Political News

సుప్రీం కీలక వ్యాఖ్య.. కోర్టు నోటీసులు వాట్సాప్ లో పంపొచ్చు

గడిచిన కొద్ది నెలలుగా కరోనా కారణంగా అతలాతకులమైపోతున్న వేళ.. చాలా పనులకు ఇబ్బందికరంగా మారింది. ఇంట్లోనే ఉండాల్సి రావటం.. బయటకు వస్తే వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలు వ్యవస్థలు పని చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పలు రంగాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా అలాంటి నిర్ణయమే ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా ప్రబలిన నేపథ్యంలో అందుబాటులో …

Read More »

వావ్.. తెలంగాణలో ఒకే రోజు అన్ని టెస్టులా?

దేశంలోనే అత్యల్పంగా కరోనా పరీక్షలు చేసిన, చేస్తున్న రాష్ట్రంగా గత నెల వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది తెలంగాణ. ఓవైపు పక్కన్న ఆంధ్రప్రదేశ్‌లో లక్షలకు లక్షలు టెస్టులు చేస్తుంటే.. అందులో పదో శాతం టెస్టులతో తెలంగాణ బాగా వెనుకబడిపోయింది. పరీక్షలు చేయకుండా కరోనాను నియంత్రించడం చాలా కష్టమని.. ఎవరెంతగా మొత్తుకున్నా ప్రభుత్వం పెద్దంగా స్పందించినట్లు కనిపించలేదు. హైకోర్టు జోక్యం చేసుకున్నా టెస్టుల సంఖ్య పెరగలేదు. ఐతే ఉన్నత న్యాయస్థానం మరోసారి …

Read More »

అరెరె… ఈ ఐడియా 10 రోజు ముందు ఇచ్చి ఉంటే

https://www.youtube.com/watch?v=H9tg-Vb_uvQ&feature=youtu.be ఓవైపు హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తుంటే.. అదే సమయంలో నగర నడిబొడ్డున ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చే పనిలో ప్రభుత్వం పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సమయంలో ఈ పని అవసరమా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఈ పని కరోనా కోసం ఎంతో కష్టపడుతున్న వైద్యులకు, కరోనాతో అవస్థలు పడుతున్న జనాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటూ ప్రశ్నించారు విజయలక్ష్మి అనే వైద్యురాలు. కరోనాపై పోరులో అత్యంత …

Read More »

కాంగ్రెస్ కు మరో షాకివ్వనున్న కేసీఆర్?

నా స్టోరీ చెప్పాలంటే తెలంగాణకు ముందు తెలంగాణకు తర్వాత…అని ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర చెప్పాలన్నా… ప్రత్యేక తెలంగాణా ఇవ్వక ముందు…ఇచ్చిన తర్వాత అని చాలాకాలంగా సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్….కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు వస్తోన్న ప్రతి అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయడానికి …

Read More »

బ్రేకింగ్.. సచివాలయం కూల్చివేతకు బ్రేక్

కరోనా విజృంభిస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సెక్రటేరియట్ భవనాల కూల్చివేత పనుల్లో నిమగ్నం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికప్పుడు అత్యవసరంగా ఈ పని చేపట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆక్షేపించాయి. ఐతే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా సీరియస్‌గా సెక్రటేరియట్ కూల్చివేత పనులు చేపడుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఐతే శుక్రవారం హైకోర్టు.. తెలంగాణ …

Read More »

ఎవరీ స్వప్న సురేశ్? ఆ రాష్ట్ర సీఎంకే చుక్కలు చూపించింది

గడిచిన కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో భారీగా కవర్ అవుతున్న ఒక ఉదంతం తెలుగు మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా పెద్దగా వార్తలు రాని పరిస్థితి. కరోనా ఎపిసోడ్ లో దేశంలోనే అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిగా కేరళ సీఎం పినరయి విజయన్ పేరును సొంతం చేసుకున్నారు. దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు కేరళలోనే. ఆ తర్వాత కూడా వరుస పెట్టి కేసులు నమోదయ్యాయి. అలాంటిది.. వైరస్ …

Read More »

కరోనా పరీక్షల కోసం ఏపీ సర్కారు మరో వినూత్న ప్రయోగం

కరోనాపై పోరాటంలో మొదట చాలానే విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ వైరస్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ తర్వాత ఆయనకు వాస్తవం బోధపడింది. వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కరోనాపై పోరులో దేశంలోనే అత్యంత మెరుగ్గా చర్యలు చేపడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ పేరు తెచ్చుకుంది. కరోనాను కట్టడి చేయడంలో సాధ్యమైనంత …

Read More »

జగన్ చేసిన పని పవన్ ఎందుకు చేయరు?

2019 ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకైనా మంచిదని…ఒకటికి రెండు చోట్ల పోటీ చేశారు జనసేనాని పవన్. అయితే, ఏపీలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పవన్ ఫ్యాన్స్ గాలి జనసేన గెలుపునకు సరిపోలేదు. జనసేనకు ఘోర పరాభవవం తప్పదేమో అన్న తరుణంలో చీకట్లో చిరుదివ్వెలా జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలుపొందారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయిన రాపాక వరప్రసాద్….అనూహ్య విజయం సాధించి …

Read More »

ట్విట్టర్ ట్రెండ్: మంత్రిగారూ అడ్మిషన్ ప్లీజ్

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో …

Read More »

భారత్‌లో కరోనా.. భయపెడుతున్న ఎంఐటీ ఫిగర్స్

రెండు నెలల కిందట ఇండియాలో రోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్నపుడే వామ్మో వామ్మో అంటూ మాట్లాడుకున్నాం. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారంటే అయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు 20 వేల మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఐతే ఇదే పీక్స్ అనుకుని.. త్వరలో మంచి రోజులు వస్తాయని …

Read More »

రఘురామకృష్ణంరాజుతో మైండ్ గేమ్ మొదలు పెట్టిన జగన్

పార్టీలో ఉంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైయస్ జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. రఘురామ గత కొంతకాలంగా చాలా వ్యూహాత్మకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఓ వైపు అధినేతను ప్రశంసిస్తూనే, పార్టీలో నేతలపై, పార్టీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై జగన్ చర్యలు తీసుకోని విధంగా ముందుకు కదిలారు. దీంతో ఇప్పుడు జగన్ రివర్స్ స్ట్రాటజీలో వచ్చారు. రఘురామకృష్ణంరాజుపై నర్సాపురం నియోజకవర్గంలో వరుసగా …

Read More »

బీజేపీ చీలిపోతోందా..వైసీపీ చీల్చుతోందా?

ఏపీ బీజేపీ ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆ పార్టీలోని అంత‌ర్గ‌త ప‌రిణామాల‌పై రాజ‌కీయ విశ్లేష‌కులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏకంగా వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌న్నిహితుడ‌నే పేరున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు స్పంద‌న ఓ ర‌కంగా ఉంటే మ‌రోవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీరు భిన్నంగా ఉంద‌ని ప్ర‌స్తావించారు. త‌ద్వారా …

Read More »