పులివెందులలో వైఎస్ కుటుంబంపై పోటీ చేసిన నేతగా ఆయనకు గొప్ప పేరుంది.. తెగించి మరీ పార్టీని ముందుకు నడిపారనే గుర్తింపు ఉంది. కానీ ఆ నేత ప్రస్తుత రాజకీయ భవిష్యత్ అయోమయంగా మారింది. ఇప్పుడు ఏ పార్టీలో లేక.. ఏం చేయాలో పాలుపోక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని తెలిసింది. ఆ నాయకుడే సతీష్ రెడ్డి. కడప జిల్లా సీనియర్ నేత అయిన సతీష్ ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. టీడీపీకి రాజీనామా …
Read More »భీమ్లాతో పండగ చేసుకుంటున్న వైసీపీ!
పోయినేడాది వకీల్ సాబ్.. ఇప్పుడేమో భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాలపై ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు ఎలా ఉక్కుపాదం మోపిందో అందరికీ తెలుసు. వకీల్ సాబ్‌కు ఉన్నట్లుండి టికెట్ల రేట్లు తగ్గించేసి, స్పెషల్ షోలేవీ పడకుండా చూసి ఆ సినిమాను గట్టి దెబ్బే తీసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ అదే జరుగుతోంది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను వేరే …
Read More »జగన్ మాటకు విలువ లేదా?
టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం. త్వరలోనే కొత్త రేట్లు వస్తాయి. ఐదో షోకు కూడా అనుమతి ఇస్తాం.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు తనను కలిసినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలివి. ఇప్పుడున్న రేట్లతో థియేటర్లు నడపడం కష్టమన్న వాదనతో ఆయన ఏకీభవించారు. టికెట్ల ధరలు సవరించాల్సిన అవసరాన్ని గుర్తించినట్లే మాట్లాడారు. ఆయనతో పాటు చిరు బృందంలోని వారు …
Read More »అమరావతి: ఉద్యమం ఆగదు ఫలితం తేలదు?
అమరావతి ఉద్యమానికి 800 రోజులు పూర్తయ్యాయి నేటితో..ఈ నేపథ్యంలో ఉద్యమం ఉద్ధృతి మాత్రం తగ్గబోదని సంబంధిత నిరసనకారులు, భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన రైతులు ముక్త కంఠంతో చెబుతున్నారు.ఆ రోజు తాము భూములు ఇచ్చింది రాష్ట్రా ప్రభుత్వానికే తప్ప చంద్రబాబు కో లేదా తెలుగుదేశం పార్టీ కో కాదని అంటూ వీళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. తమ సమస్యను కులం కోణంలో కాకుండా సామాజిక ఇతివృత్త పరంగా చూడాలని వేడుకుంటున్నారు. ఈ …
Read More »పవన్‌కు మద్దతుగా సీమ రెడ్డి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `బీమ్లా నాయక్` ఓ వైపు విడుదలకు సర్వం సిద్ధం చేసుకోగా మరోవైపు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మౌఖిక ఆదేశాలు వెలువరించడం సంచలనంగా మారింది. టికెట్ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంపై సినీ వర్గాలు, పవన్ ఫ్యాన్స్ స్పందిస్తుండగా తాజాగా రాయలసీమకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్టయ్యారు. సినిమాలపై …
Read More »ఆనం చూపు.. మళ్లీ టీడీపీ వైపు!
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలే వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. అలాంటి నాయకుల్లో వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జగన్‌ను కలవాలనుకుంటే ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకలేదని …
Read More »తనయుడి కోసం తప్పుకోనున్న బొత్స!
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ తన పొలిటికల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా? రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి తన తనయుడి రంగప్రవేశం కోసం ఆయన తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని, తన కొడుకును బరిలో దించుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు, వయసుకు పెద్దగా సంబంధం లేకపోయినా బొత్స సత్యనారాయణ ప్రస్తుతమున్న రాజకీయాల నుంచి …
Read More »కేటీఆర్‌తో పవన్.. బీజేపీకి రాంరాం!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కదులుతున్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశారు. కాంగ్రెస్, బీజీపీయేతర కూటమి ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలను కూడా దగ్గరికి తీసుకోవడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీపై పోరు బావుటా ఎగరేసిన …
Read More »గ్రేటర్ పై టీ కాంగ్రెస్ ఫోకస్..!
గ్రేటర్ హైదరాబాద్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో వేగం పెంచుతూ శ్రేణుల్ని అప్రమత్తం చేస్తోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీనియర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారు. పాత కాపులను క్రియాశీలం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడితే అత్యల్పంగా సికింద్రాబాద్ లోనే నమోదు అయ్యాయి. …
Read More »వివేకా హత్య కేసు నిందితులకు జగన్ అభయం.. టీడీపీ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేస్తుందని టీడీపీ నేత బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదేనని వ్యాఖ్యానించారు. వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల ఫోన్ నెంబర్లు.. రాష్ట్ర పోలీసుల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేరుతున్నాయని ఆరోపించారు. గతంలో.. …
Read More »భీమ్లా నాయక్‌పై రాజకీయ కత్తి.. ఏపీలో తీవ్ర వివాదం
పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను జగన్ సర్కార్ వెంటాడుతోంది. శుక్రవారం ఈ సినిమా విడుదలకు ఏపీ, తెలంగాణలో చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంది. ఈ సమయంలో ఏపీలో భీమ్లా నాయక్ మూవీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో భీమ్లా నాయక్ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని …
Read More »మంత్రి కొడాలికి చెక్.. చంద్రబాబు వ్యూహం ఇదే
రాజకీయాల్లో శత్రువును గెలవాలంటే.. అంతకన్నా బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. సదరు ప్రత్యర్థికి ముకుతాడు వేయాలంటే.. ప్రత్యర్థి బలాన్ని బలంగా ఢీకొనే వ్యూహాలు రచించాలి. ఇప్పుడు ఇదే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారట.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆయనకు కంట్లో నలుసులా.. చెప్పులో రాయిలా.. తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్న నాయకుడు.. వైసీపీలోని ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని. టీడీపీని ఎందరో వైసపీ నాయకులు టార్గెట్ చేస్తున్నా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates