కరోనా కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన విమాన యానాన్ని ఈ రోజే పునరుద్ధరుంచింది కేంద్ర ప్రభుత్వం. దేశీయంగా పూర్తి స్థాయిలో కాకపోయినా.. నిర్దిష్ట సంఖ్యలో విమానాల్ని పునరుద్ధరించారు. కొన్ని రోజుల కిందటే బుకింగ్స్ మొదలయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న వాళ్లంతా టికెట్లు తీసుకుని సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లంతా సోమవారం అన్ని ఏర్పాట్లూ చేసుకుని శంషాబాద్ …
Read More »జగన్ ఆ తప్పు చేయొద్దు – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల అమ్మకాలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా శ్రీ వేంకటేశ్వరుని పేరిట వివిధ రాష్ట్రాల్లో ఉన్న భూముల్ని కూడా అమ్మడానికి సన్నాహాలు మొదలయ్యాయి. టీటీడీ ఈ మేరకు భూముల వేలానికి బిడ్లు కూడా ఆహ్వానించింది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ప్రభుత్వ …
Read More »జగన్ తెగింపు ఆమెకు కొత్త టెన్షన్ గా మారిందా?
ఏదైనా విషయం అనుకుంటే.. దాన్ని పూర్తి చేసే వరకూ పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఎంతకైనా రెఢీ అనే తీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో కాస్త ఎక్కువే. ఆయన్ను సన్నిహితంగా చూసే వారందరికి ఈ విషయం మీద అవగాహన ఎక్కువే. తాను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలనే పట్టుదల..ఇప్పుడు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి కొత్త టెన్షన్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. కెరీర్ లో ఇప్పటివరకూ ఎలాంటి …
Read More »వరంగల్ కేసు మిస్టరీ వీడింది
వరంగల్ నగర శివార్లలోని గొర్రెకుంటలో తొమ్మిది మంది ఒకేసారి పాడుబడ్డ బావిలో శవాలుగా తేలిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ముందు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు వార్తలొచ్చాయి. కానీ విచారణలో ఇవన్నీ హత్యలని తేలింది. ఈ హత్యలకు సూత్రధారి ఎవరో.. వాళ్లందరూ ఎలా చంపబడ్డారో పోలీసులు కనిపెట్టారు. మూడు రోజుల పాటు పది …
Read More »ఆయన ఏపీలో వైసీపీ ఎంపీ.. ఢిల్లీలో బీజేపీ ఎంపీనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాస్త భిన్నమైన వ్యక్తిగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుగా చెబుతారు. మిగిలిన వారి రూట్ కు భిన్నమైన బాటలో ఆయన పయనిస్తుంటారు. ప్రధాని మోడీ సైతం ఆయన్ను పేరు పెట్టి పిలిచేంత దగ్గరతనం ఆయన సొంతం. అంతేనా.. మోడీషాల అపాయింట్ మెంట్ కావాలంటే ముఖ్యమంత్రి జగన్ కంటే ముందే ఈ ఎంపీకి ఇస్తారన్న టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా.. ఢిల్లీలో …
Read More »సోను సూద్…. ఐ యామ్ ఇంప్రెస్డ్
లాక్ డౌన్ వేళ.. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వలసకార్మికులు అనుభవించిన కష్టాలు అన్ని ఇన్ని కావు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ దేశంలోని పేదలకు ఇంతటి దారుణమైన కష్టం రావటమా? అని వేదన చెందిన వారికి కొదవ లేదు. సొంతూరుకు వెళ్లాలన్న పట్టుదలతో మండే ఎండలో వందలాది కిలోమీటర్లు కాలి నడకన వెళ్లిన వైనం కడుపు తరుక్కుపోయేలా చేసింది. పసిపిల్లలు.. చిన్నారులు.. ఇంటి …
Read More »ఎవరీ ఉండవల్లి అనూష..
