Political News

ఏపీ స‌ర్కారుపై మాజీ ఐఏఎస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ స‌ర్కారుపై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్న ప్ర‌భుత్వ మాజీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు..తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వ్యూహం రెడీ అయింద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న కృష్ణారావు.. హైద‌రాబాద్ కేంద్రంగా.. ఏపీ స‌ర్కారుపై త‌ర‌చుగా విమ‌ర్శ‌ల బాణాలు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. రాష్ట్రం ఆర్తిక సంక్షోభంలో చిక్కుకుంద‌ని …

Read More »

ఢిల్లీకి ష‌ర్మిల: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Sharmila

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలను ప‌ట్టించుకునేవారే క‌రువ‌య్యారు. పార్టీల సంగ‌తి ప‌క్క‌న పెడితే..ప్ర‌జ‌లు సైతం ఆమెను ప‌ట్టించుకుంటున్న ప‌రిస్థితి లేదు. దీంతో ఏదో ఒక ర‌కంగా.. మీడియాలో ఉండాల‌ని.. క‌వ‌రింగ్ పొందాల‌ని.. తెగ ఉబ‌లాట ప‌డుతున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఈ క్ర‌మంలోనే తాజాగా ష‌ర్మిల‌.. ఢిల్లీ వెళ్లారు. శుక్ర‌వారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారట‌. కాళేశ్వరం ప్రాజెక్టులో …

Read More »

మునుగోడులో కాంగ్రెస్ తాజా వ్యూహం

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మునుగోడు ఉపఎన్నికలో పార్టీల స్పీడు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రచారంలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్ధిని ప్రకటించటంలో కేసీయార్ వెనకాముందు ఆడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ నేతలు సీరియస్ గా రంగంలోకి దిగిపోయారట. ఒకపుడు ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐదుసార్లు గెలిచింది. కానీ అదంతా చరిత్రగా మిగిలిపోయింది. సరే ఇప్పటి పరిస్దితి ఏమిటంటే గెలవాలనే …

Read More »

నో విలీనం..మిత్రపక్షమంతే

జాతీయపార్టీ బీఆర్ఎస్ లో విలీనం విషయంలో జేడీఎస్ అగ్రనేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టమైన వివరణ ఇచ్చేశారు. తమ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని కొట్టేశారు. తమ రెండుపార్టీలు మిత్రపక్షాలేనని స్పష్టంగా చెప్పారు. కర్నాటక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నట్లు కుమారస్వామి చెప్పారు. 2023లో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోను తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోను రెండుపార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే …

Read More »

ఇద్దరికీ ఇగో సమస్య తప్ప మరేంలేదా ?

చాలా చిన్న విషయమే చిలికిచిలికి గాలివానలాగ మారింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. అలాగే నిర్వాహకులు ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావుతో ప్రవచనాలు కూడా ఏర్పాటుచేశారు. చిరంజీవికన్నా గరికపాటి ముందే వచ్చిన తన ప్రవచనాలను మొదలుపెట్టారు. తర్వాతెప్పుడో చిరంజీవి కూడా కార్యక్రమంలో జాయినయ్యారు. ఎప్పుడైతే మెగాస్టార్ వచ్చారో వెంటనే జనాల దృష్టంతా ప్రవచనం మీదనుండి …

Read More »

అప్పట్లో అల్లమైన సీమాంధ్ర ఇపుడు బెల్లం ఎలాగవుతోంది కేసీయార్ ?

కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళదాం అంటే ప్రత్యేక తెలంగాణా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న రోజుల్లోకి. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగటంలో తప్పులేదు కానీ సీమాంధ్రులంటూ నానా గోల చేసే వాళ్ళు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు జేఏసీ ఛైర్మన్ గా పనిచేసిన కోదండరామ్ మరికొందరు సీమాంధ్రులను, రాష్ట్రాన్ని పరిపాలించిన సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అప్పటివరకు రాష్ట్రాన్ని …

Read More »

ఆ ఎంపీ టికెట్లు ఎవ‌రికి? టీడీపీలో త‌ర్జ‌న భర్జ‌న‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 15-20 దాకా ఎంపీస్థానాల‌ను ద‌క్కించుకోవాల‌ని.. టీడీపీ ప్లాన్ చేసుకుంది. దీనికి త‌గ్గ‌ట్టుగానే .. అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. అనుకున్న విధంగా మాత్రం ప‌రిస్తితి క‌నిపించ‌డం లేదట‌. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్యే టికెట్ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు. దీంతో పార్ల‌మెంటు స్థానాల‌పైనా.. దృష్టి పెట్టాల‌ని.. నాయ‌కులు కోరుతున్నారు. ముఖ్యంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి అభ్య‌ర్థుల కొర‌త వెంటాడుతోంది. ఈ జాబితా త‌లుచుకుంటేనే బాధేస్తోంద‌ని.. సీనియ‌ర్లు అంటున్నారు. …

Read More »

TDP : ఈసారి సూపర్ ఫాస్ట్ ఉందే

నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను చంద్రబాబునాయుడు దాదాపు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసేశారట. అంటే ఖరారు కానీ రెండు నియోజకవర్గాలపై పార్టీలోనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్ధిగా కేశినేని శివనాధ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ …

Read More »

అందరిని ఆశ్చర్యపరిచిన గద్దర్ !

ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. కారణం ఏమిటంటే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకోవటమే. దీనికన్నా ఇంకా పెద్ద సర్ ప్రైజ్ ఏమిటంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ఎన్నికలోకి దిగుతుండటమే. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు అలాగే జనాలు ఈ రెండు విషయాలను ఏమాత్రం ఊహించలేదు. ఉద్యమ నేపథ్యం ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏమీలేదు. కాకపోతే గద్దర్ ఎన్నికల్లో పోటీ …

Read More »

కేసీయార్ కొత్తపార్టీకి ఏపీలో కీలకం ??

కేసీయార్ కొత్తపార్టీ కలకలం రేపుతున్నట్లుంది. కొత్తపార్టీ రేపుతున్న కలకలం తెలంగాణాలో కన్నా ఏపీలోనే ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణాలో టీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి ఇతర పార్టీల నుండి వచ్చి జాతీయపార్టీలో చేరబోయే నేతలు పెద్దగా ఉండరు. ఎందుకంటే జాతీయపార్టీలో పనిచేయటానికి తెలంగాణాలోనే కావాల్సినంత మంది నేతలున్నారు. కొత్తగా ఏర్పాటవ్వబోయే జాతీయపార్టీలో పనిచేయటానికి మిగిలిన రాష్ట్రాల్లోనే నేతల అవసరం చాలావుంది. మిగిలిన రాష్ట్రాల్లో జాతీయపార్టీ పరిస్ధితి ఎలాగున్నా ఏపీలో …

Read More »

మొదటి వికెట్ కాంగ్రెస్ !

కేసీయార్ ఏర్పాటు చేయబోయే కొత్త జాతీయపార్టీలోకి చేరే నేతల్లో మొదటి వికెట్ కాంగ్రెస్ నుండి పడింది. ఈమధ్యనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదేలు తాజాగా తిరిగి టీఆర్ఎస్ లో చేరిపోయారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్లో కేసీయార్ ను కలిసి ఓదేలు తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీయార్ సమక్షంలో కారు కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని …

Read More »

రాజకీయం క్రీడ కాదు..టాస్క్: కేసీఆర్

విజయదశమి పండుగనాడు జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్…బీఆర్ఎస్ గా కొనసాగుతుందని అన్నారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ అని, కానీ తనకు మాత్రం రాజకీయం అంటే ఒక టాస్క్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన దేశంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం వల్లే రైతాంగం నానా ఇబ్బందులు పడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. …

Read More »