Political News

అమ్మడం, అప్పు చేయడం, అధిక పన్నులు వేయడం..

Tulasi Reddy

గ‌త కొద్దికాలంగా, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందున్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి తాజాగా మ‌రోమారు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ్మడం, అప్పు చేయడం, అధిక పన్నులు వేయడం.. ఇదే జగన్ త్రిసూత్ర పాలన అంటూ విమర్శించి సంచ‌ల‌నం సృష్టించిన ఆయ‌న తాజాగా రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ బిల్లుల‌కు ఆమోద ముద్ర ప‌డిన త‌ర్వాత మ‌రో కామెంట్ చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని, …

Read More »

బాబు నోట ఎప్పుడూ రాని మాట వచ్చిందే?

Chandrababu naidu

తెలుగు రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతిఒక్కరికి టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన్ను అభిమానించే వారెందరో.. విమర్శించే వారు కనిపిస్తారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న ఆయన తీరు మూసపోసినట్లుగా ఒకే ధోరణిలో ఉంటుంది. ప్రాక్టికల్ గా ఉండే మాటల్లో భావోద్వేగం చాలా తక్కువ. ఎప్పుడో ఒకట్రెండు సార్లకు మించి ఆయన నోటి వెంట ఆ తరహా మాటలు వినిపించవు. ఇక.. తన రాజకీయ భవిష్యత్తు ఎలా …

Read More »

నారా లోకేష్ కూడా మొదలెట్టాడు

Lokesh

సోషల్ మీడియా పవరేంటో మన నాయకులందరికీ బాగానే అర్థమవుతున్నట్లుంది. ఇందులో జనాల సమస్యలు తమ దృష్టికి వచ్చినపుడు వెంటనే స్పందించి సాయం చేసే ప్రయత్నం చేస్తే తమకు మంచి గుర్తింపు వస్తుందని.. తమ ఇమేజ్ పెరుగుతుందని నాయకులు అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావుకు సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది ఇలాగే. ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. తనను ట్యాగ్ చేస్తూ ఎవరు ఏ సమస్యను …

Read More »

మూడు రాజధానుల బిల్లు ఆమోదంపై పవన్ స్పందనేంటి?

మొత్తానికి ఉత్కంఠ వీడిపోయింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో అమరావతిలో శాసన వ్యవస్థను మాత్రమే ఉంచి కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థలను విశాఖపట్నం, కర్నూలుకు తరలించడానికి జగన్ సర్కారుకు మార్గం సుగమమైంది. రాజధాని తరలింపును తెలుగుదేశంతో పాటు జనసేన ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ …

Read More »

చంద్రబాబు స్పీక్స్… అమరావతి పోరు కొనసాగిస్తాం

ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి రాజధానిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేస్తూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూల్లో జ్యూడిషియల్ కేపిటల్ ను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కారు చేసిన ప్రతిపాదనకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీనిపై టీడీపీ భగ్గుమంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచే జూమ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు… మూడు రాజధానులకు …

Read More »

మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ కంచికి చేరింది. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర్నుంచి పట్టుబట్టి అమరావతి నుంచి రాజధానిని తరలించే విషయంలో వడివడిగా అడుగులు వేసిన జగన్ సర్కారు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. న్యాయ వ్యవస్థ ఈ విషయంలో ఏం చేస్తుందో ఏమో కానీ.. ప్రస్తుతానికి అయితే రాజధాని అమరావతి …

Read More »

దీపికా పదుకొనేపై సంచలన ఆరోపణలు

బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే పేరు ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెపై ఓ సంచలన ఆరోపణ రావడమే ఇందుక్కారణం. ఈ ఏడాది జనవరిలో అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీలోకి దీపిక వెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీలో చేపట్టిన కొన్ని సంస్కరణలకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు హింసాత్మక ఆందోళనలకు దిగడం, పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి విద్యార్థులను చితకబాదడం.. ఈ …

Read More »

అమెరికాపై చైనా ‘విత్తనాల’ కుట్ర?

