వైసీపీలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ ఎంపీలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు. పార్టీలో కీలకంగా చక్రం తిప్పే ఎంపీలకు సైతం ఈ అసమ్మతి తప్పడం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విజయసాయి, మంత్రి అవంతి, జిల్లా ఎమ్మెల్యేలు పూర్తిగా డమ్మీలను చేసేశారన్న చర్చ ఉంది. ఆయన కూడా …
Read More »విజయవాడ తేడా వస్తే.. కేశినేని మరింత ఒంటరేనా?
విజయవాడ ఎంపీ కేశినేని నాని పేరుకే టీడీపీ నేత అయినా.. కొన్నాళ్లుగా ఆయన పార్టీలో ఒంటరిగానే ఉంటున్నారు. ఎవరినీ కలుపుకొని పోవడం లేదనే విమర్శలు ఆయనను చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో ఇతర నేతలు కూడా ఆయనను కలుపుకొని పోయేందుకు ముందుకు రావడం లేదు. ప్రధానంగా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. సహా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వంటివారు కూడా కేశినేనికి …
Read More »తుమ్మల రాజకీయం ఎటు? పరిణామాలు మారతాయా?
తుమ్మల నాగేశ్వరరావు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాను శాసించిన ఆయన ఇప్పుడు ఎటూ కాకుండా పోతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. టీడీపీలో సీనియర్ నాయకుడిగా కమ్మ సామాజిక వర్గంలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన అనంతర కాలంలో తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లోకి చేరిపోయారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి విజయం సాధించి.. మంత్రి పదవిని సైతం సొంతం చేసుకున్నారు. అయితే.. టీఆర్ఎస్లో తనకంటూ.. …
Read More »పవన్-షర్మిల మధ్యే పోటీనా ?
వినటానికి విచిత్రంగా ఉన్న రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారమైతే ఇదే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చాలా సంవత్సరాలే అయినా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా క్రియాశీలం కాలేదు. రాష్ట్రకమిటిని కూడా పూర్తిస్ధాయిలో నియమించకపోవటమే ఇందుకు నిదర్శనం. ఏదో ఓ ఐదుగురితో సమన్వయ కమిటి అనేదాన్ని వేసేసి రోజులు నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక షర్మిల విషయానికి వస్తే తొందరలోనే తెలంగాణాలో పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించటంతో పాటే ముందుగా రాష్ట్ర …
Read More »విడదల రజనీ మార్క్ ట్విస్ట్… మరిదికి మునిసిపల్ చైర్మన్ ?
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె పొలిటికల్ ఎంట్రీ నుంచి… వైసీపీలోకి రావడం.. రాజకీయ గురువు పుల్లారావుపై గెలవడం.. ఆ తర్వాత సొంత పార్టీ నేత మర్రి రాజశేఖర్తో వార్ ఇవన్నీ ఆమెను రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో హైలెట్ చేశాయి. అన్నింటికి మించి ఆమె సోషల్ మీడియా ప్రచారంతో ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉన్నారు. ఈ వరుస సంచలనాల పరంపరలో …
Read More »బీజేపీ కన్నా.. వైసీపీనే ఎక్కువా… నేతల మధ్య చర్చ ?
రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇస్తున్న ప్రాధాన్యంపై.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. మా కంటే.. వైసీపీ నాయకులే ఎక్కువా ? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇటీవల విశాఖ ఉక్కు విషయంలో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. సుమారు రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ కోసం …
Read More »తండ్రి, కొడుకుల దారులు వేరయ్యాయా ?
ఇదే విషయంలో చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ఒకపుడు ఏ చిన్న విషయం మీదైనా కానీండి కేంద్రప్రభుత్వంపై ఒంటికాలిపై లేచేవారు కేసీయార్. అలాంటిది గడచిన కొంత కాలంగా కేంద్రంపై పెద్దగా మాట్లాడటం లేదు. కేంద్రంపై యుద్ధమే అని, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనమేందంటు ఆమధ్య వరకు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కేసీయార్ నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడి, …
Read More »తిరుపతి బరిలో ఓట్ల చీలిక.. భారీ వ్యూహానికి వైసీపీ కసరత్తు!
త్వరలోనే జరగనున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. వరుసగా ఇక్కడ విజయం సాధిస్తున్న వైసీపీ.. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటను చేజిక్కించుకుంది. అయితే.. అనూహ్యంగా 2019 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన వైసీపీ నాయకుడు బల్లి దుర్గా ప్రసాదరావు.. హఠాన్మరణం చెందారు. దీంతో ఇక్కడ త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనిని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. …
Read More »మొత్తానికి రంగంలోకి దిగిన స్టాలిన్
తమిళనాడు ఎన్నికల్లో మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఉదయనిధి ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే మొదటిసారి. మొదటసారి పోటీలోనే తాత పోటీ చేసిన చేపాక్-ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే పోటీ చేయబోతున్నారు. కరుణానిధి మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుండి గెలిచారు. కాబట్టి మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న మనవడు సేఫ్ నియోజకవర్గాన్నే ఎంచుకున్నట్లయ్యింది. ప్రస్తుతానికి ఉదయనిధి డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పోటీ చేయాలనే …
Read More »మరోసారి ఫెయిలైన పవన్
అలవాటైన రీతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చేతులెత్తేశారు. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ సీటులో పోటీనుండి జనసేన స్వచ్చంధంగా తప్పుకున్నట్లు స్వయంగా పవన్ ప్రకటించారు. తిరుపతి నగర విస్తృతాభివృద్ధికే పోటీ చేసే అవకాశం బీజేపీకి ఇచ్చినట్లు పవన్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. జనసేన పోటీ చేయటమా ? లేకపోతే నగరాన్ని అభివృద్ధి చేయటమా అనే ప్రశ్న వచ్చినపుడు అభివృద్ధినే తమ పార్టీ కాంక్షిస్తున్నట్లు చెప్పుకున్నారు. …
Read More »మంత్రి పదవుల రేసులో విశాఖ నేతలు.. నువ్వా-నేనా?
మంత్రి పదవుల రేసులో వైసీపీ నేతలు నువ్వా-నేనా అనే రీతిలో ముందున్నారు. ఒకరిని మించి ఒకరు.. తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో జగన్ తన ప్రభుత్వంలోని మంత్రులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చేందుకు ఆయన సిద్ధమైన విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగు తోంది. దీంతో ఇప్పుడున్న వారు జాగ్రత్తలు పడుతుంటే.. కొత్తవారు పదవులు దక్కించుకునేందుకు …
Read More »విజయవాడ : వైసీపీ గెలిస్తే ఏం జరుగుతుంది, టీడీపీ గెలిస్తే ఏం జరుగుతుంది?
రాష్ట్రంలో ఇటీవల ముగిసిన కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లు అత్యంత కీలకంగా మారాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయంతోపాటు.. ఏ పార్టీ విజయం దక్కించుకుంటే.. రాష్ట్రానికి ఏవిధంగా మేలు జరుగుతుంది? అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. వీటిలో విజయవాడ మరింత కీలకంగా మారింది. రాష్ట్ర వాణిజ్య రాజ ధానిగా పేరున్న విజయవాడలో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం …
Read More »