ఒకపుడు దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో కుట్ర జరిగిందనేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నట్లు ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ఓటుకునోటు కేసును హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తమను ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారు కాబట్టి తమ పేర్లను తొలగించాలని కోరుతు ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహ వేసిన డిస్చార్జి పిటీషన్ను కోర్టు కొట్టేసింది. నిందితుల పై అభియోగాలు నమోదు చేసేందుకు వీలుగా కేసు విచారణను …
Read More »పోలవరం బకాయిలు రూ. 2234 కోట్ల విడుదలకు ఓకే చెప్పిన కేంద్రం
వివాదాలతో హోరెత్తిపోతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం బకాయిలు రూ. 2234 కోట్ల విడుదలకు ఎటువంటి అభ్యంతరాలు లేవని కేంద్రం ఆర్ధికశాఖ స్పష్టంగా చెప్పింది. ఈ మేరకు బకాయిల మొత్తాన్ని విడుదల చేయలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులకు ఆర్ధికశాఖ మెమో పంపింది. దీంతో మరో రెండు మూడు రోజుల్లో బకాయిలు విడుదలయ్యే అవకాశాలున్నట్లు రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. బకాయిల విడుదల చేయాలంటూ …
Read More »బడులు తెరవగానే కరోనా బయటపడుతోందా ?
అత్యుత్సాహంలో ప్రభుత్వం నవంబర్ 2వ తేదీ నుండి తెరిచిన స్కూళ్ళ కారణంగా కరోనా వైరస్ వ్యాపిస్తోందా ? క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని నవంబర్ 2వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ళు తెరిచిన విషయం అందరికీ తెలిసిందే. మొదటిరోజు సోమవారం స్కూళ్ళు తెరవగానే కొందరు టీచర్లు, విద్యార్ధుల్లో కరోనా వైరస్ బయటపడింది. ఒక్క చిత్తూరు జిల్లాలోని …
Read More »వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ?
ఏమిటో కమలనాధుల మాటలు కోటలు దాటుతున్నట్లే అనిపిస్తోంది. విశాఖపట్నంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. వీర్రాజు, పార్టీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మాటలు విన్నతర్వాత కమలనాధులు తమను తాము ఎంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో అర్ధమైపోయింది. బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశంపార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని ధైర్యంగా చెప్పలేకపోతోంది. అలాంటిది అన్నీ నియోజకవర్గాల్లోను పోటీ …
Read More »బొత్స ఎఫెక్ట్: మిగతావారికి వాయిస్ కట్!
మంత్రి బొత్స ఎంత సీనియర్ నాయకుడో.. అంతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ప్రతి కార్యక్రమాన్నీ.. ఆయన తన కనుసన్నల్లోనే జరిపిస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. దీంతో మిగిలిన నేతలకు వాయిస్ లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి. తన బంధుగణం ఎక్కువగా ఉన్న జిల్లాలో.. వారిని ప్రోత్సహించేందుకు అవసరమైతే.. మిగిలిన వారిని.. వారు సొంత పార్టీ నేతలే అయినా.. తొక్కేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. …
Read More »ఏపీ-తెలంగాణ కొట్టుకుంటే.. ప్రైవేటుకు పండగ
ఎట్టకేలకు ప్రతిష్ఠంభన వీడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏడు నెలలకు పైగా విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు తిరగబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరింది. కాకపోతే కొన్ని షరతుల మధ్య బస్సులు తిప్పబోతున్నాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు. ఇంతకుముందు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు కలిపి 4 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పేవి. ఇందులో మెజారిటీ బస్సులు ఏపీవే. దాదాపు రెండున్నర లక్షల …
Read More »జగన్ పలుకుబడి ఏంటో తేలిపోతుందా ?
