Political News

బీజేపీకి షాక్…ముఖ్య నేత‌కు రేవంత్ కాంగ్రెస్ కండువా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ తో బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చిందనుకుంటున్న స‌మ‌యంలో ఆ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. రాష్ట్ర సర్కారుపై మోడీ విమర్శలు, రాష్ట్రలో అధికారంలోకి రానున్న‌ట్లు చేసిన కామెంట్లతో విజిల్స్, కేకలతో కార్యకర్తలు హోరెత్తించిన ఉత్సాహం ఇంకా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే….బీజేపీ నేత బండ్రు శోభారాణి కాంగ్రెస్ లో చేరారు. అమెరికాలో ఆమె కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, …

Read More »

మహానాడు సక్సెస్.. క్రెడిట్ ఎవరి ఖాతాలోకి?

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు సాగిన ఆ పార్టీ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాల్ని చూసింది. కానీ.. పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని గడిచిన మూడేళ్లుగా ఎదురైంది. ఎప్పుడూ లేని రీతిలో అధికారపక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఒక ఎత్తు.. మరోవైపు కేసుల చిక్కులతో పాటు.. అడుగు వేస్తే ఏమవుతుందో అన్న పరిస్థితి. దీనికి తోడు.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలేమనే కొందరు స్థానిక …

Read More »

రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయ్‌.. జ‌గ‌న్ వైఫ‌ల్య‌మేనా?

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అవి కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. రాజ‌కీయంగా పెను సంచ‌నాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌.. గ‌తంలో జ‌గ‌న్‌కు సాయం చేయ‌గా.. ఇప్పుడు ఆయ‌న టీడీపీ వైపు చూస్తున్నార‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఇది జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోంది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అధినేత .. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని …

Read More »

TDP: త‌ప్పు తెలుసుకోవ‌డం కాదు… క‌రెక్ట్ చేసుకుంటారా?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌న త‌ప్పులు తెలుసుకుంది. పార్టీ ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో అంచ‌నా వేసింది. ఒంగోలు కేంద్రంగా జ‌రుగుతున్న మ‌హానాడులో పార్టీ ప‌రిస్థితిపై పోస్టుమార్టం చేప‌ట్టిన పార్టీ నేత‌లు.. రాష్ట్రం లో పార్టీ ప‌రిస్థితిని పూర్తిగా అంచ‌నా వేశారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు  నుంచి నారా లోకేష్ వ‌ర‌కు.. అంద‌రూ కూడా.. పార్టీలోని లోపాల‌ను ప్ర‌స్తావించారు. సాధార‌ణంగా.. పార్టీ అంతా బాగుంద‌ని ప‌దే ప‌దే చెప్పేస్థాయి నుంచి ఇప్పుడు …

Read More »

అఖిల వైఖరి అర్ధమే కావటం లేదుగా ?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైఖరి పార్టీ నేతలకు అర్ధమే కావటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తే పెద్దగా స్పందించలేదు. జిల్లాలోకి అడుగుపెట్టినపుడు దణ్ణం పెట్టేసి మాయమైపోయారు. రెండు రోజులు చంద్రబాబు జిల్లాలో తిరిగినా మళ్ళీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. మళ్ళీ  మహానాడు వేదిక మీద మాత్రం ప్రత్యక్షమయ్యారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభ సందర్భంగా అఖిల తమ్ముడు జగద్విఖాత్యరెడ్డితో కలిసి వేదికమీద కనిపించారు. వేదికమీద అఖిల …

Read More »

