Political News

చెవిరెడ్డి వాదనలు చెల్లలేదు.. 1 వరకు జైలు

ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ బెజవాడ ఏసీబీ కోర్టు బుధవారం రాత్రి ఉత్వర్లులు జారీ చేసింది. దీంతో చెవిరెడ్డిని సిట్ అధికారులు మరికాసేపట్లో బెజవాడలోని జిల్లా జైలుకు తరలించనున్నారు. చెవిరెడ్డితో పాటుగా ఆయన బాల్య స్నేహితుడు వెంకటేశ్ నాయుడినీ కోర్టు జైలుకు పంపింది. …

Read More »

ఆ పాత ఫోన్లు ఏమయ్యాయి కేటీఆర్!

ఫార్మూలా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇప్పటిదాకా రెండు పర్యాయాలు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన రెండో దఫా విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు… 2021 నుంచి 2024 మధ్యలో వినియోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేయాలని కేటీఆర్ ను కోరారు. అయితే ఇఫ్పుడు వాటిని తీసుకురాలేదని తప్పించుకున్న కేటీఆర్ తాజాగ బుధవారం అసలు …

Read More »

బనకచర్లకు 2019లోనే అంకురార్పణ: రేవంత్ రెడ్డి

ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే అంకురార్పణ జరిగిందని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో భాగంగా బనకచర్లపై కీలక చర్చ జరిగింది. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని అఖిలపక్ష సమావేశానికి వివరించిన రేవంత్… తెలంగాణకు తీరని నష్టం చేకూర్చే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానం పంపుదామన్నారు. అందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కూడా …

Read More »

జగన్ పరామర్శ కథేంటో తెలుసా?

వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పార్ట్ టైం పొలిటీషియన్ అని.. ఉండేది హైదరాబాద్‌లో, రాజకీయం చేసేది ఏపీలో అంటూ ఎద్దేవా చేసేవాళ్లు ఆ పార్టీ అభిమానులు. కానీ గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయాక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్ట్ టైం పొలిటీషియన్‌గా మారిపోయారు. బెంగళూరులోని తన ప్యాలెస్‌లో ఉంటూ వారం పది రోజుల గ్యాప్‌లో ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. …

Read More »

లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న కొమ్మినేని

సాక్షి టీవీ ఛానెల్లో వచ్చే ‘కేఎస్ఆర్ లైవ్ షో’ ఇటీవల ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు అనే మరో సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి అది ‘వేశ్యల రాజధాని’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. దానికి కొమ్మినేని నవ్వడం.. తీవ్ర దుమారమే రేపింది. ఇటు కొమ్మినేనిపై, అటు కృష్ణంరాజుపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆ …

Read More »

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: జ‌గ‌న్‌

రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేసి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శించారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కుడు నాగ మ‌ల్లే శ్వ‌ర‌రావు కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌ల్లేశ్వ‌ర‌రావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం.. జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. మ‌ల్లేశ్వ‌ర‌రావును ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి ముందే పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హిం …

Read More »

జగన్ పరామర్శ రెండు ప్రాణాలు తీసింది!

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, స్థాని పోలీసుల వేధింపుల కారణంగా రెంటపాళ్ల ఉప సర్పంచ్, వైసీపీ నేత నాగ మల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో నాగ మల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్… పోలీసు ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా జగన్ …

Read More »

 ట్రంప్‌కు మరోసారి ఇరాన్ హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంలో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గట్టిగా హెచ్చరించారు. తమ దేశంపై ఎటువంటి దాడిని కూడా సహించేది లేదని.. గతంలో ట్రంప్ చేసిన బెదిరింపులను మరువలేమని అన్నారు. “అంతా మరిచిపోతారని మీరు అనుకోవచ్చు కానీ, ఇరాన్ అంత తేలిగ్గా తీసుకోదు. మీరు ఎక్కడ దాక్కున్నా, మేము చూస్తున్నాం. అమెరికా జోక్యం చేసుకుంటే.. మూల్యం …

Read More »

కొడాలి నాని ఏం పాపం చేశాడు?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాటి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మవారు వైసీపీలో ఉండకూడదా? అని ప్రశ్నించిన ఆయన.. కమ్మవారు అంతా టీడీపీలోనే ఉండాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయకూడదని కూడా బాబు కోరుకుంటారని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

Read More »

ఇచ్చిన మాట కోసం.. ఇంటి రుణం తీర్చిన నారా లోకేష్‌..!

పార్టీ నాయ‌కుడి కుటుంబానికి ఇచ్చిన మాట కోసం మంత్రి నారా లోకేష్ వారి ఇంటి రుణం తీర్చేశారు. అంతేకాదు.. ఆ కుటుంబానికి నెల నెలా ఆదాయం వ‌చ్చే మార్గం కూడా చూపించారు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషం వ్య‌క్తం చేస్తోంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన టీడీపీ నేత వెన్నా బాల కోటి రెడ్డి 40 ఏళ్లుగా టీడీపీలో కొన‌సాగుతున్నారు. రొంపిచర్ల మండలం టీడీపీ …

Read More »

రేవంత్‌రెడ్డి పేప‌ర్ పులి: క‌విత

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత సీఎం రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి న‌ల్ల‌మ‌ల పులి కాద‌ని.. ఆయ‌నో పేప‌ర్ పులి మాత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రేవంత్ రెడ్డి లాలూచీ ప‌డిన‌ట్టు ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తావిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై ఇక్క‌డ హైద‌రాబాద్‌లో కూర్చుని ప్ర‌జంటేష‌న్లు ఇస్తే.. ప్ర‌యోజ‌నం లేద‌ని, ఢిల్లీలో కూర్చుని ప్ర‌య‌త్నాలు చేయాల‌ని.. లేక‌పోతే ఉద్య‌మాలైనా చేయాల‌ని …

Read More »

పరామర్శా?.. బల ప్రదర్శనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం చేపట్టిన రెంటపాళ్ల పర్యటనను చూస్తుంటే.. నిజంగానే ఆయన చనిపోయిన వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారా?.. లేదంటే పల్నాడు జిల్లాలో తన బలం ఎంతో చూపే దిశగా బల ప్రదర్శన యాత్ర చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగక మానవు. ఎందుకంటే… ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్.. ఉదయం 11 గంటలకు రెంటపాళ్ల చేరుకుని నాగమల్లేశ్వర రావు …

Read More »