ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుపై గడిచి కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనకు ఎలాంటి ఫలితం రాని వేళ.. కేంద్రమంత్రి లోక్ సభలో విశాఖ ఉక్కును అమ్మేయటం తప్పించి మరో మార్గం లేదని తేల్చేసిన వేళ.. దిక్కుతోచని స్థితిలో ఉన్న విశాఖ వాసులకు సరికొత్త ఆశాకిరణంగా మారారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇవాళ విశాఖ ఉక్కు అవుతుంది. రేపు బీహెచ్ఈఎల్ అవుతుంది.. తర్వాత బయ్యారం అవుతుంది.. ఆ తర్వాత సింగరేణి …
Read More »చిరంజీవికి తప్ప ఇతర సెలబ్రిటీలకు ఆందోళన పట్టదా ?
తెలుగు సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పెద్దగా పట్టించుకోరు. సమస్యల పట్ల, పరిష్కారం విషయంలో కూడా ఇతర భాషల్లో సెలబ్రిటీలు స్పందించినట్లుగా మన సెలబ్రిటీలు పట్టించుకోరు. ఈ విషయంలో మామూలు జనాలకు చాలా మంటగా ఉన్నా చేయగలిగేదేమీలేదు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్నే తీసుకున్నా ఆ విషయం స్పష్టమైపోతుంది. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం …
Read More »షర్మిల పార్టీలో వినిపించనున్న సోమన్న పాట
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్న సామెత.. షర్మిల తెలంగాణ రాజకీయ ప్రయత్నాల్ని చూసినంతనే గుర్తుకు రాక మానదు. ఆమె రాజకీయ పార్టీ పెడుతుందన్నంతనే ఎవరూ నమ్మలేని పరిస్థితి. తెలంగాణలో షర్మిల పార్టీ ఎలా పెడతారు? అన్న ప్రశ్న పలువురికి వచ్చింది. రాజన్న కుమార్తెగా.. జగన్ సోదరిగా.. ఆమెకున్న రాజకీయ విజన్ ను అందరూ తక్కువగా అంచనా వేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఎంతో కష్టమనుకున్న అంశాల్ని ఒక్కొక్కటిగా …
Read More »బెంగాల్లో మొదలైన నందిగ్రామ్ చిచ్చు
పశ్చిమ బెంగాల్లో అప్పుడో నందిగ్రామ్ చిచ్చు మొదలైపోయింది. నామినేషన్ దాఖలు సందర్భంగా మమతపై దాడి జరిగిందనే ప్రచారంతోనే ఉద్రక్తితలు ఒక్కసారిగా పెరిగిపోయింది. బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఒకఎత్తు, మిగిలిన 293 నియోజకవర్గాలు ఒకఎత్తు. నందిగ్రామ్ ఎందుకింత చర్చల్లో నడుస్తోందంటే అందుకు మమతాబెనర్జీ-సుబేందు అధికారే కారణమని చెప్పాలి. దశాబ్దాలుగా సుబేందు అధికారి కుటుంబానిదే నందిగ్రామ్ ప్రాంతంలో ఆధిపత్యం. ఈ ప్రాంతంలోని సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో …
Read More »బీజేపీకి దాదానే దిక్కా ?
పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీని ధీటుగా ఎదుర్కోవటానికి ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవౌ గంగూలీనే దిక్కుగా మారాడా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. గంగూలి అలియాస్ దాదా కు బీజేపీ పెద్దలతో బాగా సన్నిహిత సంబంధాలున్న విషయం యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. గంగూలీ కమలంపార్టీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నదే. అయితే ఆమధ్య దాదాకు రెండుసార్లు గుండెపోటు రావటంతో డైరెక్టుగా …
Read More »మమతపై దాడి.. కోడి కత్తి ట్రెండింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఐతే ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. తనపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటూ మమత ఆరోపించడం చర్చనీయాంశం అయింది. ఆమె కార్లో సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆమెను …
Read More »ఉన్నతాధికారులే మోసం చేశారా ?