క‌రోనా క‌న్నా.. జ‌గ‌నే ప్ర‌మాద‌కారి: చంద్ర‌బాబు

వైసీపీ పాలనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు కురిపించారు. మ‌హానాడు ముగింపు సంద‌ర్భంగా ప్ర‌సంగించిన ఆయ‌న‌.. కరోనా కన్నా.. రాష్ట్ర విభజన కన్నా.. జగన్ ప్ర‌మాద‌కారి అని అన్నారు. ఆయ‌న  అనుస‌రిస్తున్న విధానాలతోనే రాష్ట్రం సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి బాబు ప్రసంగించారు. జగన్ అధ్వాన పాలనతో రాష్ట్రం అంథకారంలో కూరుకుపోయిందన్న టీడీపీ అధినేత.. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టే బాధ్యత తమదేనని …

Read More »

మ‌హానాడులో వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె

టీడీపీ మహానాడులో ఆసక్తికర  పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం నెల్లూరు జిల్లాతో పాటు అధికార వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో.. వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయ ణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన కైవల్య.. లోకేష్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య …

Read More »

సీఎం జ‌గ‌న్‌పై నోరు జారిన ఏపీ మంత్రి

సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నోరు జారారు. ఏకంగా.. ఆయ‌న వైసీపీ అధినేత‌.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన సీఎం జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్పై మాట జారారు. ముఖ్యమంత్రి జగన్ ను ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారారు.. కారుమూరి నాగేశ్వరరావు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా …

Read More »

లోకేష్ వ్యూహం సూప‌ర్‌.. సీనియ‌ర్లు గుస్సా?

ఉన్న‌ది ఉన్న‌ట్టు చెబితే..ఎవరికైనా… ఆగ్ర‌హం, ఆవేశం త‌ప్ప‌దు!  ఇప్పుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేష్ కూడా ఉన్న‌ది ఉన్న‌ట్టుగానే చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చే విష‌యంపై ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంద‌రికీ టికెట్లు ఇచ్చేది లేద‌ని వారి వారి సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేసి టికెట్లు ఇస్తామ‌ని అన్నారు. అంతేకాదు.. వ‌రుస‌గా మూడు సార్లు ఓడిపోయిన నాయ‌కుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని చెప్పారు. దీనిపైనే ఇప్పుడు …

Read More »

ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా పోరాటం

ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని తొలిసారి.. తెలంగాణ అధికార పార్టీ.. టీఆర్ ఎస్‌కు చెందిన‌ పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌తోపాటు ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచ ఖ్యాతి గడించిన ఏకైక తెలుగు బిడ్డ ఎన్టీఆర్ అని మంత్రులు కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా కృషి చేస్తామని ఎంపీ నామ తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు …

Read More »

టీడీపీ: వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ అవుట్ !

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. మహానాడులో లోకేష్ మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటే సీనియర్లు అంటే వృద్ధతరం తప్పుకోవాలన్నారు. వృద్ధతరం తప్పుకోకపోతే ఇక యువతకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని గట్టిగానే ప్రశ్నించారు. నిజానికి ఇపుడున్న సీనియర్లలో అత్యధికులు ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు చేరినవాళ్ళే. అందుకనే వాళ్ళంతా ఇపుడు ఏడు పదుల వయసు దాటిపోయారు. ఇదే విషయమై లోకేష్ …

Read More »

వైసీపీ: ఆదాయం ఎక్కువ ఖ‌ర్చు త‌క్కువ?

ఆంధ్రావ‌నికి సంబంధించి ప‌నిచేస్తున్న ఆదాయ వ్య‌యాల‌కు సంబంధించి ఓ వివ‌రం వెలుగులోకి వ‌చ్చింది. ఢిల్లీ కేంద్రంగా ప‌నిచేసే అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్ల‌డి చేసిన వివ‌రం ప్ర‌కారం ఏపీలో వైసీపీ ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చు మాత్రం త‌క్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో పార్టీల‌కు విరాళాల రూపంలో ద‌క్కే ఆదాయం విష‌యంలో టీడీపీ వెనుకంజ‌లో ఉంది. ఖ‌ర్చులో అంద‌రి క‌న్నా ముందుంది. ఆ లెక్క‌ల్లో వైసీపీ …

Read More »