ప్రధాని నరేంద్ర మోడీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు.. ప్రస్తుత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్. ఈయన ఒకప్పటి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు. తండ్రి మరణం తర్వాత.. ఈయన మోడీకి దగ్గరయ్యారు. మోడీ ఎంత చెబితే అంత అంటూ.. పార్లమెంటు ఎన్నికల సమయంలో చెలరేగి మాట్లాడారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన ఎల్ జేపీ పార్టీకి ఇప్పుడు ఈయన చీఫ్‌గా ఉన్నారు. బిహార్‌లోని పార్లమెంటు స్థానాల్లో …
Read More »ఈ పూరి గుడిసె.. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది స్టేట్!’
పై ఫొటోలో కనిపిస్తున్న పూరి గుడెస.. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్‌ది న్యూస్‌గా మారిపోయింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పూరి గుడిసెల గురించి ఎవరు మాత్రం పట్టించుకుం టారు? అవి ఎందుకు వార్తల్లో నిలుస్తాయి? అనే సందేహాలు వ్యక్తం కావచ్చు. అయితే.. తాజాగా ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు ప్రధాన మీడియాలోనూ వైరల్ అవుతున్న ఈ ఫొటో వ్యవహారం …
Read More »తెలంగాణలో జంపింగులు..ఈ స్టోరీ ఇప్పట్లో అయిపోలేదా?
తెలంగాణలో ఎమ్మెల్యేల జంపింగుల పర్వం గత వారం నుంచి కొనసాగుతూనే ఉంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నవారు.. తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కారణాలు ఏవైనా.. తొలుత ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన ఈ గోడదూకుళ్లు.. ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. వచ్చిన వారిని వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువాలు …
Read More »సునాక్ పై పాకీ వ్యాఖ్యలు.. బ్రిటన్‌లో రాజకీయ దుమారం!
బ్రిటన్‌లో రాజకీయ దుమారం రేగింది. అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రగులుకున్నాయి. ప్రధాన మంత్రి రుషి సునాక్‌ను ఉద్దేశించి.. ప్రతిపక్ష రిఫార్మ్ పార్టీ(ఆర్పీ) నాయకుడు ఒకరు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌లో సునాక్ హయాంలో తీసుకువచ్చిన.. మైగ్రేషన్ పాలసీ(వలస విధానం)పై స్పందిస్తూ.. ఇవి పాకీ నిర్ణయాలు. ఆయన ఓ పాకీ అంటూ.. సదరు నేత విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. …
Read More »మోడీ గారు..కుదిరితే మరో కప్పు కాఫీ…: చంద్రబాబు
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన …
Read More »దేశంలో న్యాయం మారుతోంది!
దేశంలో న్యాయ వ్యవస్థ మారుతోంది. జూలై 1(సోమవారం) నుంచి దేశవ్యాప్తంగా నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నూతన నేర న్యాయ చట్టాల మేరకు.. తీర్పులు, కేసుల నమోదు, ఫిర్యాదుల నమోదు వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. 2023లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. మూడు నూతన నేర న్యాయ చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి డెడ్ లైన్ జూన్ …
Read More »నాయుడి జీవితం పై 3 పుస్తకాలు ఆవిష్కరించిన మోదీ
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేదు. గ్రామ స్థాయి బీజేపీ నేత నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారు వెంకయ్య నాయుడు. హుందాతనంగా రాజకీయాలు చేసిన వెంకయ్యనాయుడు అంతే హుందాగా ఉప రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా తన మాట నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు వెంకయ్య నాయుడు …
Read More »తెలంగాణతో ఏపీ తొలి పేచీ ప్రారంభం..
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. విభజన సమస్యలపై దృష్టి పెట్టింది. ప్రధానంగా పొరుగున ఉన్న తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడంపై కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా విద్యుత్ బకాయిలు వసూలుకు రంగం రెడీ చేసింది. అయితే.. దీనికి తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది. గతంలో జగన్ ప్రభుత్వం ఏకంగా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. తెలంగాణ నుంచి 5 వేల కోట్ల …
Read More »జగన్‌ను ఇలా కూడా ‘ఆడేసుకుంటాన్నారుగా’!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలు.. మూడు రాజధానులు, పోలవరం, అమరావతి విధ్వంసం వంటి వాటిని నెటిజన్లు గుర్తు చేస్తూ… తమదైన శైలిలో ఉతికి ఆరేస్తున్నారు. కామెంట్లు కుమ్మరిస్తున్నారు. ఇక, రాజకీయంగా చంద్రబాబు కూడా.. …
Read More »జూలై 1… జగన్ షేక్ అయ్యే స్కెచ్ వేసిన చంద్రబబు
టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్కెచ్ వేశారు. 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి పించన్లను అందించాలని.. అధికారులను, వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు. మరోవైపు.. రాజకీయంగా కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంత్రులు, కార్యకర్తలు, నాయకులను కూడా రంగంలోకి దింపుతున్నారు. వారి ద్వారా.. ప్రతి ఇంటికీవెళ్లి …
Read More »వైఎస్ @ 75 : జాడలేని జగన్.. షర్మిల మాత్రం!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన నాయకుడే. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే స్థాయిలో ఉండాలని కోరుకుంటోంది. దీంతో ఇరు రాష్ట్రాల్లోనూ వైఎస్ కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. 2004, 2009లో వైఎస్ హయాంలోనే వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఆయన హఠాన్మరణం, రాష్ట్ర విభజన సంగతి తెలిసిందే. అయితే.. ప్రతి ఏటా …
Read More »హైదరాబాద్‌తో ఈక్వల్‌గా వరంగల్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు.. రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రధాన నగరాలను అభివృద్ది చేసేందుకు మాస్టర్ ప్లాన్లు రెడీ చేస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. వరంగల్ నగరాన్ని.. హైదరాబాద్ నగరంతో సమానంగా అభివృద్ది చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. తద్వారా.. పెట్టుబడులు.. రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొనడం …
Read More »