అతి సర్వత్ర వర్జయేత్.. అనేది సామెత కాదు.. నిజం అంటారు పెద్దలు. వ్యక్తుల జీవితాల్లో అయినా.. రాజకీయ నేతల్లో అయినా.. పార్టీలకైనా.. అతి ఎక్కడా పనిచేయదని చెబుతున్నారు పరిశీలకులు. గతంలో అతిగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. చివరికి ఏమయ్యారో.. అందరికీ తెలిసిందేనని అంటున్నారు. అదేవిధంగా ఇతర పార్టీలతోనూ ఆయన అతిగానే చెట్టాపట్టాలే సుకుని ముందుకు సాగారని, అతిగానే నమ్మారని ఇవన్నీ.. ఆయనకు ఎక్కడా పనిచేయకపోగా.. చివరికి ఆయనే బోనులో నిలబడాల్సి …
Read More »తిరుపతిలో పోటికి సై అంటున్న టీడీపీ
నిన్నా మొన్నటి వరకు ఎన్నికల్లో పోటి చేసే విషయంపైనే ముఖం చాటేసిన సీనియర్ నేతలు తాజాగా పోటికి సై అంటున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పార్టీ పోటి చేస్తుందని ప్రకటించారు. మాజీమంత్రి ప్రకటనతో సీనియర్ నేతలంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సోమిరెడ్డి ప్రకటనను తిరుపతిలోని సీనియర్ నేతలెవరు ఏమాత్రం ఊహించలేదని సమాచారం. తిరుపతి …
Read More »ఈ మాజీ మంత్రిది ఒంటరి పోరాటమేనా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశంపార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా కొవ్వూరు మాజీ ఎంఎల్ఏ, మాజీమంత్రి జవహార్ నియమించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా జవహర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బలమైన వర్గం ఇంకా వ్యతిరేకిస్తున్న కారణంగా మాజీ మంత్రి ఒంటరైపోయారు. నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారింది. టీచర్ గా పనిచేస్తున్న జవహర్ 2014 ఎన్నికలకు …
Read More »పదవి ఉంటుందో.. పోతుందో..
రాజకీయాల్లో దూకుడు ఉండాలి.. అదేసమయంలో ఒకింత జాగ్రత్త, ఆలోచన కూడా ఉండాలి. ఈ రెండు లేకపోతే.. ముంచుకొచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమని అంటారు రాజకీయ పండితులు.. ఇదిగో ఇప్పుడు ఇలా ముంచుకొచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఎలా అని తలపట్టుకున్నారట.. వైసీపీలో కీలక నాయకుడు, మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగ నాథరాజు. రైస్ మిల్లింగ్ రంగంలో కొన్ని దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న.. గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీలోకి …
Read More »అదే పనిగా మాట్లాడుతున్నారు…
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలి. ఎంత రాజకీయాల్లో ఉన్నప్పటికీ అదే పనిగా నోటికి పని చెప్పటం అంత బాగోదు. అవసరమైన వేళ.. అవసరమైనంత మేర మాట్లాడితే దానికి ప్రజలు ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. టార్గెట్ కత్తి పట్టుకొని.. అదే పనిగా విమర్శలు.. ఆరోపణలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. స్థాయిని తెలుసుకొని అందుకు తగ్గట్లు మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. ఇటీవల కాలంలో నరసాపురం ఎంపీ.. …
Read More »వైసీపీలో రెండో రకం నేతలు.. నిఘా ఉన్నా బలాదూర్!
అధికార వైసీపీలో రెండో రకం నేతలు ఉన్నారా? పార్టీలో ఉంటూ.. పార్టీ పంచన అధికారం చలాయిస్తూ.. పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. అంతేకాదు, వీరి విషయంలో సంచలన అంశం ఏంటంటే.. ఇలాంటి వారిపై పార్టీలో నిఘా ఉండడం! అయినా కూడా నేతలు ఎక్కడా ఆగడం లేదని, వారు ఏంచేయాలని అనుకుంటున్నారో.. అది చేస్తున్నారని పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఆ రెండో …
Read More »బాబుకు తలనొప్పులు వారి నుంచే.. కానీ, మార్చే పరిస్థితి లేదట!
