పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం తాజాగా ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలకు సంబంధించి కొత్త గడువును డిసైడ్ చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ సాగలేదని తెలుస్తోంది. ఎజెండాలో పేర్కొన్న అంశాలపైనే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని …
Read More »ఉస్మానియాలో పీపీఈ కిట్లు వరదపాలు…వైరల్ వీడియో
కరోనా మహమ్మారి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడిన ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా అదే స్థాయిలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు లేవని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలోనూ వైద్యులకు సరిపడినన్ని పీపీఈ కిట్లు లేవని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, …
Read More »ఆయన్ను పిలిపించుకొని మాట్లాడిన జగన్.. అసలేం జరిగింది?
ఒక్కో ముఖ్యమంత్రి తీరు ఒక్కోలా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎవరికి సంబంధించిన వార్త పబ్లిష్ అయ్యాక.. అలాంటి వారిని ముఖ్యమంత్రులు పక్కన పెట్టేయటం సాధారణంగా జరుగుతుంది. అందులోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి వారైతే.. ఇక వారివైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఇష్టపడరని చెబుతారు. అలాంటి తీరుకు భిన్నమైన అంశం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఏరి కోరి తెచ్చుకొని సీఎంవోలో పెట్టుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి …
Read More »అప్పులు తీసుకోవడంలో ఏపీ తెలంగాణలది జెట్ స్పీడ్
రాష్ట్ర విజభన తర్వాత తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా మారితే.. అందుకు భిన్నమైన పరిస్థితిని ఏపీలో నెలకొంది. మిగులు బడ్జెట్ లో తెలంగాణలో.. లోటు బడ్జెట్ లో ఏపీ ఉంది. అప్పుల భారం కూడా ఎక్కువే. ఆదాయం మొత్తం తెలంగాణకు పోతే.. అప్పుల కుప్పలా ఏపీ నిలిచింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు.. అప్పులు పంచటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గడిచిన ఆరేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు రిజర్వు బ్యాంక్ …
Read More »వేటు వేసిన వేళ పైలెట్ పయనమెటు?
రాజస్థాన్ రాజకీయం మరిన్ని మలుపులు తిరిగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభంపై అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుగుబావుటా ఎగరవేసిన యువనేత సచిన్ పైలట్ పై వేటు వేయటంతో పాటు.. ఆయన్ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచే కాదు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితులైన విశ్వేంద్రసింగ్.. రమేశ్ మీనా ఇద్దరు మంత్రులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే …
Read More »స్వరాష్ట్రంలో వైద్యంపై పాలకులకే నమ్మకం లేదా?
కరోనా దెబ్బకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ విలవిలలాడుతున్నారు. పొలిటిషియన్లు, బిజినెస్ మెన్లు…నిలువ నీడ లేని వారు…నిరు పేదలు ఇలా…తన పర భేదం లేకుండా అందరినీ తన కర్కశ కౌగిలిలో బంధిస్తోంది కరోనా. రాజకీయ నాయకుల నుంచి సాయం అందుకున్న ప్రజలు….ప్రజలకు సాయం చేసిన రాజకీయ నాయకులు…ఇలా ఏ కేటగిరీ వారినీ వదలడం లేదీ మహమ్మారి. అయితే, కరోనా సోకే విషయంలో తేడాలు లేనప్పటికీ….కరోనాకు చికిత్స అందించే…అందుకునే విషయంలో …
Read More »డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలోనే తాజా నిర్ణయం?
కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాడి వదిలేశారని.. ఎవరికి వారు తమ బతుకుల్ని తామే చూసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్న మాటలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. మొదట్లో బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో కరోనా విషయంలో త్వరతిగతిన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. ప్రజలకష్టాలు తగ్గలా ఆలోచించటం లేదన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది. కేసులు పెరగకుండా కంట్రోల్ చేయటంలో కేసీఆర్ …
Read More »రాజు గారి నుంచి జగన్ కు మరో లేఖ వచ్చింది
151 ఎమ్మెల్యేలు… చరిత్రలో ఇంత శాతం ఎమ్మెల్యేలు ఒక పార్టీకి రావడం చాలా చాలా అరుదు. అందుకే విశ్లేషకులు అందరూ… ఇక జగన్ పార్టీలో అసమ్మతికి చెల్లుచీటీ అని గెలిచిన తొలినాళ్లలో వ్యాఖ్యానించారు. కానీ… ఒక అసమ్మతి వైసీపీని ఒక ఊపు ఊపుతుందని విశ్లేషకుల అంచనాకు అందలేదు. ఆ ఒక్కడు రాజుగారు. రఘురామరాజు ఎపిసోడ్ మొదటి అంకంలో పార్టీలో జగన్ ను కీర్తిస్తూ నిర్ణయాలపై సద్విమర్శలు చేస్తూ వచ్చాడు. ఇపుడు …
Read More »గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోని కాంగ్రెస్
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్….130 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన పార్టీ……దేశానికి ఎందరో కీలకమైన నేతలను అందించిన పార్టీ…. స్వతంత్రానికి పూర్వం స్థాపించిన ఈ పార్టీ గతమెంతో ఘనం. కానీ, ప్రస్తుతం ఈ పార్టీ పరిస్థితి రాజకీయ సంద్రంలో చుక్కాని లేని నావలా తయారైంది. గతమెంతో వైభవంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని నడిపించే బలమైన నాయకత్వం లేక పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల …
Read More »రాజస్థాన్ డ్రామా.. మోడీ-షాకు షాక్?
కర్ణాటక ఆపరేషన్ అయిపోయింది. మధ్య ప్రదేశ్‌లోనూ విజయవంతంగా పని పూర్తి చేశారు. ఇప్పుడిక రాజస్థాన్ మీద పడింది నరేంద్ర మోడీ-అమిత్ షా జోడీ. ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు తిరస్కరించినా సరే.. ప్రత్యర్థి పార్టీలో అదను చూసి అసమ్మతి రాజేసి.. తమ అండదండలు ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకునేలో ఉంది మోడీ-షా జోడీ. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడా ప్రయోగిస్తోంది. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న …
Read More »పెరగనున్న జోబైడెన్ దూకుడు.. తాజా ఎన్నికల్లో ఘన విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. సూటిగా కాకుండా పలు దశల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన వారు.. రోజుల వ్యవధిలో అధికారాన్ని చేపడతారు.కానీ.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అభ్యర్థి కొన్నినెలల పాటు.. పదవిని చేపట్టటానికి అవకాశం ఉండదు. అధ్యక్ష పదవిని చేపట్టటానికి ముందే.. ట్రైనింగ్ కోసమన్నట్లు కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా దశల వారీగా.. …
Read More »వైజాగ్‌లో మరో ఫార్మా ప్రమాదం.. బిగ్ బ్లాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఈ మధ్య అస్సలు టైం బాగాలేనట్లుంది. రెండు నెలల కిందట లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే అక్కడి గోపాలపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో చోటు చేసుకున్న స్టెరీన్ గ్యాస్ లీక్ ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొనడమే కాక.. వందల మందిని అస్వస్థుల్ని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వైజాగ్‌లో ఒకట్రెండు చిన్న ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా …
Read More »