బ్రదర్ అనిల్‌కుమార్. ఏపీ సీఎం జగన్‌కు సొంత బావమరిది. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన ఆయన వచ్చే 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా చక్రం తిప్పడం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు.. త్వరలోనే ఆయన తీసుకునే నిర్ణయం.. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని, పార్టీని కూడా తీవ్రస్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అసలు ఏం జరిగిందంటే.. ఏపీలో జగన్ అధికారంలోకి …
Read More »AP కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..11న బడ్జెట్
సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నెల 3ననే జరగాల్సి ఉన్న ఈ కేబినెట్ భేటీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్ద కర్మ నేపథ్యంలో నేటికి వాయిదా పడింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో 35 అంశాలతో కూడిన అజెండాపై మంత్రులతో జగన్ చర్చ జరిపారు. ఇక, ఈ నెల 25 వరకు మొత్తం 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని, …
Read More »ఎగ్జిట్ పోల్స్.. బీజేపీకే యూపీ ప్రజల పట్టం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ క్రమంలో అతి పెద్ద రాష్ట్రం, బీజేపీ నేతలు అత్యంత కీలకంగా తీసుకున్న రాష్ట్రం యూపీలో ఓటర్లు మళ్లీ బీజేపీకే అధికారాన్ని కట్టబెట్టనున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఏడో విడత పోలింగ్‌తో.. మినీ సార్వత్రిక సమరంగా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. అంతకుముందే.. …
Read More »చంద్రబాబు వయసు గుర్తు లేదా జగన్?: అచ్చెన్న
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు సభ రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి గవర్నర్ హరిచందన్ వత్తాసు పలుకుతున్నారని, గో బ్యాక్ గవర్నర్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ తర్వాత ప్రభుత్వ తీరుపై, గవర్నర్ వ్యవహార శైలిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదని, గవర్నర్ పేరును వాడుకొని …
Read More »అప్పటి వరకు ఏపీకి రాజధాని హైదరాబాదే: మంత్రి బొత్స
ఏపీ రాజధాని అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన …
Read More »తెలంగాణ అసెంబ్లీ…బీజేపీ ఎమ్మెల్యేేల అరెస్టు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళం, నినాదాల మధ్య ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభలోనే ఆర్ఆర్ఆర్ త్రయంపై వేటుపడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ లపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలను ప్రారంభించడంపై ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కు లేదని విమర్శించారు. …
Read More »PK : గాయాలు.. దాడులు.. హత్య కుట్రలు
2019 ఎన్నికలకు ముందు ఏపీలో జగన్‌పై కోడి కత్తితో ఎటాక్.. గతేడాది పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు సీఎం మమతా బెనర్జీ కాలికి కట్టు.. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర కేసు.. ఈ మూడు విషయాలు వేరు. వేర్వేరు రాష్ట్రాల్లో ఇవి జరిగాయి. కానీ వీటి వెనక ఓ వ్యక్తి ఉన్నారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. తనను నమ్ముకున్న పార్టీలను గెలిపించడం కోసం …
Read More »ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్.. ఏం జరిగింది?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే.. తొలి రోజే.. సభల తీవ్ర రభస చోటు చేసుకుంది. గవర్నర్ `గో బాక్` అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా మొదలయ్యాయి. సభ ప్రారంభంకాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలైంది. కాగా.. గవర్నర్ ప్రసంగానికి …
Read More »బీజేపీ నుంచి సిగ్నల్ రాలేదా?
గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచినప్పటి నుంచి రఘురామ కృష్ణం రాజు సొంత పార్టీకే పక్కలో బళ్లెంలా మారారు. రెబల్ ఎంపీగా మారి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. వివిధ చర్యలతో జగన్‌ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ చేసిన ఫిర్యాదు ఇంకా పెండింగ్‌లో ఉంది. …
Read More »ఇవి తేలితే.. రాష్ట్రపతి ఎన్నికలపై క్లారిటీ!
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల సమరం ముగింపు దిశగా సాగుతోంది. ఈ నెల 10న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో పార్టీల భవిష్యత్ ఏమిటన్నది తేలుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకోబోతుందన్న విషయంపై స్పష్టత వస్తుంది. అయితే ముఖ్యమంత్రుల భవితవ్యాన్నే కాదు.. ఈ ఎన్నికల ఫలితాలు తదుపరి రాష్ట్రపతిని నిర్ణయించడంలోనూ అత్యంత కీలకం కానున్నాయి. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ …
Read More »వివేకా హత్య.. త్వరలోనే రంగంలోకి ఈడీ!!
మాజీమంత్రి వివేకా హత్యకు సుపారీగా చెల్లించిన డబ్బును నిందితులకు ఎవరిచ్చారు? అంత మొత్తం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందనే అంశాలపై సీబీఐ కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. వివేకాను అంతమొందిస్తే దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తారని… అందులో రూ. 5 కోట్లు తనకు ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టు అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ఆర్థిక మూలాలను లెక్కతేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ …
Read More »చివరి క్షణంలో టీడీపీ మనసు మార్చుకుందా ?
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో చివరి నిముషంలో తెలుగుదేశంపార్టీ మనసు మార్చుకున్నట్లుంది. ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీకి హాజరయ్యేది లేదని గత సమావేశాల్లో చంద్రబాబునాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ అందరికీ తెలిసిందే. చంద్రబాబు శపథం చేశారు సరే మరి మిగిలిన సభ్యుల సంగతి ఏమిటి ? అనే విషయంలో పార్టీలోనే ఇన్ని రోజులు బాగా అయోమయం ఉండేది. అయితే ఇపుడు ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది. ఎందుకంటే సొమవారం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates