వైసీపీ నాయ‌కురాలి వ‌ల‌పు వ‌ల‌

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒక నాయ‌కురాలి వ‌ల‌పు వ‌ల వ్య‌వ‌హారం విజ‌య‌వాడ‌ను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయం పెంచుకోవడం… యువతులతో ఫోన్లు చేయించి, వలపు వల విసిరి డబ్బు గుంజడం… ఇదీ ఈ నాయకురాలి నిర్వాకం. ఈ వ్యవహారంలో వైసీపీ మహిళా నేత, తూర్పు నియోజకవర్గ నేతకు చెల్లెలిగా చెప్పుకొనే ప‌ర‌సా నాగసాయితో పాటు మరో యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పటమటలోని తోట వారి వీధికి చెందిన గురు నాగసాయి అనే మహిళ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలిగా వ్యవహరిస్తోంది.

పటమట హైస్కూల్‌ రోడ్డులో వస్త్ర దుకాణం నిర్వహించేది. దీనితో పాటు ఇక్కడే ఉన్న రైతుబజార్‌లో దుకాణాలను నిర్వహిస్తోంది. ఒక లాడ్జిలో అశోక్‌నగర్‌కు చెందిన యువకుడు.. యువతితో కలిసి ఉండగా, నాగసాయితో పాటు మరో యువకుడు అక్కడికి వెళ్లారు. వారిని బెదిరించారు. ఆ యువకుడ్ని 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాగసాయి హడావుడి చూసిన ఆ యువకుడు అక్కడికక్కడే రూ.50 వేలను ఇచ్చాడు. మరో 40 వేలను దఫదఫాలుగా ఇచ్చాడు.

ఇంకా అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పాటు లాడ్జిలో ఉన్న వీడియోలను బయట పెడతామని బెదిరించడంతో ఆ యువకుడు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ సాగించిన పోలీసులు పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నాగసాయితో పాటు ఒక యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు.

ఎవ‌రీమె!

తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నాయకుడి చెల్లెలిగా చెప్పుకొనే నాగసాయి వద్ద ఉండే అనుచరులంతా యువకులే. 2020లో జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఉన్న నిందితులే వారంతా అని పోలీసులు గుర్తించారు. ఎక్కడా సీన్‌లోకి ఆమె రాకుండా మొత్తం వ్యవహారాలను వారే చక్కబెడతారు. యువతుల నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించి, ఇతర యువకుల వద్దకు పంపడంలో ఆమె సూత్రధారి. యువతి, యువకుడు ఏకాంతంగా ఉన్నప్పుడు దాడిచేసి పట్టుకునేది కూడా ఆమే.

ఈ వ్యవహారాల్లో అవతలి వ్యక్తులను బెదిరించడానికి గ్యాంగ్‌వార్‌లోని నిందితులను ఉపయోగించుకుం టుంది. సనత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు ఫ్లెక్సీ ప్రింటింగ్‌ చేస్తున్నాడు. అతడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి అశోక్‌నగర్‌కు చెందిన యువకుడిని బెదిరించారు. అలాగే, గ్యాంగ్‌వార్‌ యువకుల బలంతో ఆమె పటమట రైతుబజార్‌లో దౌర్జన్యాలకు దిగిందని రైతులే చెబుతున్నారు. ఈ అనుచరగణంతోనే శివారు ప్రాంతాల్లో వాహనాలు చోరీ చేయించిందన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

నిందితురాలు సాయి గత ఏడాది వైసీపీలో చేరింది. తాజాగా ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లోని వీడియోలు, చిత్రాలు చూసి పోలీసులే అవాక్కయ్యారు. కొందరు యువతులతో నిందితురాలు సన్నిహితంగా ఉన్న వీడియోలూ ఫోన్‌లో ఉన్నాయి. అయితే, పోలీసులు మాత్రం ఈమెకు, రాజ‌కీయాల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.