Political News

స్టాలిన్ కు బీజేపీ షాక్

ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బీజేపీ పెద్ద షాకే ఇచ్చింది. డీఎంకే ఎంఎల్ఏ శరవణన్ బీజేపీలో చేరారు. మధురై జిల్లాలోని తిరుపుప్పరన్ కుండ్రమ్ నియోజకవర్గానికి శరవణన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ ఎంఎల్ఏ చేరికతో బీజేపీలో చేరిన డీఎంకే ఎంఎల్ఏల సంఖ్య రెండుకు చేరింది. గతంలోనే సెల్వమ్ అనే ఎంఎల్ఏ కమలం కండువా కప్పుకున్నారు. నిజానికి డీఎంకే నుండి ఇద్దరు ఎంఎల్ఏలు బయటకు …

Read More »

ఆ ఎనిమిదిమంది ఎవరో ?

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల కుంభకోణంలో నోటీసులు అందుకోబోయే ఎనిమిది ఎవరనే విషయంలో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి భూకుంభకోణం జరిగిందని ప్రభుత్వం మొదటినుండి చెబుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అసైన్డ్ భూముల కుంభకోణానికి బాధ్యునిగా పేర్కొంటు సీఐడీ చంద్రబాబు మీద 120బి, 166, 167, 217 సెక్షన్ల కేసులు నమోదు చేసింది. ఈనెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ …

Read More »

టీడీపీ అంటే.. ఒక‌రి క‌ష్టం.. అంద‌రి సుఖ‌మా?

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అంటే.. ఒక‌రు క‌ష్ట‌ప‌డితే.. మిగిలిన వారంతా ఎంజాయ్ చేయ‌డ‌మా? ప‌దవులు అనుభ వించేందుకు మాత్ర‌మే టీడీపీ నాయ‌కులు ఉంటారా? పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోను., పార్టీని అభివృద్ధి చేయ‌డంలోను మాత్రం వారికి పాత్ర లేదా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి త‌గిలిన ఎదురు దెబ్బ వంటి కీల‌క విష‌యాల నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క టీడీపీ అభిమానీ.. సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే! …

Read More »

బ్రేకింగ్: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

మరో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో హైదరాబాద్ లోని బాబు నివాసానికి అధికారులు చేరుకున్నారు. వాహనాల్లో వెళ్లిన వారు.. చంద్రబాబును కలవాలని చెప్పారు. అందుకు బాబు భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లుగా బాబుకు సమాచారం ఇవ్వటం.. …

Read More »

చంద్రబాబుకు సమయం వచ్చిందా ?

ఎంతసేపు రౌడీయిజంతో గెలిచారు, ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని గెలిచారు అనే అరిగిపోయిన రికార్డు వేసినందు వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబునాయుడు గ్రహించాలి. పంచాయితి ఎన్నికల్లో మద్దతుదారులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని నిజాయితిగా విశ్లేషించుకోవాలి. పార్టీ తప్పులను ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అప్పుడే తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోగలరు. అలా కాకుండా ఎంతసేపు అధికారాన్ని ఉపయోగించుకుని వైసీపీ గెలిచిందని చెప్పటం వల్ల ఉపయోగం ఉండదని …

Read More »

య‌న‌మ‌ల ఇలాకాలో ఘోర ప‌రాజ‌యం..

టీడీపీలో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న నాయ‌కుడు, చంద్ర‌బాబు త‌ర్వాత‌.. నెంబ‌ర్ 2గా వ్య‌వ‌హ‌రించే నేత‌.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. వ్యూహాలు.. ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌డంలో ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు లేర‌ని ఒక ప్పుడు టాక్‌. అయితే.. ఆయ‌న కొన్నేళ్లుగా వైట్ ఎలిఫెంట్‌గా మారిపోయార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నియోజ‌క‌వ‌ర్గం నుంచి అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలోనే టీడీపీ లోకి వ‌చ్చిన య‌న‌మ‌ల‌.. …

Read More »

విశాఖలో సీన్ రివర్స్.. కారకులెవరు?

