Political News

కరోనా డెత్ రిపోర్ట్స్‌ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య నానాటికీ పెరిగిపోతోన్నసంగతి తెలిసిందే. తెలంగాణలో టెస్టుల సంఖ్య భారీగా పెంచాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నా…ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కరోనా టెస్టులు, గణాంకాల, నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు కూడా గతంలో హెచ్చరికలు జారీ చేసింది. అ యినప్పటికీ, తమ ఆదేశాలను అమలు చేయడం లేదని, కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని హైకోర్టు గతంలో పలుమార్లు తీవ్ర …

Read More »

కర్ణాటకలో పట్టుబడ్డ నూతన్ నాయుడు…అరెస్ట్

విశాఖలోని పెందుర్తిలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరో ముండనం ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత, నటుడు నూతన్ నాయుడు ఇంట్లో పనిమానేసిన శ్రీకాంత్ ఫోన్ దొంగతనం చేశాడంటూ నూతన్ తో పాటు అతడి కుటుంబసభ్యులు శ్రీకాంత్ పై దాడి చేసి గుండు కొట్టించడం సంచలనం రేపింది. నూతన్ నాయుడు నివాసంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ …

Read More »

ఆర్థిక మంత్రిపై భర్త గారి షాకింగ్ కామెంట్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు అన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ కీలక నేతల్లో ఒకరు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్‌ భార్యే నిర్మల. ప్రస్తుతం రైట్ ఫోలియో పేరుతో పొలిటికల్ అనాలసిస్, మార్కెట్ రీసెర్చ్ అనే కంపెనీ పెట్టుకుని దానికి ఎండీగా కొనసాగుతున్నారాయన. భార్య కేంద్ర మంత్రి అయినపుడు అక్కడి ప్రభుత్వానికి అనుకూలంగానే ఆయన వైఖరి …

Read More »

మందుబాబులూ ఆంధ్రాలోనే కొనండ్రా !

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా మందుబాబుల కష్టాలు మామూలుగా లేవు. లాక్ డౌన్ కారణంగా మూతపబడ్డ మద్యం దుకాణాలు.. రెండు నెలల తర్వాత తెరుచుకున్నాయి కానీ.. అంతకుముందున్న పేరున్న బ్రాండ్లన్నీ తీసి అవతల పడేశారు. పైగా మద్యం రేట్లు విపరీతంగా పెంచి అమ్మడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ వల్ల తలెత్తిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తాత్కాలికంగా మద్యం ధరలు పెంచారని.. మళ్లీ తగ్గిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. …

Read More »

ఆత్మహత్యకు అనుమతివ్వండి.. గవర్నర్‌కు కుటుంబం లేఖ

ఇదొక విచిత్రమైన వ్యవహారం. తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఒక కుటుంబం రాష్ట్ర గవర్నర్‌కు, హైకోర్టుకు లేఖలు రాసింది. తమ ఊరి వాళ్లే తమను వెలి వేయడమే ఇందుకు కారణం. ఈ ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లి కలెక్టరుతో విచారణ జరిపించే వరకు వ్యవహారం వెళ్లింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రకాశం జిల్లా …

Read More »

ఎన్నికల బరిలో రాములమ్మ

హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ విజయశాంతి మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దుబ్బాక అసెంబ్లీ స్థానంలో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లోనే ఒకరు ఆ స్థానంలో బరిలో నిలవబోతున్నారు. ఐతే సానుభూతి కోణంలో ప్రధాన పార్టీలేవీ ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ …

Read More »

జగన్ సర్కారును వదలని నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు మధ్య నెలకొన్న వివాదం ఒక పట్టాన తెగేలా లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ తనపై వేటు వేయడాన్ని కోర్టులో సవాలు చేసి.. మళ్లీ పదవిలోకి రాగలిగారు రమేష్ కుమార్. అంతటితో ఈ వ్యవహారానికి తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. రమేష్ కుమార్ మరోసారి హైకోర్టు గడప తొక్కడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధుల్లో …

Read More »

కరోనా టైం..ప్రపంచంలో బెస్ట్ థింకర్ గా భారతీయురాలు

ప్రచారం, హంగు, ఆర్భాటాలే పరమావధిగా ఉన్న ఈ జమానాలోనూ ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్…అన్న మాటలను నమ్మిన పొలిటిషియన్లు కూడా ఉన్నారు. అటువంటి రాజకీయ నేతలలో ముందు వరుసలో కేరళ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కే.కే. శైలజ ఉంటారు. కరోనా విపత్తు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆ మహమ్మారిని ముందుగానే గుర్తించారు శైలజ. గుర్తించడమే కాదు….కరోనా కట్టడిలో ఏ మాత్రం అలసత్వ …

Read More »

మందుబాబులకు జగన్ సర్కార్ మరో షాక్

ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధించే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, ఏపీలోని మందుబాబులంతా జగన్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఓ పక్క మద్యం ధరలను అమాంతం పెంచేసిన ప్రభుత్వం…మరో పక్క మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఇక, ఏపీలో కొన్ని బ్రాండ్ల మద్యాన్నే అమ్మడం వంటి చర్యలతో…తమ ఫేవరెట్ బ్రాండ్లు దొరక్క మందుబాబులకు కిక్కు చాలడం లేదు. దీంతో, …

Read More »

విద్యుత్ కు నగదు బదిలీ… రైతుల్లో ఎన్నో భయాలు

ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో అమలుకాబోతోన్న ‘ఉచిత విద్యుత్ పథకం-నగదు బదిలీ’ పథకం ఇపుడు ఏపీలో చర్చనీయాంశమైంది. రైతులకు గతంలో మాదిరిగానే ఉచిత విద్యుత్ అందిస్తానని జగన్ సర్కార్ చెబుతోంది. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని, కనెక్షన్ ఉన్నవారి స్మార్ట్ మీటర్లు బిగించి వారి బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం కరెంటు బిల్లుకు సరిపడా డబ్బులు చెల్లిస్తుందని చెబుతోంది. రైతులు ఒక్క రూపాయి కూడా కట్టే పనిలేదని, …

Read More »

తగ్గేదే లేదు.. నీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌కు జగన్ సవాల్

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదా అంత తేలిగ్గా తెగేలా లేదు. ఇంతకుముందు మెతక వైఖరితో కనిపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ వాటాను వాడుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సై అంటే సై అన్నట్లుగా వ్యవహరించడానికి ఆయన సిద్ధం అయిపోతున్నారు. రాయలసీమ కరవు నివారణ పథకం ద్వారా 14 ప్రాజెక్టులు పనులను …

Read More »

రఘురామకృష్ణరాజుపై పవన్ ప్రశంసలు…మతలబేంటి?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నిన్న 50వ పడిలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ట్విట్టర్ లో పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే వై‌సీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పవన్ ప్రశంసలు కురిపించారు. రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలిపిన పవన్… రఘురామకృష్ణరాజును పొగడ్తలతో …

Read More »