ఎన్ని విమర్శలు వచ్చినా, హైకోర్టు హెచ్చరికలు చేసినా.. కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి ఇష్టపడలేదు తెలంగాణ సర్కారు. కానీ ప్రజల్లో ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడం, హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తీరు మారింది. ఏపీ తరహాలోనే ర్యాపిడ్ కిట్లు తెచ్చి కొన్ని రోజులుగా రోజుకు పదివేలకు తక్కువ కాకుండా టెస్టులు చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకపోవడంపై, వసతుల లేమిపై సోషల్ …
Read More »ఏపీలో అంబులెన్సుల దుస్థితికిది నిదర్శనం
దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది జగన్ సర్కారు. అలాగే రికార్డు స్థాయిలో ఒకేసారి వెయ్యికి పైగా 104, 108 అంబులెన్సులను అందుబాటులోకి తేవడంపైనా ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. ఐతే ఏపీలో కరోనా పరీక్షల వెనుక డొల్లతనం ఈ మధ్యే బయటికి వచ్చింది. సేకరించిన శాంపిల్స్పై పర్యవేక్షణ కొరవడటంతో ఏకంగా 2 లక్షలకు పైగా శాంపిల్స్ వృథా అయిన వైనం వెలుగులోకి వచ్చింది. …
Read More »కరోనా వ్యాక్సిన్ పరిశోధనల్ని కొట్టేస్తున్నారట
కరోనా వ్యాక్సిన్.. ఇప్పుడు ప్రపంచం దృష్టంతా దీని మీదే ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వేల మంది ప్రాణాలు బలిగొంటూ.. లక్షల మందిని అస్వస్థుల్ని చేస్తూ.. కోట్ల మందిని రోడ్డున పడేస్తూ.. దేశాల ఆర్థిక వ్యవస్థల్నే కుప్పకూలుస్తున్న కరోనా మహమ్మారిన అదుపు చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పరిశోధనలు జరుపుతున్నాయి. కరోనా పుట్టుకు కారణమైన చైనాతో పాటు ఆ వైరస్ వల్ల అత్యంత ప్రభావితం అయిన అమెరికా.. ఇంకా …
Read More »అంధుడిని బస్సెక్కించిన సుప్రియకు ఇల్లే గిప్టిచ్చిన యజమాని
చేసిన పాపం చెప్తే పోతుందిచేసిన మంచి చెప్పకుంటే ఫలిస్తుందిగుర్తుందా… సరిగ్గా 10 రోజుల క్రితం బస్సు కోసం వెళ్తున్న ఒక అంధుడి కోసం ఒక మహిళ పరుగెత్తి బస్సును ఆపి అంధుడిని ఎక్కించి పంపిన వీడియో గుర్తుందా? దేశమంతా ఆ వీడియో వైరల్ అయ్యింది. నిస్వార్థంగా ఆమె చేసిన మంచి పనికి ఇల్లు గిఫ్టుగా వచ్చింది. అద్భుతం కదా. ఆ చిరుద్యోగి పేరు. సుప్రియ. కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని …
Read More »ఏపీలో అందరూ కరోనా బారిన పడే అవకాశం – సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చాలా నెమ్మదిగా ఉంది అనుకున్న కరోనా ఇటీవల వేగం పెంచింది. రెండు మూడు రోజులు రోజుకు రెండున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కరోనాపై మరోమారు స్పందించారు. రాబోయే రోజుల్లో కరోనా సోకని వ్యక్తి ఉండకపోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. అయినా భయం వద్దని, సీరియస్ కేసుల …
Read More »ట్వీటు వీరులు…. ఈ పొలిటిషియన్లు
రాజుల కాలంలో ఒక ఊరి నుంచి మరొక సమాచారం చేరాలంటే పావురాలను ఆశ్రయించేవారు. కాల క్రమేణా సమాచార విప్లవం పుణ్యమా అంటూ ఇపుడు అరచేతిలో ఇమిడిపోయిన స్మార్ట్ ఫోన్ లో కావాలసినంత సమాచారం దొరుకుతోంది. ఇక, సమాచారం చేరవేయడానికి అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు పోటీపడుతున్నాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన సమాచార మాధ్యమం ట్విట్టర్. రాజుల కాలం నుంచి స్ఫూర్తి పొందిన ట్విట్టర్ నిర్వాహకులు తమ సంస్థ …