అవును తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కేంద్రంలో తనకున్న పలుకుబడేమిటో తేలిపోయే సమయం వచ్చింది. చాలా కాలంగా కేంద్రప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి మంచి సంబంధాలనే మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మంచి సంబంధాలను నెరిపిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దూరమవుతారు ? కాబట్టి కేంద్రంతో దగ్గరగా ఉంటూనే బీజేపీ తో మాత్రం సమాన దూరం పాటిస్తున్నారు. అయితే పోలవరం నిధుల దగ్గర హఠాత్తగా సమస్య వచ్చిపడింది. …
Read More »నితీష్ లో అసహనం దేనికి సంకేతం ?
బీహార్ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లో అసహనం పెరిగిపోతోంది. ఎన్డీయే కూటమి నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినపుడు నితీష్ ప్రశాంతంగానే ఉండేవారు. తర్వాత్తర్వాత బహుశా టెన్షన్ పెరిగిపోయినట్లుంది. ఎన్నికల వేడి మొదలు కాకముందు ఎన్డీయే కూటమికే మళ్ళీ అధికారం ఖాయమంటూ ప్రీపోల్ సర్వేలు తేల్చాయి. అయితే ఎన్నికల వేడి పెరిగిపోయి మొదటిదశ పోలింగ్ జరిగేనాటికి బీహార్ లో …
Read More »ఏ పార్టీలో ఉన్నా అసమ్మతేనా ?
సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం చూసిన తర్వాత పార్టీలోనే కాదు మామూలు జనాలు కూడా ఇలాగే అనుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో ఆనం కుటుంబం కూడా ఒకటి. ఇప్పటి జనరేషన్ కు బాగా తెలిసిన ఆనం బ్రదర్స్ అంటే ఎవరికైనా వెంటనే ఆనం వివేకానందరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డే గుర్తుకొస్తారు. ఈమధ్య వివేకా మరణించిన తర్వాత కొంతకాలం రామనారాయణరెడ్డి కామ్ అయిపోయారు. అప్పటికి వాళ్ళు …
Read More »కర్నూలుపై బీజేపీ స్పెషల్ ఇంట్రస్ట్.. వ్యూహం ఇదే!
రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. ఆ దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా కేంద్రంలోని పెద్దలే రాష్ట్రంలో రాజకీయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉన్న జిల్లాలపై బీజేపీ పెద్దలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా కర్నూలు విషయంలో ఢిల్లీ పెద్దలు చర్చలు జరుగుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎదగడం ద్వారా .. సీమలో బీజేపీకి ఉన్న కొద్దొ గొప్పో …
Read More »జగన్ అంటే భక్తా? భయమా? నాటకమా?
మంత్రిగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దు. మీరే సర్వస్వం అనుకోవద్దు. కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచండి. మీమీ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం ఉండడం. అవసరం ఉంటేనే తాడేపల్లిలో ఉండండి– ఇదీ తరచుగా సీఎం జగన్ తన మంత్రి మండలి సభ్యులకు చెబుతున్న మాటలు. దీనికి మంత్రులు అందరూ కూడా ఓకే బాస్ అంటున్నారు. వినయం చూపిస్తున్నారు.. ఆయన దగ్గర మంచిమార్కులు పడుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారు. …
Read More »తెలంగాణకు బీజేపీ ఎంత ద్రోహం చేసిందో లెక్కలు చెప్పిన హరీశ్
రాజకీయాలు మహా కర్కశంగా ఉంటాయి. ప్రయోజనాలు కలిగే వరకు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. కాస్త లెక్క తేడా వస్తే చాలు చిట్టా విప్పటం మామూలే. అందునా గులాబీ దళానికి ఇలాంటి విషయాల్లో ఉండే నేర్పు అంతా ఇంతా కాదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కమలనాథుల్ని తక్కువగా అంచనా వేయటం ఎంత పెద్ద తప్పన్న విషయాన్ని అర్థం చేసుకొని.. ఎదురుదాడి చేసేందుకు సిద్ధమయ్యేసరికి.. పోలింగ్ వేళ దగ్గర పడింది. జరిగిన తప్పు గురించి …
Read More »