Political News

రేవంత్‌రెడ్డి పేప‌ర్ పులి: క‌విత

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత సీఎం రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి న‌ల్ల‌మ‌ల పులి కాద‌ని.. ఆయ‌నో పేప‌ర్ పులి మాత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రేవంత్ రెడ్డి లాలూచీ ప‌డిన‌ట్టు ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తావిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై ఇక్క‌డ హైద‌రాబాద్‌లో కూర్చుని ప్ర‌జంటేష‌న్లు ఇస్తే.. ప్ర‌యోజ‌నం లేద‌ని, ఢిల్లీలో కూర్చుని ప్ర‌య‌త్నాలు చేయాల‌ని.. లేక‌పోతే ఉద్య‌మాలైనా చేయాల‌ని …

Read More »

పరామర్శా?.. బల ప్రదర్శనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం చేపట్టిన రెంటపాళ్ల పర్యటనను చూస్తుంటే.. నిజంగానే ఆయన చనిపోయిన వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారా?.. లేదంటే పల్నాడు జిల్లాలో తన బలం ఎంతో చూపే దిశగా బల ప్రదర్శన యాత్ర చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగక మానవు. ఎందుకంటే… ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్.. ఉదయం 11 గంటలకు రెంటపాళ్ల చేరుకుని నాగమల్లేశ్వర రావు …

Read More »

రూ.3 వేలతో 200 ట్రిప్పుల టోల్ ఫ్రీ జర్నీ!

నాలుగు చక్రాల వాహనాలతో జాతీయ రహదారులు ఎక్కితే…టోల్ మోత మోగిపోతుండటం అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. ఏం చేద్దాం..దేశ నిర్మాణంలో రహదారుల పాత్ర కీలకమైనది. క్షేమకరమైన, సత్వర ప్రయాణాల కోసం నిగనిగలాడే రహదారులు అవసరమే కదా. మరి వాటిని నిర్మించాలంటే ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సిందే కదా. ఇక బాధ్యత కలిగిన పౌరులుగా అందులో మనం భాగస్వామ్యం పంచుకోవాల్సిందే కదా. అందుకే జాతీయ రహదారులపై ఎంతదూరం ప్రయాణిస్తే అంత మేర టోల్ …

Read More »

ఔను.. నా ఫోన్ ట్యాప్ చేసి.. నాకే వినిపించారు!: ష‌ర్మిల‌

వైసీపీ హ‌యాంలో త‌న ఫోన్‌ను ట్యాప్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల చెప్పారు. తాజాగా ఆమె విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవమేన‌ని చెప్పారు. “నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి …

Read More »

హైదరాబాద్ కు మరో మణిహారం.. జీఎస్ఈసీ ప్రారంభం

భాగ్య నగరి హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతోంది. నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ అడుగులు… ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని ఐటీ దిగ్గజాల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా భాగ్యనగరిలో మంగళవారం గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఓపెన్ అయిపోయింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించారు. …

Read More »

జ‌గ‌న్ కాన్వాయ్ ఢీ.. వృద్ధుడి మృతి!

వైసీపీ అధినేత జ‌గ‌న్ గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలోని రెంట‌పాళ్ల‌లో ఈ రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తాడేప‌ల్లి నుంచి భారీ ఎత్తున కాన్వాయ్‌తో బ‌య‌లు దేరారు. పోలీసులు కేవ‌లం 100మంది కార్య‌క‌ర్త‌ల‌కు, 30 మంది నాయ‌కుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌రులు మాత్రం వంద‌ల సంఖ్య‌లో బ‌య‌లు దేరారు. ర‌హ‌దారి పొడ‌వునా సుమారు 70 కిలో మీట‌ర్ల మేర‌కు రోడ్ షో నిర్వ‌హిస్తూ.. …

Read More »

సీఎం రేవంత్ ను పొగిడిన బీజేపీ ఎమ్మెల్యే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రథ సారధి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ఒకింత నెమ్మదిగా అయినా… పక్కాగా అమలు చేస్తూ సాగుతున్న రేవంత్ సర్కారు ప్రజల మన్ననలను చూరగొంటోంది. తాజాగా విపక్షం బీజేపీకి చెందిన కీలక నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రేవంత్ ను ఆకాశానికెత్తేశారు. దేశంలోనే రేవంత్ రెండో అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ రాజా సింగ్ …

Read More »

లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్టు

ఏపీలో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణంలో అరెస్టు పరంపర కొనసాగుతోంది. సోమవారం దాకా ఈ కేసులో ఏడుగురు నిందితులు అరెస్టు కాగా… మంగళవారం రాత్రి మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు అయిన వారిలో వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన బాల్య మిత్రుడు వెంకటేశ్ నాయుడు ఉన్నారు. …

Read More »

‘ఫోన్ ట్యాపింగ్’ బాధితులు 600 మంది.. భారీ కుట్ర‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు 2023లో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై వ‌చ్చిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌.. ఫోన్ ట్యాపింగ్‌. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ స‌హా.. అధికార ప‌క్షంలోని కొంద‌రు రెబ‌ల్ నాయ‌కుల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయ‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనిపైనే కేసు న‌మోదై.. దాదాపు ఏడాది అవుతోంది. గ‌త ఏడాదిలో మొద‌లైన ఈ కేసు విచార‌ణ ఇప్ప‌టికీ సాగుతోంది. అయితే.. కేసు విచార‌ణ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని …

Read More »

‘వృద్ధి’లో ఏపీ ప‌రుగులు.. ఎలాగో చెప్పిన సీఎం చంద్ర‌బాబు

త‌ల‌స‌రి వృద్ధి.. దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్దిని సూచిస్తుంది. ఈ విష‌యంలోనే రాష్ట్రాలు కూడా పోటీ ప‌డ‌తాయి. తాజాగా కేంద్ర త‌ల‌స‌రి వృద్ధితో పోల్చుకుంటే.. ఏపీ జోరుగా ముందుకుసాగుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇది ఎలా సాధ్య‌మైందో కూడా ఆయ‌న గ‌ణాంకాల రూపంలో వివ‌రించారు. తాజాగా అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌ణాళిక శాఖ‌పై స‌మీక్షించారు. ప్ర‌స్తుతం.. ఏపీ త‌ల‌స‌రి వృద్ధి 11.89 శాతంగా న‌మోదైన‌ట్టు తెలిపారు. అదే దేశీయంగా చూసుకుంటే …

Read More »

‘కొత్త, వింత కథ’పై సిట్ స్ట్రాంగ్ కౌంటర్

మద్యం కుంభకోణం దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ గన్ మన్ మదన్ రెడ్డి మంగళవారం సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చెవిరెడ్డికి పాత్ర ఉన్నట్లుగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా తనపై సిట్ అదికారులు దాడికి దిగారంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన మదన్… ఆ పిటిషన్ లోని …

Read More »

టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ సవాల్

తెలంగాణలో ఏడాదిన్నరగా రాజకీయం రంజుగా సాగుతోంది. రోజుకో కొత్త మలుపులతో సాగుతున్న టీ పాలిటిక్స్ లో ఎప్పటికప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణలు, ప్రతి దూషణలు.. కేసులు, ప్రతి కేసులు.. విచారణలు, హెచ్చరికలు.. ఇలా రసవత్తరంగా రాజకీయం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఏకంగా లీగల్ నోటీసులు పంపించారు.  అసలేం జరిగిందన్న …

Read More »