విమర్శ కఠినంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలనుకునే నాయకత్వం తెరమరుగైపోయింది. విషయం ఏదైనా.. ఎప్పుడైనా పొగడాలే తప్పించి.. విమర్శలు చేసినా.. ఆరోపణలు చేసినా భరించే పరిస్థితుల్లో నాయకత్వాలు ఉంటున్నాయి. తాను విపక్ష నేతగా ఉన్న వేళలో.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టే వారికి తాను రక్షకుడిగా ఉంటానని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడాయన ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తమ ప్రభుత్వానికి …
Read More »తొలి విమానంలో విశాఖకు చంద్రబాబు
ఎట్టకేలకు చంద్రబాబు హైదరాబాదు వీడనున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లడానికి ఇరు రాష్ట్రాల డీజీపీలు అనుమతి ఇచ్చారు. ఉగాది సమయంలో కుటుంబంతో హైదరాబాదు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సడెన్ లాక్ డౌన్ తో ఇక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హైదరాబాదులో ఉన్నాడు. అక్కడ దాక్కున్నాడు అంటూ అధికార పార్టీ నేతలు పలుమార్లు విమర్శించిన విషయం విదితమే. అయితే, లాక్ డౌన్ వల్ల ఉండిపోవాల్సి వచ్చిందని, నిబంధనలు …
Read More »బిగ్ బ్రేకింగ్ – ఎల్జీ పాలిమర్స్ సీజ్
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన అమానవీయ ఘోరకలికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆ కంపెనీని వెంటనే సీజ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం శివారులోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ విష వాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే వేల మంది ఆస్పత్రి పాలయ్యారు. అపార జంతు నష్టం, ఆస్తి …
Read More »శ్రీవారి ఆస్తుల అమ్మకాలపై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ఏదో జరిగిపోతుందని.. బ్రహ్మాండం బద్ధలైపోతున్నట్లుగా జరిగే ప్రచారానికి.. వాస్తవాలకు మధ్య అంతరం భారీగా ఉందన్నట్లుగా ఉంది టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాటల్ని చూస్తుంటే. టీటీడీకి ఉన్న నిరర్థక ఆస్తుల్ని అమ్మే హక్కుసంస్థకు ఉందని స్పష్టం చేసిన ఆయన.. ఇలా అమ్మటం ఇప్పుడే కొత్త కాదంటున్నారు. మరింత లోతుల్లోకి వెళ్లిన ఆయన సంచలన వాస్తవాల్ని వెల్లడించారు. టీటీడీ ఆస్తుల్ని అమ్మాలన్న తమ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతున్న కొన్ని మీడియాసంస్థలు.. …
Read More »అమ్మకం పాతది.. తెగింపు కొత్తది
చుట్టు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఏం చేస్తాం ఎవరైనా? ముందు సమస్యలన్నింటి నుంచి బయటకు రావాలనుకుంటారు. అంతకు ముందు.. మరో సమస్యలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా ఎక్కువమంది అనుసరించే వ్యూహమిది. అందరి బాటలో నడిస్తే ఆయన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అవకాశమే లేదు. సమస్యలన్నవి వస్తుంటాయి.. పోతుంటాయి. విమర్శలు చేస్తుంటారు. వేటిని పట్టించుకోకుండా తాను అనుకున్నపనిని.. అనుకున్నట్లుగా చేసుకుపోవటంలో కొత్త కోణాల్ని చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ప్రపంచాన్ని …
Read More »బాబుగారి సీబీఐ కామెడీపై కౌంటర్లు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ జగన్ సర్కారుపై విమర్శలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్పై సస్పెన్షన్ వేటు పడటం.. ఆయన ఇటీవల అర్ధనగ్న స్థితిలో రోడ్డు మీద కనిపించడం.. ఆయన్ని పోలీసులు చేతులు, కాళ్లు కట్టి ఆటోలో పడేసి తీసుకెళ్లడం ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లగా.. ఉన్నత న్యాయం స్థానం సీరియస్ అవడం, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం …
Read More »