Read More »షోకాజ్ నోటీసు ఈవీవీ సినిమాలా ఉంది – RRR
కోపం వచ్చినప్పుడు నాలుగు తిట్లు ఘాటుగా తిడితే అదోరకం. అందుకు భిన్నంగా కామెడీ చేస్తేనే ఇబ్బంది. అందునా.. ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సీఎంకు నీడలా ఉండే విజయసాయిని ఉద్దేశించి చిన్న మాట అనేందుకు సైతం వణుకుతారు. అలాంటిది రఘురామకృష్ణంరాజు మాత్రం మాటలతో గుచ్చేస్తున్నారు. పార్టీ కట్టు తప్పారంటూ నరసాపురం …
Read More »వైసీపీ కొత్త టార్గెట్ ఫిక్స్
గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలతో పాటు ‘టార్గెట్ టీడీపీ’ పథకాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగుదేశం అగ్ర నేతల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత కొల్లు రవీంద్ర జగన్ సర్కారు దెబ్బలు రుచిచూశారు. ఒకరు అవినీతి కేసులో, ఇంకొకరు హత్య కేసులో చిక్కుకుని అల్లాడుతున్నరు. ఇప్పుడు అధికార …
Read More »రూ.4 కోట్లతో తమిళనాడులో పట్టుబడిన కారు ఏపీ మంత్రిదా?
తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామం ఏపీకి చెందిన ఒక మంత్రి ఇబ్బందికి గురి చేసేలా మారిందంటున్నారు. మంత్రి స్టిక్కర్ ఉన్న కారు కావటం.. సదరు మంత్రి ఏపీకి చెందిన నేత కావటం ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు ఒక కారును ఆపారు. ఆ కారు మీద ఏపీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపేరుతో ఉన్న …
Read More »ముద్రగడ అస్త్రసన్యాసం.. పవనే రథసారధా?
ఏపీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కారణం ఏమైనా కానీ కాపుల ఉద్యమనేత.. నిత్యం మా జాతి.. మా జాతి అంటూ కాపుల గురించి వివిధ వేదికల మీద ఓపెన్ మీద మాట్లాడే అతి కొద్ది మంది నేతల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. వివిధ పార్టీల్లో కాపు నేతలు చాలామంది ఉన్నా.. తమ సామాజిక వర్గాన్ని అందరికి చెప్పుకుంటూ.. వారి ప్రయోజనాల కోసం పాటుపడతానని చెప్పే నేతల్ని వేళ్ల మీద …
Read More »అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పేరు.. ఎమ్మెల్సీ వారికేనా?
పదవుల పంపకం విషయం ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఒకేసమయంలో దాదాపు ఆరు పదవులకు సంబంధించి అంశం కావటంతో.. ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఒక్కోపదవికి సరాసరిన నలుగురైదుగురు పోటీ పడుతుండటంతో.. ఎవరికి పదవులు వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. రెండు మంత్రి పదవులతో పాటు నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. వ్యూహాత్మకంగా తనకు సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపిన జగన్.. …
Read More »జగన్పై నాని ఫైర్
నాని అంటే వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని.. ఈ ముగ్గురిలో ఒకరు కాదులెండి. ప్రతిపక్ష తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక తమ విజయవాడ అభివృద్ధిలో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిందంటూ ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేశామని.. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నగరం మళ్లీ వెనక్కి వెళ్లిపోయిందని ఆయన …
Read More »