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలోని ఉన్నతాధికారులే మోసం చేశారా ? అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి అవుననే అనిపిస్తోంది. ఉక్కును ప్రైవేటీకరించాలనే ఒప్పందం 2019లోనే జరిగింది. కేంద్రానికి, దక్షిణికొరియా సంస్ధ పోస్కో మధ్య జరిగిన ఒప్పందంలో విశాఖ ఉక్కు ఉన్నతాధికారి ఒకరు సంతకం చేశారట. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్ని పార్లమెంటులో ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించిన తర్వాత కానీ విషయం వెలుగుచూడలేదు. అయితే కేంద్రమంత్రి ప్రకటనకు …
Read More »టీడీపీ-వైసీపీలను డమ్మీ చేయడమే: ఏపీపై బీజేపీ పెద్దల రాజకీయ వ్యూహం ఏంటి?
తాను ఎదగాలి… అనుకున్న చోట.. బీజేపీ అనుసరించే వ్యూహం ఏంటి? ఏ రాష్ట్రంలో అయినా.. తనకు పట్టు చిక్కాలి.. అంటే.. చేస్తున్న పనేంటి? కొద్దిగా లోతుగా చూస్తే.. అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను తనవైపునకు తిప్పుకోవడం… లేదా.. ఆయా పార్టీలను డమ్మీలు చేసేయడం! ఇదే పంథాను బీజేపీ పెద్దలు అనుసరిస్తున్నారు. తమిళనాడులో అధికార పార్టీని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇక, ఏపీ విషయానికి …
Read More »ఉక్కు ఆందోళనకు తెలంగాణా మద్దతు
రాష్ట్రానికి సంబంధించిన మేజర్ ఇష్యుకి తెలంగాణా సమాజం కూడా మద్దతుగా నిలుస్తోంది. మామూలుగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఏపిలో జరిగే ఆందోళనలకు, ఉద్యమాలకు తెలంగాణా ప్రభుత్వం తరపున అధికారికంగా మద్దతు రాలేదనే చెప్పాలి. అలాంటిది తాజాగా జరుగుతున్న ఉక్కు ఆందోళనలకు తెలంగాణా కూడా మద్దతు ఇస్తున్నట్లు మంత్రి కేటీయార్ బహిరంగంగా ప్రకటించారు. ఒక సమావేశంలో కేటీయార్ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో విశాఖలో జరుగుతున్న ఆందోళనలకు తెలంగాణా …
Read More »ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నారా ?
‘విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రానికి అన్యాయమైతే జరగదు’ ఇది తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఒకవైపు విశాఖ స్టీలు ఫ్యాక్టరీని 100 శాతం ప్రైవేటీకరిచటం ఖాయమని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించారు. కేంద్రమంత్రి ఇంత స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా సజ్జల ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం కావటంలేదు. ఎన్దీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన …
Read More »జగన్ పాలన తెలియాలంటే.. మూడేళ్లు ఆగాలి: లగడపాటి కామెంట్స్!
ఏపీలో మళ్లీ సైకిల్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని.. ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక, పైగా ఆర్థిక లోటులో ఉంది కనుక.. ప్రజలు సైకిల్ వైపే మొగ్గు చూపుతున్నారంటూ.. 2019 ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఒపీనియన్ పోల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే.. మళ్లీ ఏపీలో చంద్రబాబు కొద్దిగా మెజారిటీ తగ్గినా.. తిరిగి అధికారంలోకి వస్తారని చెప్పారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అసెంబ్లీలోకి అడుగు …
Read More »అఖిలపక్షం… చంద్రబాబు వెళ్తారా? పవన్‌ను పిలుస్తారా?.. సర్వత్రా ఉత్కంఠ!
ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. దాదాపు 32 మంది ప్రాణత్యాగాలతో ఏళ్లతరబడి పోరాటాల నేపథ్యంలో ఏర్పడిన ఈ కర్మాగారాన్ని నష్టాల పేరుతో.. అమ్మేయడాన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. ఇక, ఈ ఉద్యమ సెగ రాష్ట్ర ప్రభుత్వానికి బాగానే తాకింది. కేంద్రం …
Read More »