Political News

పవన్ పై పెరిగిపోతున్న ఒత్తిడి

తొందలో జరగబోతున్న లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎట్టి పరిస్దితిలోను ఉపఎన్నికలో జనసేన అభ్యర్ధే పోటీకి దిగాలని, బీజేపీ అందుకు సహకరించాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. తిరుపతి లోక్ సభలో పోటీ విషయమై మద్దతిచ్చే షరతు మీదే గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు ఎన్నికల నుండి తప్పుకున్నారన్న విషయాన్ని జనసేన నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఇవే …

Read More »

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అగ్రవర్ణాలలో అద్భుతమైన నైపుణ్యం ఉన్నవారు కూడా కేవలం రిజర్వేషన్లు లేవన్న కారణంతో అవకాశాలు కోల్పోతున్న వైనంపై నెటిజన్లు, కొందరు విద్యావేత్తలు, మేధావులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని మరికొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ గతంలో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అగ్రవర్ణాల్లోని …

Read More »

కాబోయే సీఎంకు ముందస్తు అభినందనలంటే.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?

ఆసక్తికర రాజకీయ సన్నివేశానికి సికింద్రాబాద్ వేదికైంది. ఒక కార్యక్రమంలో హాజరు కావటానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఎందుకంటే.. ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రిగా పలువురు కీర్తించటం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. గతానికి భిన్నంగా.. ఎప్పుడూ లేని రీతిలో ఈసారి కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే.. టీఆర్ఎస్ నేతలు ఒకరికి మించి మరొకరు కేటీఆర్ …

Read More »

ఒత్తిడికి కేంద్రం లొంగిపోయినట్లేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఏడాదిన్నర పాటు కొత్త వ్యవసాయచట్టాల అమలును నిలిపేసేందుకు సిద్ధమంటు కేంద్రం తాజాగా చేసిన ప్రతిపాదన తర్వాత రైతుసంఘాల ఒత్తిడి లొంగినట్లే అనిపిస్తోంది. కేంద్రం కొత్తగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కార్పొరేట్ సంస్ధల ప్రయోజనాల కోసమే కేంద్రం వ్యవసాయ చట్టాలను చేసిందన్నది రైతుసంఘాల ప్రధాన ఆరోపణ. రైతుల ఆరోపణలకు సరైన సమాధానం …

Read More »

ఈ ఒక్క ఫోటో చాలు.. ఏపీలో మార్పును కళ్లకు కట్టేలా చేస్తుంది

అలుపు లేకుండా.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున సంక్షేమ పథకాలు.. అంతకు మించి పాలనలో జగన్ మార్కును వేసే నిర్ణయాలతో పాటు.. పథకాల అమలుకు పడుతున్న శ్రమ కళ్లకు కట్టేలా ఫోటోగా దీన్ని చెప్పాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే.. రేషన్ బియ్యాన్ని లబ్థిదారుల ఇళ్లకే పంపిణీ చేసే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన జగన్ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు (గురువారం) నుంచి రేషన్ బియ్యాన్ని.. …

Read More »

ఆటో డ్రైవర్ల కోసం ఆస్తిని తాకట్టు పెట్టిన మంత్రి హరీశ్

ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించని మంత్రి తన్నీరు హరీశ్ రావు.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అత్యున్నత స్థానాల్లో ఉన్న నేతలంతా ప్రజల కోసం తాము చాలా చేస్తామని.. వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెబుతుంటారు. మాటలు ఇంత తియ్యగా ఉన్నా.. చేతల వరకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన …

Read More »

ట్రంప్.. కొత్త పార్టీ దిశగా అడుగులు

చిన్న బ్రేక్ ఇచ్చా.. త్వరలో మళ్లీ వస్తానంటూ తెలుగు సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం ఉందంటున్నారు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం సంచలన నిర్ణయాలు.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన.. ఎన్నికల సమయంలోనూ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన అనుసరించిన విధానాలు షాకింగ్ గా మారాయి. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు …

