల‌డం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయ‌న ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని.. కేవ‌లం ‘యాంక‌ర్‌’ పాత్ర పోషించార‌ని.. పైగా.. న‌వ్వినంత మాత్రాన ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం త‌గ‌ద‌ని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ …

Read More »

ఇదేం న్యాయం?.. రామ్మోహన్ నాయుడిపై ట్రోలింగ్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తంగా 269 మంది ప్రాణాలు కోల్పోయారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున …

Read More »

జ‌గ‌న్ వేశారు.. బాబు తీశారు.. వారంతా హ్యాపీ!

వైసీపీ హ‌యాంలో విధించిన కొన్ని ప‌న్నుల‌తో అన్ని వ్య‌వ‌స్థ‌లు ఇబ్బందులు ప‌డ్డాయి. వీటిలో ప్రైవేటు విద్యాసంస్థ‌లు కూడా ఉన్నాయి. ‘గ్రీన్ ట్యాక్స్’ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థ‌ల‌కు చెందిన వాహ‌నాల‌పై వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌.. గ్రీన్ ట్యాక్స్ బాదేశారు. అయితే.. అంతిమంగా ఇది విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కే చుట్టుకుంది. దీంతో ఫీజులు కూడా పెరిగాయి. ర‌వాణా చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఈ క్ర‌మంలో ఆయా స్కూళ్ల యాజ‌మాన్యాల‌తో పాటు.. విద్యార్థుల త‌ల్లిదండ్రులు …

Read More »

తండ్రి మాదిరే అన్నకూ కవిత మద్దతు!

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. నిన్న ఓ మాట మాట్లాడే నేతలు..ఆ మరునాడే దానికి పూర్తిగా విరుద్ధమైన ప్రకటన చేస్తూ ఉంటారు. ఈ లెక్కన ఏ నేత విషయంలో అయినా ఆయా నేతలు ఈ రోజు ఏం మాట్లాడారనే దానికే విలువ ఉంటుంది తప్పించి…గతంలో వారేం మాట్లాడారన్న దానికి అసలు విలువే లేదని చెప్పక తప్పదు. ఈ కోవలోకి ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, …

Read More »

వైసీపీ నేత‌ల‌ను కోర్టుకు లాగుతా: నారా లోకేష్‌

వైసీపీ నాయ‌కుల‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయ‌కుల‌ను కోర్టుకు లాగుతాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. “వారు త‌మ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేయాలి. లేక పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి. వారిని కోర్టుకు లాగుతా!.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మరి నారా లోకేష్‌కు ఇంత ఆగ్ర‌హం రావ‌డానికి కార‌ణాలేంటి? వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు …

Read More »

పటాన్ చెరులో పవన్… మ్యాటరేంటి?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్ లో బిజీబిజీగా గడిపారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆయన పటాన్ చెరు ప్రాంతంలో కనిపించారు. పటాన్ చెరును ఆనుకుని ఉన్న ఇక్రాశాట్ లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ఐఎస్ హెచ్) ను ఆయన సందర్శించారు. స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న పవన్ కు పాఠశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. అయినా పవన్ ఇప్పుడు ఎందుకని …

Read More »

బ్రేకింగ్… కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీసు

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై వరుసబెట్టి విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణలకు బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ లాంటి నేతలే హాజరు అవుతున్నారు. తాజాగా ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఓ దఫా ఏసీపీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోమారు నోలీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు …

Read More »

‘త‌ల్లికి వంద‌నం’.. జనం టాక్ ఇదే!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ 6 హామీల్లో కీల‌క‌మైన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని సీఎం చ‌ద్ర‌బాబు గురువారం నుంచి అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. తాజా శుక్ర‌వారం నుంచి ల‌బ్ధిదారులైన త‌ల్లుల ఖాతాల్లో త‌ల్లికి వంద‌నం నిధులు జ‌మ అవుతున్నాయి. …

Read More »

మృత్యుంజయుడికి మోదీ పరామర్శ… ఎలా బతికాడంటే?

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా… ఒకే ఒక్కడు మృత్యుంజయుడిలా మంటల్లో నుంచి అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అతడే గుజరాత్ కే చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రమాదం ఎలా జరిగింది? అసలు …

Read More »