వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గ్రాఫ్ పెరిగిందా? తరిగిందా? ఏం జరుగుతోంది? ఇదీ.. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కీలక చర్చ. దీనికి కారణం .. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది. జనసేన-టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ.. నరసాపురం టికెట్‌ను మాత్రం టీడీపీకే కేటాయిస్తారని సమాచారం. టీడీపీ తరఫున తాను పోటీచేయనున్నట్టు చూచాయగా సదరు ఎంపీ చెబుతున్నారు. …
Read More »ఆత్మసాక్షిగా… పొత్తు పెట్టుకుంటేనే గెలుపు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్నాయి. మరో ఏడాది లోపే పోలింగ్ నిర్వహించి తదుపరి ప్రభుత్వంపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఎన్నికల సంఘానికి ఉంది. విజయంపై ఎవరి ధీమా వారికి ఉంది. సీఎం జగన్ వై నాట్ 175 అంటే అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామని అంటున్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న నినాదంతో టీడీపీ ఇప్పటికే ఒక రేంజ్ తో దూసుకుపోతోంది. ఇరు వర్గాలు యమ స్పీడులో ఉండటంతో ఎవరు …
Read More »కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలు కాబట్టి ఆశావహుల నుండి కేసీయార్ పై సహజంగానే ఒత్తిడి పెరిగిపోతోంది. ఈనెల 29వ తేదీన ఎంఎల్ఏల కోటాలో ముగ్గురు ఎంఎల్సీల పదవీకాలం ముగుస్తోంది. మూడుస్ధానాల్లోను ఇపుడు అధికార బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి భర్తీ కాబోయే స్ధానాలు కూడా అధికారపార్టీకే దక్కబోతున్నాయి. నామినేషన్ వేస్తే గెలిచిపోతారు కాబట్టే ఈ మూడుస్ధానాలను దక్కించుకునేందుకు నేతల మధ్య పోటీ బాగా పెరిగిపోతోంది. నవీన్ …
Read More »ఆశచావని జూనియర్ కోడెల
రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎక్కడా నిరాశ చెందకుండా జీవితాంతం పదవీకాంక్షతో కొనసాగడమే రాజకీయమవుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గెలవలేమని, పార్టీ టికెట్ రాదని తెలిసి కూడా రోజూ ప్రకటనలు ఇస్తూ ఆశగా చూడటమే రాజకీయమనాల్సి ఉంటుంది.. దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఓడిపోయిన తర్వాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. పైగా ఆయన్ను …
Read More »అవినాష్ రెడ్డికి మళ్లీ సమన్లు
సీబీఐ వదల బొమ్మాళి అంటోంది. వైఎస్ వివేనానంద రెడ్డి హత్య కేసులో విచారణకు రాకుండా జాప్యం చేసే వారిని వెంటబడి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంతటివారైనా సరే సీబీఐ అధికారులు వెళ్లి నోటీసులు ఇచ్చి వస్తున్నారు. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది…. సోమవారం హాజరు కావాలని అవినాష్ కు ఇటీవల సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. పులివెందుల వెళ్లి మరీ నోటీసులు అందజేశారు. తేదీ మార్చడం …
Read More »జగన్ ను ‘‘సార్’’ అనే పిలవాలి… అందుకే బయటకొచ్చా!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గతంలో అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన నేతల్లో ఒకరు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. జగన్ చేతిలో అధికారంలో లేనప్పుడు ఆయనకు దగ్గరగా ఉండేవారు. విపక్షంలో ఉన్న వేళలో జగన్ ను కాదని.. టీడీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లటం తెలిసిందే. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇంతకూ జగన్ తో …
Read More »నియోజకవర్గం మార్పు… రోజా కష్టాలు ఎలా ఉన్నాయంటే!
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాకు నియోజకవర్గం కష్టాలు ముసురుకున్నాయి. ప్రస్తుతం నగరి నియోజక వర్గం నుంచి రెండు సార్లు విజయం దక్కించుకున్న ఆమెకు.. వచ్చే ఎన్నికల్లో మార్పు తప్పదనే సంకేతా లు వచ్చేశాయి. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమని పార్టీ అంచనా వేసేసింది. పార్టీలోని సొంత నేతలే.. ఆమెకు ఎగస్పార్టీగా మారిపోయారు. దీనికి తోడు నగరిలో రోజాకు అసమ్మతి వర్గంగా ఉన్న …
Read More »ఇండియాలో జీఎస్టీ, ఏపీలో జేఎస్టీ !
ఒక దేశం.. ఒక పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి విషయంలోనూ వెంబడిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ జీఎస్టీకి కంటే కూడా జేఎస్టీ మరింత పవర్ ఫుల్ అని.. ఏపీలో దీని హవా మామూలుగా లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఇంతకూ ‘‘జేఎస్టీ’’ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘జగన్ సెల్ప్ ట్యాక్స్’’ అంటూ …
Read More »నాలుగేళ్లయినా.. ఈ ‘క్రయ్యింగ్’ బాలేదు అంబటి సర్!!
పోలిగా పోలిగా బొంకరా.. అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత! అన్నట్టుగా.. ఇంకా.. చంద్రబా బు – ఆయన పాలన-అప్పటి నష్టం-ఇప్పటి కష్టం.. అంటూ.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు కన్నీరు పెడు తూ చెబుతున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఏమైంది సర్.. అని అడగడ మే పాపం.. లాంగ్ లాంగ్ ఏగో.. అంటూ.. చంద్రబాబు హయాంలోకి పరుగులు పెడుతున్నారు అంబటి. తాజాగా మరోసారి పోలవరంపై ఆయన మాట్లాడారు. …
Read More »ఔను.. ఉద్యోగులు మాకు ఓటేయరు: డిప్యూటీ స్పీకర్
వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులు వ్యతిరేకంగా మారడం ఖాయమని, ఉద్యోగులు ఆశించినవి ఒక్కటి కూడా వైసీపీ ప్రభుత్వం నెరవేర్చడం లేదని.. విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇప్పటి వరకు వైసీపీనాయకులు పెదవి విప్పి కామెంట్లు చేయలేదు. కానీ, తాజాగా డిప్యూటీ స్పీకర్, విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఔను.. ఉద్యోగులు మాకు వచ్చే ఎన్నికల్లో వేటు వేస్తారని …
Read More »నల్లారికే పీలేరు టికెట్
టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. యాత్రకు వచ్చిన జనాన్ని చూసి లోకేష్‌కు పట్టరాని ఆనందం కలుగుతోంది. యాత్ర 500 కిలోమీటర్ల మైలురాయి దగ్గర పడుతోంది. యాత్రలో భాగంగా రైతు, కర్షక, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలను లోకేష్ పలుకరిస్తున్నారు. వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలం, ఏం చేస్తామో కూడా లోకేష్ …
Read More »మోడీపై మూకుమ్మడి దాడి స్టార్ట్
ప్రతిపక్షాల నేతలు నరేంద్రమోడీపై లేఖా యుద్ధాన్ని మొదలుపెట్టారు. దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేయటంపై నలుగురు ముఖ్యమంత్రులు మోడీకి లేఖ రాశారు. దర్యాప్తు సంస్ధలను ప్రయోగించి విపక్షాలను వేధింపులకు గురిచేయటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తు ముఖ్యమంత్రులు కేసీయార్, మమతాబెనర్జీ, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ కూడా సంతకాలు చేశారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిసోడియా అరెస్టును …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates