Political News

ఏపీని వేధిస్తున్న ఐపీఎస్ ల కొరత

ఏపీలోని ఐపీఎస్ అధికారులకు సంబంధించిన చిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన పలువురు ఐపీఎస్ లు రాష్ట్రానికి రావటానికి ఇష్టపడకుండా ఉండటం తెలిసిందే. మరికొందరు కేంద్రానికి వెళ్లిపోవటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మరికొందరు అధికారులు ఉన్నా.. వారికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వకుండా పక్కన పెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఐపీఎస్ ల కొరత అంతకంతకూ ఎక్కువ కావటం ఇప్పుడో …

Read More »

మోడీకి తెలుగు అంత తెలుసా?

Narendra Modi

నిజంగానే కొత్త విషయం. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు మాటల్ని ఇప్పటికే పలుమార్లు విన్నాం. కాస్త కష్టంగానే ఆయన తెలుగు మాట్లాడతారు. కానీ.. ఆయన తెలుగును బాగానే అర్థం చేసుకుంటారా? అంటే.. అవుననే మాట ఆయన నోటి నుంచే రావటం గమనార్హం. యూపీలోని ఝాన్సీలో కొత్తగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో మాట్లాడిన క్రమంలో …

Read More »

ఏపీ ఆలయానికి కేసీఆర్ విరాళం

మీడియాలో పెద్దగా హైలెట్ కాని అంశం. కానీ.. తెలుగు ప్రజలందరికి ఎంతో ఆసక్తిని కలిగించే వ్యవహారంగా దీన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి కలిసి ఏపీలోని ఒక ఆలయానికి ఆర్థికంగా దన్నుగా నిలవటం విశేషం. పెద్దగా ఫోకస్ కాని ఈ అంశానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. దీనికి.. తెలంగాణ …

Read More »

ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ ఎందుకు ఆగింది? తప్పు ఎవరిది?

ఏపీలోని పేదలకు జగన్ సర్కారు ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి భారీ కసరత్తు జరిపారు. ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ముహుర్తాల్ని డిసైడ్ చేశారు. అనూహ్యంగా ఒకటి తర్వాత ఒకటిగా పెడుతున్న ముహుర్తాలు వాయిదాలు పడుతున్నాయి. కోర్టు అభ్యంతరాలు పెడుతున్నాయి. ప్రభుత్వాలు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. మరి.. ఈ ఉదంతంపై ఆంధ్రజ్యోతి ఎండీ కమ్ సీనియర్ రిపోర్టర్ …

Read More »

ఆక్స్‌ఫర్డ్ టీకాపై సంచలన వివాదం

కరోనా వైరస్ టీకా కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. వైరస్‌ను తగ్గించే, నివారించే మందు వచ్చిందంటే దాని కోసం దేశాలకు దేశాలు ఎలా ఎగబడతాయో తెలిసిందే. ఆ టీకా వద్దనే వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన టీకాను ఎవరూ తీసుకోవద్దంటూ వివిధ దేశాల్లో ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు పిలుపునిస్తుండటం గమనార్హం. ఇందుకు కారణం కాస్త చిత్రమైందే. 1970లో మృతి చెందిన …

Read More »

కేసీఆర్ లో ఎంత మార్పు.. వెళ్లామా? వచ్చామా? అన్నట్లు

Telangana

మిగిలిన ముఖ్యమంత్రులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక తేడా ఉంది. ఆయనలో ఏదైనా మార్పు వస్తే ఇట్టే అర్థమైపోతుంది. దాని కోసం అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. మూడ్ ఎలా ఉన్నా.. దాన్ని దాచుకోవటం ఆయనకు చేతకాని పని. తాను ఏమనుకున్నానో ఆ విషయాన్ని చెప్పేస్తారు. తన మారిన తీరును దాచుకోరు. బాహాటంగా చూపించటానికి అస్సలు సంకోచించరు. మొహమాటాలు లాంటి అస్సలు కనిపించవు. తెలంగాణ రాష్ట్ర …

Read More »

సైకిల్ యాత్ర… అంతకుముందే ఈ పనిచేస్తేనే లాభం!