ఆంత్రాక్స్.. ఒకప్పుడు ఈ పదం ఓ సంచలనం. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అమెరికాపై బయోవార్ చేసే ఉద్దేశంతో ఉగ్రవాదులు ఈ ఇన్ఫెక్షన్ కలిగించే పౌడర్‌ను ఆ దేశానికి పంపేవాళ్లు. అమెరికన్ల అడ్రస్‌లు సేకరించి.. రాండమ్‌గా ఆంత్రాక్స్ పౌడర్‌ను కొరియర్, పోస్టు చేసేవాళ్లు. ఆ ప్యాకెట్ తెరవగానే ఇన్ఫెక్షన్ సోకేది. 2001 సెప్టెంబరు 11 దాడుల తర్వాత మీడియా వాళ్లతో పాటు వివిధ వర్గాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదవాదులు ఆంత్రాక్స్ …

Read More »

3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం !

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కల నెరవేరే దిశగా మొదటి అడుగు పడింది. గవర్నర్ ఆమోదం కోసం వేచిచూస్తున్న సీఆర్డీఏ, రాజధానుల వికేంద్రీకరణ బిల్లలుకు రాజ్ భవన్ ఆమోదముద్ర వేసింది. పది రోజులుగా గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లలను న్యాయ సలహా కోసం కొంచెం సమయం తీసుకున్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఎట్టకేలకు ఈరోజు వాటికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ …

Read More »

వీర్రాజు వ‌చ్చారు…బీజేపీ నేత‌ల బీపీ పెంచేస్తున్నారు

సోము వీర్రాజు…ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీకరించిన పార్టీ సీనియ‌ర్ నేత‌. ఆయ‌న ఎంట్రీతోనే త‌న వైఖ‌రి ఏంటో స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుత అధికార ప‌క్షం, గ‌తంలో ప‌రిపాలించిన టీడీపీ అనే తేడా లేకుండా త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పిదాల‌ను విమర్శిస్తూనే గతంలో జరిగిన అవినీతిని వెలికితీయడానికి కూడా కృషిచేస్తామన్నారు. పోలవరం నిధులు రాబట్టడానికి సహకరిస్తామంటూనే గతంలో ఇచ్చిన దానికి లెక్కలు రావాలన్నారు. వైసీపీ టీడీపీలు …

Read More »

కేసీఆర్ అండ్ జగన్.. కేజ్రీవాల్‌ను చూడండయ్యా

కరోనా అందరినీ కష్టపెడుతోంది. ఆదాయం పడిపోయి.. ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారు జనం. ఇలాంటి సమయంలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఏ రకంగా అయినా జనాల్ని దోపిడీ చేయడం అన్యాయం. జనాల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాన్ని నడపడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి జనాల్నే బాదేస్తున్నాయి. గత కొన్ని వారాల్లో పెట్రోలు రేట్లు ఎలా పెరుగుతూ పోయాయో తెలిసిందే. 75 రూపాయల్లోపు ఉన్న పెట్రోలు ధర 83 రూపాయలకు చేరువైంది. పెట్రోలుతో పోలిస్తే …

Read More »

ఒక సోనూ సూద్.. మూడు లక్షల ఉద్యోగాలు

లాక్ డౌన్ పెట్టిన మొదట్లో వలస కార్మికుల అవస్థలు చూసి అందరూ కన్నీళ్లు పెట్టిన వాళ్లే. కానీ అందరూ ఎక్కడికక్కడ లాక్ అయిపోయి ఉండటంతో వాళ్లకు మనం ఏం చేయలేం అని ఊరుకున్నారు. ఏం చేసినా ప్రభుత్వాలే చేయాలనుకున్నారు. కానీ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మాత్రం అలా ఆలోచించలేదు. వలస కార్మికులను ఆదుకుంటా.. వాళ్లను గమ్య స్థానాలకు చేరుస్తా అంటూ ముందుకొచ్చాడు. అయితే ఒక నటుడు ఇలా ఎంతమందికి …

Read More »