వరస వివాదాలతో నరేంద్రమోడి-మమతాబెనర్జీ మధ్య గొడవలు పెరిగిపోతున్న సమయంలోనే బీజేపీకి పెద్ద షాక్ తప్పదని అనిపిస్తోంది. అదేమిటంటే కమలంపార్టీ తరపున గెలిచిన 8 ఎంఎల్ఏలతో పాటు నలుగురు ఎంపిలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ మీడియాకు చెప్పారు. అయితే వీరి చేరికపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఘోష్ చెప్పారు. ఒక విధంగా …
Read More »నాయకులారా.. ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోరు?
కోవిడ్ తీవ్రత ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కేసులు, మరణాల విషయంలో సరైన గణాంకాలు కూడా బయటికి రావట్లేదు. వాస్తవ కేసులు, మరణాల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వాలు బయటికి 30 శాతం తక్కువ చెబుతున్నట్లుగా వార్తలొస్తుండటం గమనార్హం. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోగా.. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పెద్ద మనసున్న దాతల కోసం బాధితులు …
Read More »సామాజిక వర్గమే అడ్డంకి: వీరి పరిస్థితి ఇంతేనా ?
రాజకీయాల్లో కులాలకు, రిజర్వేషన్లకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! సామాజిక వర్గాల ఆధారంగా ఓటు బ్యాంకును నిర్మించుకున్న నాయకులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన.. రాజకీయాల్లో రాణించిన నేతలు అనేక మంది ఉన్నారు. అయితే.. ఒకప్పుడు.. ఈ సామాజిక వర్గాలు.. రిజర్వేషన్లు.. చక్రాలు తిప్పితే.. ఇప్పుడు మాత్రం పరిస్థితి కొందరి విషయంలో యూటర్న్ తీసుకుంది. అధికార పార్టీ నేతలకు ఈ పరిణామం ప్రాణసంకటంగా పరిణమించిందని అంటున్నారు. ఉదాహరణకు జగన్ మోహన్ రెడ్డి.. …
Read More »కాంగ్రెస్ కోసం వెయిటింగ్.. మాజీ మంత్రి ఏం చేస్తున్నారంటే..!
ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునే నాయకులు నేటి రాజకీయాల్లో పెరిగిపోయారు. ఎప్పుడు ఎటు అవకాశం వస్తే.. అటు వెళ్లిపోవడం.. ఎక్కడ పదవి వరిస్తుందని తెలిస్తే.. ఆ సర్కారుకు జై కొట్టడం.. పార్టీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు వంటివాటిని సైతం పక్కన పెట్టడం వంటివి నేటి రాజకీయాల్లో కామన్‌గా మారిపోయాయి. అయితే.. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి.. డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం ఆత్మాభిమానం …
Read More »డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిన మోడీ
కరోనా కల్లోలం గత కొద్దికాలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఇంటా బయట విమర్శల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని డీల్ చేయడం, ఈ సమయంలో ప్రజల సంక్షేమం విషయంలో ఆయన గ్రాఫ్ పడిపోయిందనే విశ్లేషణలు కూడా తెగ వచ్చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ గేమ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టారని అంటున్నారు. కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.122 తగ్గింది. …
Read More »ఈటల ప్లేస్ కోసం దొంత రమేష్ ప్రయత్నాలు..?
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ షాకింగ్ కి గురిచేశాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆరోపణలు రావడం.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ తో ఈటలకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీ మొదటి నుంచి ఉన్న ఆయన అలా సడెన్ గా పార్టీకి దూరమవ్వడం సొంత పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇక తాజాగా ఆయన …
Read More »సూపర్ న్యూస్ – ఆగస్టు నాటికి రోజుకి కోటి వ్యాక్సిన్లు
కరోనా సెకండ్ వేవ్ విలయం భారతదేశంలో ప్రతిఒక్కరినీ ప్రభావితం చేసింది. ఈ దశలో ప్రతి పౌరుడు వ్యాక్సిన్ లేకపోతే దీన్నుంచి మనం బయటపడటం కష్టం అని ఫిక్సయ్యాడు. ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంది. అయితే, మన దేశ జనాభాకు సరిపడా ఇక్కడ వ్యాక్సిన్లు ఉత్పత్తి అవడం లేదు. అందుకే దాదాపు అన్ని వ్యాక్సిన్లకు ద్వారాలు తెరవక తప్పదు. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు …
Read More »‘కరోనా పేద్ధ రహస్యం’!.. ఆనంద్ మహీంద్రా సంచలన కామెంట్లు!
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? అనే అంశాలు నేటికీ.. అత్యంత రహస్యంగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయం నుంచి ఇంకా సంపన్న దేశాలు సైతం కోలుకోలేకపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి అభివృద్ధి చెందుతు న్న దేశం భారత్ వరకు కరోనాపై అవిశ్రాంత పోరును సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనాను అణ్వాయుధాలను మించిన దాడిగా అభివర్ణిస్తూ.. సంచలన …
Read More »కొత్త చిక్కుల్లో ఆర్ఆర్ఆర్..!
నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణం రాజు సరికొత్త చిక్కుల్లో పడ్డారు. వైసీపీ గుర్తుతో ఎన్నికల్లో పోటీకి దిగి.. ఎంపీగా విజయం సాధించిన ఆయన.. కొద్దిరోజులకే రెబల్ గా మారారు. సీఎం జగన్, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. కాగా.. జగన్ కి వ్యతిరేకంగా మారి.. ఆయన కొత్త సమస్యలు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. దేశద్రోహం నేరం కింద సిఐడి కేసులకు …
Read More »తెలంగాణ ప్రజలకు నారా భువనేశ్వరి శుభవార్త..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి.. తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలియజేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కనీసం ఆక్సిజన్ లభించక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్రంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్లాంట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా …
Read More »జగన్ కేసులో ‘సీబీఐ’ యూటర్న్.. ఏం చేసిందంటే!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. బెయిల్ రద్దు కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ యూటర్న్ తీసుకుందా? ఈ విషయంలో చాలా నర్మగర్భంగా వ్యవహరించిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎట్టకేలకు ఇటు సీఎం జగన్, అటు సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ కౌంటర్లలో జగన్ వాదన …
Read More »ఇక ఆన్ లైన్ లో ఆనందయ్య మందు..!
కరోనా మహమ్మారికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. ఆయుర్వేద మందు తయారు చేయడం.. అది కాస్త కొద్ది రోజులకే పాపులారిటీ తెచ్చుకోవడం.. వెనువెంటనే ప్రభుత్వం దృష్టి ఆ మందు మీద పడటం.. దానికి అనుమతులు ఇవ్వడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆనందయ్య మందుకి అనుమతి లభించింది అని తెలియగానే చాలామంది సంబరపడిపోయారు. ఈ మందు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో తెలిస్తే.. వెంటనే వెళ్లి క్యూలు కట్టేద్దామని …
Read More »