నారా లోకేష్….టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆస్తిపాస్తులతో పాటు అతని రాజకీయానికి కూడా వారసుడు. విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలో చదివిన లోకేష్…కొద్ది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన లోకేష్….గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టబోతున్నారన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో …

Read More »

గుంటూరు జిల్లాలో తెలుగు తల్లికి అవమానం.. ఇంత దారుణమా?

తాను పుట్టిన ఊరు మీదా.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం మీదా ప్రేమాభిమానాలు లేకుంటే ఏమవుతుందన్న మాటకు కొద్ది కాలం క్రితం వరకు సరైన ఉదాహరణ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. ప్రాంతం మీద అభిమానం ఉంటే.. ఎంత మేలు జరుగుతుందో తెలంగాణను చూస్తే.. అర్థమవుతుంది. కులాల కుంపట్లతో తరచూ రాజకీయ కుస్తీలకు దిగే ఆంధ్రాకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. అయినప్పటికీ.. …

Read More »

జగన్ సర్కారు అంత హడావుడి చేసి..

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ బాధితుల కోసమని అనంతపురం జిల్లాలో 1500 పడకలతో ఓ భారీ తాత్కాలిక ఆసుపత్రిని జగన్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని సోషల్ మీడియాలో వైకాపా అభిమానులు హోరెత్తించేసిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబును దెప్పిపొడుస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒక సందర్భంలో ఈ ఆసుపత్రి గురించి ప్రస్తావించారు. అనంతపురంలో అద్భుతమైన కోవిడ్ ఆసుపత్రి రెడీ అయింది. చంద్రబాబుకు కరోనా సోకినా అక్కడికెళ్లి చికిత్స చేయించుకోవచ్చు అంటూ …

Read More »

అమెరికాకు తెలుగంటే ఎంత గౌరవమంటే..

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం. ఈ సంగతి తెలుగు వాళ్లు చాలామందికి గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పట్టింపు ఉండదు. అదే పొరుగున ఉన్న తమిళనాడులో తమిళ భాషా దినోత్సవం అంటే సందడి మామూలుగా ఉండదు. వాళ్ల భాషాభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కన్నడ ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. కానీ మన వాళ్లకే సొంత భాష మీద …

Read More »

నూత‌న్ నాయుడు.. ఏ పార్టీ?

రెండేళ్ల కింద‌ట బిగ్ బాస్ షోతో పాపుల‌ర్ అయిన వ్య‌క్తి నూత‌న్ నాయుడు. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల్లో కనిపించాడు. రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో కూడా అత‌డి పేరు వినిపించింది. ఈ మ‌ధ్య రామ్ గోపాల్ వ‌ర్మ మీద స్వీయ ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణంలో తెర‌కెక్కించిన ప‌రాన్న‌జీవి సినిమాతో అత‌ను మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాడు. అదే ప‌నిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్న వ‌ర్మ‌ను టార్గెట్ చేస్తూ నూత‌న్ తీసిన సినిమా ఇది. …

Read More »

ట్రంప్ టైం బాగోలేదా? ఈ అపశకునాల సంకేతాలేంటి?

గడిచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని చెప్పే పెద్ద మనిషి.. ఈసారి ట్రంప్ కు వ్యతిరేకంగా తన అంచనాను చెప్పటం తెలిసిందే. కీలకమైన ఎన్నికల వేళలో.. అదే పనిగా నల్లజాతీయులపై శ్వేతజాతీయ పోలీసులు విరుచుకుపడుతున్న తీరు.. వారి కారణంగా పోతున్న ప్రాణాలు అమెరికన్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి సరిపోనట్లుగా.. ఇటీవల కాలంలో ట్రంప్ కు ఏదీ కలిసి రావటం లేదంటున్నారు. తాజాగా ఉత్తర కరోలినాలో …

Read More »