తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ వాసుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా కలకలంపై ఆదిలో తీపికబురు ఇచ్చినప్పటికీ ఇప్పుడు తాజాగా షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో… కేసుల తీవ్రత ఎలా ఉందో తెలుసుకోవడానికి 50 వేల టెస్ట్‌లు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తాజాగా ఈ టెస్టులకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రంలో టెస్ట్‌లు పెరగడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య …
Read More »దీనికి వైసీపీ క్యాంప్ సమాధానం ఏంటో మరి
రఘురామకృష్ణంరాజు… నరసాపురం ఎంపీ. ఇప్పుడు ఆయనో హాట్ టాపిక్. వైసీపీ ఎంపీ అయినప్పటికీ…సొంత పార్టీ నేతలకే ఆయన పంటి కింద రాయి. కలకలం సృష్టించే కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం, నరసాపురం టీడీపీకి కంచుకోటేనని ప్రకటించడం, తనకు ప్రాణహాని ఉందంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయడం వంటి చర్యలెన్నింటితో వైసీపీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు బీపీ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయనకు …
Read More »ఏపీ సీఎంపై అభిమానం లేదు…జగన్ అంటేనే అభిమానం
ఇరు రాష్ట్రాల్లోని సమకాలీన రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న ప్రత్యేకత వేరు. సుత్తి లేకుండా …ముక్కు సూటిగా …చెప్పదలుచుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగిన నేర్పు ఉన్న నేత ఉండవల్లి. అంతటి వాగ్ధాటి…విషయ పరిజ్ఞానం ఉన్న ఉండవల్లిని సీఎం నుంచి సీనియర్ నాయకుల వరకు గౌరవిస్తారు. టీడీపీ హయాంలో బాబు సీఎంగా ఉన్నపుడు పోలవరం లెక్కలపై….టీడీపీ, చంద్రబాబులను విమర్శించిన ఉండవల్లిని, …
Read More »పతంజలి వాళ్లు అసలు కరోనా వైరస్ పేరే ఎత్తలేదట
కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేశామంటూ పతంజలి సంస్థ చేసిన ప్రకటన దేశంలో పెద్ద చర్చకే దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు అలోపతి మందు కోసం లక్షల మంది శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ నిర్దిష్టమైన మందును కనిపెట్టలేదు. వైరస్ ప్రభావాన్ని కొంత మేర తగ్గించే మందులేవో తెచ్చారు తప్ప.. దీంతో వైరస్ పూర్తిగా తగ్గిపోతుందని ఎవ్వరూ చెప్పడం లేదు. ఇలాంటి తరుణంలో పతంజలి సంస్థ కేవలం 545 రూపాయల …
Read More »కరోనా బారినపడి మరో ఎమ్మెల్యే మృతి
కరోనాకు కనికరం లేదు….జాలి దయ అంతకన్నా లేదు…అందుకే కటిక పేదవాడి నుంచి కరోడ్ పతి వరకు ఎవరిపైనా వివక్ష చూపకుండా కాటేస్తోంది. రాజకీయ నేతలను…సామాన్యులను ….ఇలా తన బారినపడ్డవారిని కబళిస్తూ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా చాలామంది ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని డీఎంకే ఎమ్మెల్యే అనబళగన్ కరోనా బారినపడి మరణించారు. ఇపుడు తాజాగా పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ నేత, …
Read More »విజయవాడలో లాక్‌డౌన్.. పెట్టినట్లే పెట్టి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టడం గురించి నిన్న సాయంత్రం నుంచి తెగ చర్చ నడుస్తోంది. తమిళనాడులో కొన్ని సెలెక్టివ్ సిటీలు, టౌన్లలో లాక్ డౌన్ పెట్టినట్లే ఏపీలో విజయవాడలో లాక్ డౌన్ పెడుతున్నట్లు నిన్న మధ్యాహ్నం నుంచి ప్రచారం మొదలైంది. సాయంత్రం నిజంగానే లాక్ డౌన్ ప్రకటన చేశారు కూడా. కలెక్టర్ ఇంతియాజ్ పేరుతో ప్రెస్ నోట్ కూడా మీడియాకు రిలీజ్ చేశారు. విజయవాడలో కరోనా …
Read More »వైసీపీలో సాయిరెడ్డి స్థానం చెక్కుచెదర్లేదా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసును వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేరుతో విడుదల చేసింది. తద్వారా, మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి …
Read More »బీజేపీకి దిమ్మతిరిగి బొమ్మ చూపిస్తున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఏంటో? ఆయన అనుసరించే విధానాన్ని సహజ శైలిగా భావించాలా లేకపోతే తమను ఇరకాటంలో పడేసే గేమ్ ప్లాన్ అనుకోవాలో తెలియక బీజేపీ నేతలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. కరోనా కష్టకాలం తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలో అనుసరించిన వైఖరిని… ఇప్పుడు విరుచుకుపడుతున్న విధానాన్ని విశ్లేషిస్తున్న కమలనాథులు తమను గులాబీ పెద్ద టార్గెట్ చేశారని డిసైడ్ అవుతున్నారు. భారతదేశంలో కరోనా విస్తృతి మొదలైన తరునంలో మిగతా …
Read More »బాబు -జగన్ – బాబు … ఈ సంప్రదాయం కొనసాగాల్సిందేనా?
కొద్ది రోజుల క్రితం ఏపీలోని రాజకీయ పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చేలా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా ఎక్కువగా వైరల్ అయ్యింది. ధాని సారాంశం ఏమంటే.. 151 మేకలు.. 23 పులులు.. అంటూ సింగిల్ లైన్ లో పెట్టిన ఈ పోస్టు ఎక్కువగా షేర్ అయ్యింది. తర్వాతేమైంది? అన్న విషయంలోకి వస్తే.. ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. గంటల తరబడి కూర్చోబెట్టారు. అంతేనా.. …
Read More »ఏపీలో ఆ పరీక్షలు కూడా రద్దు
కరోనా దెబ్బకు ఈ ఏడాది అన్ని కార్యకలాపాలూ నిలిచిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు ఏవీ ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు. చాలా తరగతులవి పరీక్షలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి తలెత్తింది. మార్చిలో టెన్త్, డిగ్రీ పరీక్షలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం.. దాన్ని పొడిగించుకుంటూ వెళ్లడంతో పరీక్షల నిర్వహణ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో ముందు తెలంగాణలో పదో తరగతి …
Read More »వైసీపీలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరిక ఖాయమేనా?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ….ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచతమైన పేరు. గతంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సందర్భంగా లక్ష్మీ నారాయణ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ…జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే, జనసేనాని మళ్లీ సినిమాలు చేయాలన్న నిర్ణయం నచ్చని లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు లక్ష్మీనారాయణ పావులు కదపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, …
Read More »ఏపీ డీజీపీ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?
కొన్నిసార్లు అంతే. వ్యవస్థలోని కొందరు చేసే తప్పులకు అత్యున్నత స్థానంలో ఉన్న వారు ఇరుకున పడుతుంటారు. తాజాగా అలాంటిదే ఏపీలో చోటు చేసుకుంది. తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర హైకోర్టుకు స్వయంగా హాజరు కావాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర పోలీస్ బాస్ స్వయంగా కోర్టు హాజరై.. న్యాయమూర్తి ముందు సమాధానం చెప్పాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. రూల్ బుక్ లోని నిబంధనల్ని …
Read More »