Political News

జూనియర్ ను అనిల్ రెచ్చ గొడుతున్నారా ?

హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ అని పేరు పెట్టడంపై సెగలు ఇంకా రేగుతునే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం డైరెక్టుగా జూనియర్ ని టార్గెట్ చేశారు. పేరుమార్పుపై జూనియర్ ఒక ట్వీట్ చేశారు. నిజానికి ఆ ట్వీట్ ఎందుకు చేశారో కనీసం జూనియర్ కైనా క్లారిటీ ఉందో లేదో. ఆ ట్వీట్ గురించే అనిల్ మాట్లాడుతూ ఎన్టీయార్ …

Read More »

డైవ‌ర్ట్ చెయ్యాలంటే జ‌గ‌న్ త‌ర్వాతే..

ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ఒక పెద్ద వివాదం ఏదో న‌డుస్తుంటుంది. ఓవైపు మీడియా, మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు ముప్పేట దాడితో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డిఫెన్స్ ఉండ‌దు. జ‌నాల్లోకి చెడు సంకేతాలు వెళ్తున్న‌ట్లు, త‌మ‌కు డ్యామేజ్ జ‌ర‌గ‌బోతున్న‌ట్లు ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అప్పుడే ఇంకో ఒక కొత్త వివాదాన్ని తెర‌మీదికి తెస్తుంది ప్ర‌భుత్వం. అంద‌రి దృష్టి అటు మ‌ళ్లుతుంది. అంతే.. అప్ప‌టిదాకా హాట్ టాపిక్‌గా ఉన్న అంశం …

Read More »

చీరాల టీడీపీ నుండి దగ్గుబాటి పోటీ చేస్తారా ?

వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం లో దగ్గుబాటి చెంచురామ్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దగ్గుబాటి చెంచురామ్ ఎవరంటే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు. చెంచురామ్ టీడీపీ తరపున రంగంలోకి దిగబోతున్నట్లు జిల్లా పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. మొదటి సొంత నియోజకవర్గమైన పర్చూరు నుండి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబానాయుడు చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడింది. పర్చూరు …

Read More »

డ్యామేజ్ కాక ముందు ఇదే క్లారిటీ ఇస్తే సరిపోయేదిగా సజ్జల?

దారిన పోయే దానిని మీదేసుకోవటంలో వైసీపీకి మించిన రాజకీయ పార్టీ మరొకటి ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే.. మరికొన్ని సందర్భాల్లో ఆయన పార్టీ నేతలు చేసే తప్పులతో తరచూ ఏదో ఒక వివాదంలో జగన్ సర్కారు వార్తల్లో నిలుస్తుందని చెప్పాలి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ముఖ్యమంత్రికి షాకిచ్చిందన్న వార్తలు రావటం తెలిసిందే. వైసీపీ శాశ్విత …

Read More »

ప్రతిపక్షాలను జగనే కలుపుతున్నారా ?

YS Jagan Mohan Reddy

రాష్ట్రంలో ప్రతిపక్షాలను కలిపిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటి పేరును ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇది అనవసరమైన ప్రక్రియే అయినా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరీ మార్పు చేశారు. పేరు మార్పుకు జగన్ చెప్పిన కారణాలు తన యాంగిల్లో ఓకేనే కానీ …

Read More »

కేసీయార్ మధ్యలో ఇరుక్కుపోయారా ?

జాతీయ రాజకీయాల్లో పాపులర్ అయిపోవాలని, చక్రం తిప్పాలని కేసీయార్ కు చాలా బలమైన కోరికుంది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకోవటంలో తప్పులేదు. అయితే అందుకు సమయం, సందర్భం, వాతావరణం కలిసొస్తుందా లేదా అనేది చూసుకోకుండానే అడుగులు వేయటమే కేసీయార్ చేసిన తప్పు. ఈ రోజుకు నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్డీయే చాలా బలంగా ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్షమైన మరో జాతీయ పార్టీ …

Read More »

జగన్ కు వేరే దారి లేదు

ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి చాలా మొండిగా వ్యవహరిస్తుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ తేల్చిచెప్పింది. ఈ మద్యనే జరిగినా పార్టీ ప్లీనరీ సమావేశంలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా నేతలు తీర్మానం చేశారు. అయితే ఆ తీర్మానం చెల్లదని అప్పట్లోనే అందరికీ తెలుసు. ఎందుకంటే పార్టీల్లో అధ్యక్ష పదవిని ఎన్నిక ద్వారా మాత్రమే భర్తీ చేయాలి కానీ నామినేషన్ ద్వారా కాదు. …

Read More »

జగన్ చేసింది తప్పే: షర్మిల

ఏపీ రాజకీయాల్లో తాజా వివాదంపై ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద భగ్గముంటున్న విషయం తెలిసిందే. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును మార్చేసి ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది. అసెంబ్లీ, శాసనమండలిలో అధికారపార్టీ ప్రవేశపెట్టిన తీర్మానాలు మెజారిటి కారణంగా ఆమోదం కూడా పొందేశాయి. దాంతో యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు స్ధానంలో డాక్టర్ వైఎస్సార్ పేరొచ్చేసింది. జగన్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలోను బయటా టీడీపీతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా మండిపోతున్నాయి. …

Read More »

పేరు మార్చి ఏం సాధిస్తారు..?: పవన్

ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి పాలకులు ఏం సాధిస్తారని జనసేన అధినేత పవన్‌ ప్రశ్నించారు. ఎన్టీఆర్ బదులు వైఎస్‌ఆర్‌ పెడితే వసతులు మెరుగవుతాయా అని నిలదీశారు. వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్య అని వ్యాఖ్యానించారు. కొత్త వివాదాలు సృష్టించేందుకు ycp ప్రభుత్వం ఈ పని చేసిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వసతులు మెరుగవుతాయా అని ప్రశ్నించారు. …

Read More »

సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్

Jagan Mohan Reddy

సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక.. నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ పేర్కొంది. వైసీపీ జనరల్ సెక్రటరీకి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పార్టీ …

Read More »

టార్గెట్ 250 ఓట్లు

మునుగోడు ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఉపఎన్నిక ప్రచారంలో కానీ తర్వాత పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కీలకమైన సమావేశం నిర్వహించారు. బట్టి చెప్పినదాని ప్రకారం ప్రతి పోలింగ్ బూత్ కమిటి కచ్చితంగా 250 ఓట్లను తక్కువ కాకుండా పార్టీకి వేయించాలని టార్గెట్ పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలో 45 బూత్ కమిటీలున్నాయి. అంటే బూత్ కమిటీల నుండే సుమారుగా 11500 …

Read More »

పాత ఆలోచనకే పవన్ ఓటు

వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు ? పార్టీలో నేతలతో పాటు ఆయన అభిమానుల్లో విపరీతంగా వినిపిస్తున్న ప్రశ్నిదే. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే కాదు తమ దగ్గరే పోటీ చేయాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలివే అని చాలా నియోజకవర్గాల పేర్లు వినబడ్డాయి. ఒకసారి భీమిలి అని, మరోసారి పిఠాపురం అని, కాదు కాదు మళ్ళీ …

Read More »