Read More »

నేతలనే టెన్షన్ పెట్టేస్తున్న పనబాక

తిరుపతి లోక్ సభ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి పనబాక లక్ష్మీ సొంతపార్టీ నేతలనే టెన్షన్ పెట్టేస్తున్నారు. బుధవారం తిరుపతిలో ప్రారంభమైన పార్లమెంటు కేంద్ర కార్యాలయం ప్రారంభానికి పనబాక గైర్హాజరయ్యారు. తొందరలో జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పనబాక లక్ష్మితో పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు తెగ ప్రయత్నిస్తున్నారు. తన సహజ మనస్తత్వానికి విరుద్ధంగా దాదాపు రెండు నెలల ముందే పనబాక అభ్యర్ధిత్వాన్ని అధినేత ప్రకటించేశారు. అభ్యర్ధిత్వాన్ని ప్రకటించినా ఆమె మాత్రం చాలాకాలం …

Read More »

అంతా భూమా అఖిలప్రియే చేయించారు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనాన్ని రేపిందో తెలిసిందే. ఇటీవల ఈ కేసుకు సంబంధించి పలువురుని అరెస్టు చేశారు. తాజాగా కిడ్నాప్ కేసులో కీలకంగా వ్యవహరించారని చెబుతున్న నిందితులు సంపత్ కుమార్.. మల్లికార్జున రెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాల్ని వెల్లడించినట్లుగా చెబుతున్నారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కోర్టు అనుమతితో …

Read More »

ఇంత మంది స్పందిస్తున్నారంటే… కేటీఆర్ సీఎం అయినట్టేనా

ఆలసించిన మంచి తరుణం మిస్ అవును..తొందరపడదాం.. యువనేత మనసులో రిజిస్టర్ అవుదామన్న ఆత్రుత గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కానున్నట్లుగా కొద్దికాలంగా వార్తలు వస్తున్నా.. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అలజడి మొదలైంది. ఇప్పటికే సీఎం లేనప్పుడు ఆ పనులన్ని కేటీఆరే చేస్తున్నారన్న లోగుట్టును మొహమాటపడకుండా బయటకు చెప్పేయటం.. కొడుక్కి పగ్గాలు అప్పజెప్పేందుకు …

Read More »

హైదరాబాద్ లోనే కృష్ణబోర్డు కార్యాలయం ?

జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఓ అసంబద్ద నిర్ణయం చిలికి చిలిక గాలివానలాగ తయారవుతోంది. సర్కారు నిర్ణయం ఫలితంగా కృష్ణా యాజమాన్య బోర్డు ప్రదాన కార్యాలయం మరికొంతకాలం హైదరాబాద్ లోనే కంటిన్యు అయ్యే పరిస్ధితులు కనబడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రం విభజన జరగకముందు గోదావరి యాజమాన్యబోర్డు, కృష్ణా యాజమాన్య బోర్డులు ఉన్నాయి. అయితే విభజనలో గోదావరి యాజమాన్య బోర్డును తెలంగాణాకు, కృష్ణాబోర్డును ఏపికి కేటాయించారు. కేటాయింపులు జరిగిపోయినా వివిధ కారణాల …

Read More »

రజనీ తెలివైనా నిర్ణయం తీసుకున్నాడా ? ఇదిగో లెక్కలు

రాజకీయాల్లోకి అరంగేట్రం చేయకముందే, పార్టీ పెట్టకముందే అన్నాతై రజనీకాంత్ కాడి దింపేసిన విషయం అందరికీ తెలిసిందే. కొందరు పిరికివాడన్నారు, మరికొందరు రజనీ తత్వం ఇంతే అని సరిపెట్టుకున్నారు. అయితే తమిళనాడులో జరిగిన ఓ సర్వే నివేదిక చూసిన తర్వాత రజనీకాంత్ చాలా తెలివైనవాడనే విషయం అర్ధమవుతోంది. వచ్చే మే నెలలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ పరిస్ధితి ఏమిటనే విషయమై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ …

Read More »