అన్ని అనుకున్నట్లు జరిగితే.. విశాఖపట్నం ఏపీకి కాబోయే రాజధాని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కునగరాన్ని ఏపీ రాజధానిగా చేయాలని బలంగా కోరుకోవటం తెలిసిందే. ఆందోళనలు.. నిరసనలు.. విమర్శల్ని లైట్ తీసుకొని మరీ.. తాను అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేయటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఫలితాలు ఆయన రాజధాని కలను నెరవేర్చేలా చేయటమే కాదు.. విశాఖ వైసీపీ నేతల లోగుట్టును బయటపడేలా చేశాయన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. వెల్లడైన …

Read More »

బీజేపీకి సీన్ అర్ధమైపోయిందా ?

తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సీన్ ఏమిటో అర్ధమైపోయినట్లుంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో 2123 వార్డులున్నాయి. వీటిల్లో 490 వార్డులు ఏకగ్రీవమైపోయాయి. వీటిల్లో అత్యధికం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన 1632 వార్డుల్లో 1269 చోట్ల అధికార వైసీపీనే గెలిచింది. వైసీపీ తిరుగుబాటు అభ్యర్ధులు 45 వార్డుల్లో గెలిచారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ 265 వార్డుల్లో గెలిచింది. మరో 2 చోట్ల టీడీపీ …

Read More »

క‌మ‌లంతో తెగ‌తెంపుల దిశ‌గా ప‌వ‌న్‌… మ‌ళ్లీ బాబుతో దోస్తానా ?

క‌మ‌లంతో ప‌వ‌న్ ప్ర‌యాణం ముగిసిందా ? బీజేపీని ప‌వ‌న్ వ‌దిలించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారా ? ఆదివారం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సాక్షిగా ప‌వ‌న్ తెలంగాణ బీజేపీపై విరుచుకు ప‌డ‌డంతో పాటు టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన మాజీ ప్ర‌ధాన‌మంత్రి పీవీ కుమార్తె సుర‌భివాణికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఎన్నికల రోజే ప‌వ‌న్ బీజేపీకి షాక్ ఇవ్వ‌డంతో ఆ పార్టీ వ‌ర్గాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. సో దీనిని బ‌ట్టి తెలంగాణ‌లో బీజేపీతో ప‌వ‌న్ దాదాపు …

Read More »

ఏబీఎన్, టీవీ5లకు ధన్యవాదాలు-కొడాలి నాని

మన టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో ఏవి ఏ పార్టీలకు అనుకూలమో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని ఛానెళ్లు, పత్రికలు నేరుగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్నేమో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆ ఛానెళ్ల మీద ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. వాటిపై తీవ్ర …

Read More »

వైరల్ గా నాటి జగన్ మాట

ఎన్నికల ఫలితాలు ప్రజల నాడిని చెప్పేవన్నది పాక్షిక సత్యం మాత్రమే. ఒక ఎన్నికలో ఒక పార్టీ గెలుపు ఓటముల్ని ప్రజలు నిర్ణయించేది నిజమే అయినా.. వాస్తవం మరోలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. నిజం కొన్ని సార్లు మనకు నచ్చకపోవచ్చు అయినా నమ్మాల్సిందే. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జగన్ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయాన్నిసాధించింది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఆ విజయాన్ని తక్కువ చేసి చూపటం తప్పే, అతిశయోక్తులు చేసి చెప్పడమూ …

Read More »

తాడిప‌త్రి, మైదుకూరు కూడా వైసీపీకే.. ఎలాగంటే..!

రాష్ట్ర వ్యాప్తంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసి.. జోరుమీదున్న వైసీపీకి పంటికింద రాయిలా.. కంట్లో న‌లుసులా.. రెండు మునిసిపాలిటీలు మారాయి. వీటిలో అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి, క‌డ‌ప జిల్లాలోని మైదుకూరు. ఈ రెండు చోట్ల కూడా టీడీపీ అభ్య‌ర్థులు మెజారిటీ సాధించారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ వైసీపీ ప్ర‌స్తుతం ప‌రాజ‌యం పాలైంది. అయితే.. ఇక్క‌డ కూడా.. త‌మ ఖ‌తా తెరుస్తామ‌ని.. వీటిని కూడా త‌మ బుట్ట‌లో వేసుకుంటామ‌ని.. వైసీపీ …

Read More »