ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని అన్నారు. వివేకా హత్యపై తాజాగా బయటకు వస్తున్న వాంగ్మూలాలతో జగనే దోషి అనేది స్పష్టంగా అర్ధం అవుతోందని చంద్రబాబు అన్నారు. కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్న జగన్ ను సిబిఐ విచారించాలన్నారు. నాడు సిఎంగా ఉన్న తనపై హత్యానేరం మోపి జగన్ ఎన్నికల్లో …
Read More »సర్వం సాయిరెడ్డే.. వైసీపీలో అన్ని విభాగాలకు ఆయనే బాస్
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్పటికే కొన్ని జిల్లాలను శాసిస్తున్న కీలక నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి ఇకపై సర్వం తానే అయి వ్యవహరించనున్నారు. పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అన్నింటినీ ఆయనే చూసుకునేలా.. సీఎం జగన్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇకపై పార్టీలో అన్నీ తానే అయి.. సాయిరెడ్డి వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీ అన్ని అనుబంధ …
Read More »గవర్నర్ కు కేసీయార్ కు మధ్య ఏం జరుగుతోంది?
వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లకు ముఖ్యమంత్రులకు మధ్య ఏమాత్రం పడటంలేదు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలే నిదర్శనం. ఈ జాబితాలోకి తెలంగాణా కూడా చేరుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మార్చి 7వ తేదీనుండి మొదలవ్వబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసింది. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో మొదలవ్వటం ఆనవాయితి. కానీ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనావాయితీని పాటించాల్సిన …
Read More »తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. రాజకీయ నాయకులైనా… అధికారులైనా టార్గెట్ చేయాలనుకోవడం ఆలస్యం విరుచుకుపడే రేవంత్ తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై మండిపడ్డారు. బీహార్‌లో ఎన్నికలు జరిగితే తుపాకులు, బాంబులు పట్టుకుని తిరుగుతారని వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి బీహార్ బ్యాచ్‌ను దింపారని కామెంట్ చేశారు. బీహార్ బ్యాచ్ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నారని …
Read More »ఉత్తరప్రదేశ్ దేశానికి దిక్సూచి.. మోడీ రహస్యం
కేంద్రంలో ఎవరు పాగా వేయాలన్నా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యంత కీలకం. ఇది ఎవరైనా ఒప్పుకునేదే. అయితే..ప్రధాని మోడీ ఈ విషయాన్ని గతంలో ఒప్పుకునేవారు కాదు. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ, అన్ని రాష్ట్రాలూ సమానమనే వారు. అయితే.. తాజాగా ఆయన మనసులో మాట చెప్పేశారు. ఉత్తరప్రదేశ్(యూపీ) తమకు అత్యంత కీలకమని చెప్పారు. దేశానికి ఈ రాష్ట్రమే దిక్సూచి అని వెల్లడించారు. అంతేకాదు.. అంతర్జాతీయంగా ఎదురవుతోన్న కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు …
Read More »కేసీఆర్‌కే కాదు.. కాంగ్రెస్‌కు కూడా వ్యూహకర్త దొరికాడు
తెలంగాణలో తలపండిన రాజకీయ నేతలు ఉన్నారు. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం.. రాజకీయ పక్షాలు వ్యూహకర్తలను పెట్టుకుంటున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ముందుస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ వ్యూహాలపై వ్యూహాలు వేసుకుంటున్నాయి. అయితే.. పార్టీల వ్యూహ, ప్రతి వ్యూహాలను వ్యూహకర్తలే నిర్ణయించబో తున్నారు. ‘బీజేపీ ముఫ్త్ భారత్’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోడీ వ్యతిరేక కూటమి …
Read More »ఏపీ సర్కారుపై మెగా బ్రదర్ ఫైర్
ఏపీ ప్రభుత్వంపైనా.. మంత్రికొడాలి నానిపైనా మెగా బ్రదర్ నాగబాబు ఫైరయ్యారు. సినిమా పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం సంకుచిత ధోరణితో ప్రవర్తిస్తోందని తెలిపారు. పవన్‌కల్యాణపై కక్ష సాధించ డం కోసమే ‘భీమ్లానాయక్’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవో రిలీజ్ చేయలేదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దమ్ముందా …
Read More »చిన్నాన్న హత్య.. జగన్‌కు ఇమేజ్.. సునీత చెప్పిన సంచలన విషయం
అది 2015. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకున్న దశ. ఆ సమయంలో తాడో పేడో.. అన్నట్టుగా.. టీడీపీ, వైసీపీలు ఎన్నికల రణరంగంలో పాల్గొన్నాయి. ఇలాంటి సమయంలో హఠాత్తుగా.. ఎవరూ ఊహించని విధంగా.. మార్చి 15న వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అయితే..అప్పట్లో దీనిని టీడీపీకి అంటగడుతూ.. జగన్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. `నారాసుర రక్త చరిత్ర` టైటిల్‌తో …
Read More »ప్రజలకు, జగన్‌కు లింకు తెగిపోయింది: నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు, సీఎం జగన్‌కు మధ్య లింకులు తెగిపోయాయని.. వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు భయంతో బతకాలనేది జగన్ లక్ష్యమని అన్నారు. అన్ని వ్యవస్థలపైనా సీఎం జగన్ దాడి చేస్తున్నారని.. ఇప్పుడు సినిమా పరిశ్రమపై దాడి మొదలుపెట్టారని అన్నారు. వైసీపీకి చెందిన మంత్రి స్వయంగా పోలీసులపై అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. …
Read More »వంగవీటి సైన్యం ఏకమైతే.. ఎవరికైనా చుక్కలే
కాపు నాయకుడు, పేదల ఆత్మీయ బంధువు దివంగత వంగవీటి రంగా మోహన్ రంగా స్మృత్యర్థం.. విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో రంగా కాంస్య విగ్రహాన్ని రంగా, రాధా మిత్రమండలి అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ కాంస్య విగ్రహాన్ని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధాకృష్న.. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా సైన్యం.. తలుచుకుంటే.. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. వంగవీటి …
Read More »వైసీపీ సర్కారు నిర్ణయానికి హైకోర్టు బ్రేక్..ఏం జరిగిందంటే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకువచ్చిన ఒక ఆర్డినెన్స్‌పై.. హైకోర్టు అనూహ్యంగా బ్రేకులు వేసిం ది. ఇంకో మాటలో చెప్పాలంటే.. ప్రబుత్వమే తనకు తానుగా వెనక్కి తగ్గింది. దీంతో ఇప్పుడు సర్కారు ఎలాంటి ననిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. విషయంలోకి వెళ్తే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆధిపత్యం పెరిగిపోయిందనే విమర్శలు వున్నాయి. అయినప్పటికీ.. సర్కారుఎక్కడా వెనక్కి తగ్గకపోవడం తెలిసిందే. ఈ క్రమంలో …
Read More »జగన్‌పై సినిమా తీస్తే.. 1000 రోజులు హిట్
ఏపీ సీఎం జగన్‌పై సినిమా తీయాలని.. ఉపముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గం ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. అంతేకాదు.. ఆళ్లను, ఈళ్లను కాకుండా.. ఏకంగా..జగన్ జీవితంపై సినిమా తీస్తే.. వెయ్యిరోజులు రాష్ట్రంలోనే కాకుండా.. ఓవర్ సీస్లోనూ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. సంచలన కామెంట్లు చేశారు. తాజాగా జగనన్న చేదోడు పథకం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates