మంత్రులు-మౌనాలు.. అస‌లేంటి క‌థ‌…!

వైసీపీ మంత్రులు ఉల‌క‌రు.. ప‌ల‌క‌రు. పోనీ.. ఎక్క‌డైనా పెద‌వి విప్పారా.. వివాదాల‌కు కేంద్రాలు అవుతున్నారు. దీనిని స‌రిదిద్దుకోవ‌డం.. పార్టీకి, పార్టీ అధినేత జ‌గ‌న్‌కు త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. దీంతో మంత్రులు మౌనంగా ఉంటున్నారా? లేక‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే మౌనం పాటిస్తున్నారా? అంటే.. ఉద్దేశ పూర్వ‌కంగానే మౌనంగా ఉంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి తిర‌గ‌బడితే.. త‌మ దారి తాము చూసుకునేందుకు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇప్ప‌టికే దొడ్డి దారి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

వీరిలో మంత్రులు కూడా ఉన్నార‌నే గుస‌గుస కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే.. కొత్త‌గా మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టిన వారికి కూడా ఈ భ‌యం ఎందుకు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ప‌ద‌వులు ద‌క్క‌ని వారు.. లేదా ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి సందేహాలు ఉన్నాయ‌నంటే.. అనుకోవ‌చ్చు. కానీ.. మంత్రులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వారు భ‌య‌ప‌డుతున్నార‌నేది వైసీపీ అధిస్టానానికి అందుతున్న స‌మ‌చారం. ఇటీవ‌ల మంత్రుల విష‌యంలో ప్రోగ్రెస్ కార్డును జగ‌న్ తెప్పించుకున్నారు. దీనిలో చాలా మంది అస‌లు కార్యాల‌యం దాట‌లేద‌ని తెలిసింది.

దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు.. వారు ఏం చేస్తున్నారు ? ఎక్క‌డ ఉంటున్నారు ? అనే విష‌యాల‌ను ర‌హ‌స్యంగా తాడేప‌ల్లి వ‌ర్గాలు సేక‌రిస్తున్నారు. వీరిలో ప్ర‌స్తుతం న‌లుగురు నుంచి ఐదుగురు వ‌ర‌కు మంత్రులు భ‌య‌ప‌డుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనిని పార్టీ నేత‌లు తీవ్రంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా ఉన్నాయనేది వాస్త‌వ‌మే. అంతేకాదు..గత ఎన్నిక‌ల్లో వీరు.. చాలా మంది సీఎం జ‌గ‌న్ ఫొటోతో విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఇప్పుడు ఒంట‌రి గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల‌న్న అధిష్టానం సూచ‌న‌ల‌ను వారు పాటించ‌లేక పోతున్నారు.

మ‌రో వైపు.. మ‌రో రెండే ళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తున్నందున‌.. పోటీ చేయాలంటే.. అంతో ఇంతో వెనుకేసుకోవాల‌ని.. సీమ జిల్లాల‌కు చెందిన కొంద‌రుమంత్రులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. దీంతో వారు నోరు పారేసుకుంటే.. వ‌చ్చేది ఏమీ ఉండ‌దు.. మౌనంగా ఉంటే ప‌ని జ‌రిగిపోతుంది. అయినా,, నోరు పారేసుకుని.. పార్టీ త‌ర‌ఫున మాట్లాడి ప్ర‌తిప‌క్షాల‌కు కంటు అవ‌డం మిన‌హా ఒరిగేది ఏముంటుంది.. ? అనే నిరాస‌ను కూడా వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. మంత్రుల వ్య‌వ‌హార శైలి మాత్రం మారాల్సిందేనేని అధిష్టానం తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింద‌ని తెలుస్తోంది.