టీడీపీ అధినేత చంద్రబాబును దగ్గరగా చూసిన వారు.. ఒక మాట చెబుతారు. ఆయన అతి మొహమాటస్తుడని, నమ్మితే.. ఎంతటి వారినైనా నెత్తిన పెట్టుకుంటారని, అదేసమయంలో అలాంటివారు ఎన్ని తప్పులు చేసినా.. చివరకు తన కాళ్లకిందకే నీళ్లు వచ్చేలా చేసినా.. సహిస్తారని.. అంటారు. బహుశ .. ఇది నిజం కావొచ్చు! ఎందుకంటే.. చంద్రబాబు నమ్మినవారు.. ఆయన నెత్తిన పెట్టుకున్నవారు చాలా మంది.. తలనొప్పిగా మారారు. పార్టీలోను, నియోజకవర్గంలోనూ వారి వల్ల వివాదాలే …
Read More »అసంతృప్తితోనే చదలవాడ రాజకీయ రిటైర్మెంట్!
ఏపీ రాజకీయాల్లో చదలవాడ కృష్ణమూర్తిని గురించి తెలియని వారు ఉండరు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆయన ప్రస్తుతం పవర్ స్టార్ నేతృత్వంలోని జనసేనలో ఉన్నారు. అయితే, ఆయన రాజకీయాలలో అవకాశవాద ధోరణిని అవలంబించారనే టాక్ ఉంది. తన ఇష్టాలను గౌరవించే పార్టీలో ఉండడమే ఆయన ఇష్టపడతారని, లేకపోతే.. పార్టీ ఎలాంటిదైనా.. ఆయన పట్టించుకోరని ఆయన అనుచరులు అంటారు. చదలవాడ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇది నిజమేనని అనిపిస్తుంది. …
Read More »రాజధాని కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం చేస్తారా ?
రాజధాని అమరావతి కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం చేస్తారా ? ఇదో ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే రాజధాని అమరావతికి అనుకూలంగాను వ్యతిరేకంగాను చాలా కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. మొత్తంమీద రాజధాని వివాదంపై సుమారు 144 కేసులు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు రోజువారి విచారాణకు రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలోనే విజయవాడకు చెందిన లా స్టూడెంట్ వేమూరు లీలాకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లీలాకృష్ణ బెనారస్ యూనివర్సిటిలో లా చదువుతున్నారు. …
Read More »ఖుష్బూ వ్యాఖ్యలపై దుమారం
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది ఒకప్పటి నటి, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన ఖుష్బూ తన పాత పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే భాజపా తీర్థం పుచ్చుకున్న ఆమె.. వెంటనే తన పూర్వ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. తాను ఇన్ని రోజులూ మానసిక వికలాంగుల పార్టీలో ఉన్నానని.. …
Read More »బండారుతో కాకినాడ టీడీపీ బతికిపోయిందా!
బండారు సత్యనారాయణ మూర్తి..టీడీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్. పైగా తూర్పుగోదావరి జిల్లాలో పేరున్న నేత. టీడీపీలో నేతలను కలుపుకొని పోయే నాయకుడిగా కూడా ఆయనకు పేరుంది. ఇటీవల టీడీపీ పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్లను నియమించినప్పుడు.. అత్యంత కీలకమైన కాకినాడ పార్లమెంటు ఇంచార్జ్ పోస్టును బండారు కు అప్పగించింది. నిజానికి ఆయన కోరుకున్నది ఇంతకన్నా మెరుగైన పోస్టే.. అయినా.. ప్రస్తుతానికి సర్దుకుపోతున్నారు. ఇక, కాకినాడలో టీడీపీ విషయానికి వస్తే.. కేడర్ …
Read More »జగన్ ఫిర్యాదుపై దేశవ్యాప్తంగా రాజుకుంటున్న వేడి
న్యాయవ్యవస్ధలోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై దేశవ్యాప్తంగా వేడి రాజుకుంటోంది. ఫిర్యాదుకు అనుకూలంగాను, వ్యతిరేకంగా న్యాయనిపుణులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కొందరేమో ఫిర్యాదు చేసినందుకు జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరేమో ఫిర్యాదుపై కచ్చితంగా విశ్రాంత న్యాయమూర్తులతో విచారణ జరిపించాల్సిందే అంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఇదే విషయమై జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి. ఇంతకీ …
Read More »