రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించని సీన్ ఒకటి కనిపించింది. అందుకు టీడీపీకి చెందిన యువ ఎంపీ కారణంగా కావటం విశేషం. సాధారణంగా విదేశాల్లో పెటర్నిటీ లీవ్ మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. దేశీయంగా కొన్ని రంగాలకు చెందిన కార్పొరేట్ ప్రపంచంలో ఈ మాట వినిపిస్తుంది. రాజకీయాల్లో ఇలాంటి మాటలకు చోటు ఉండదు. అందుకు భిన్నంగా ఏపీ టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. అందులో …
Read More »‘జనసేనలోకి చిరు.. పవన్ ఏమన్నాడంటే?
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. జనసేన పార్టీకి చిరంజీవి నైతిక మద్దతు ఉందని, తమ్ముడి వెంట అన్న నడవబోతున్నారని, తమ్ముడికి అండగా ఉంటానని చిరు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో చిరు జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ విషయంపై మీడియా వివిధ కోణాల్లో కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో పవన్ సైతం …
Read More »ఢిల్లీలో భారీ పేలుడు.. ఉగ్ర మూకల పనేనా?!
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇటీవల గణతంత్ర వేడుకలు(బీటింగ్ రిట్రీట్) నిర్వహించిన రాజ్‌పథ్‌కు 1.4 కిలో మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టించింది. పైగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంవద్ద ఈ పేలుడు సంభవించింది. ఓ పూల కుండీలో ఏర్పాటు చేసిన ఐఈడీ పేలుడు సంభవించడంతో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ పేలుడు ధాటికి కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సాయంత్రం …
Read More »మదన పల్లె జంట హత్యల కేసు నేర్పుతున్న లెస్సనేంటి?
చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్య కేసు.. ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎవరూ నమ్మలేని విధంగా జరిగిన ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ప్రముఖ జాతీయ చానెళ్లలోనూ దీనిపై చర్చ జరగడం విశేషం. ఉన్నతస్థాయి విద్యావంతుల కుటుంబంలో వెలుగు చూసిన ఈ విషాదం వెనుక అసలు ఏం జరిగింది? ఎవరి ప్రోద్బలైమైనా ఉందా? లేక.. మూఢ భక్తి.. మితిమీరిన విశ్వాసమే ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. …
Read More »బీజేపీలోకి టీఆర్ఎస్ ఎంఎల్సీ ?
ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో కమలంపార్టీ దూకుడు పెంచినట్లే ఉంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉపఎన్నికకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకునే విషయంలో జోరు పెంచింది. తాజాగా టీఆర్ఎస్ ఎంఎల్సీ తేరా చిన్నపరెడ్డి కమలంవైపు చూస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతంలోని ఓ హైడౌట్ లో బీజేపీ ముఖ్యనేతలు చిన్నపరెడ్డితో భేటి అయినట్ల సమాచారం. చిన్నపరెడ్డి కొంతకాలంగా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి …
Read More »బీజేపీని అడ్డుపెట్టి.. తమిళనాట చిన్నమ్మ రాజకీయం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత స న్నిహితురా లు.. అన్నాడీఎంకేను ఒకప్పుడు శాసించిన శశికళ.. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు శిక్ష పూర్తయి.. సరిగ్గా ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలయ్యారు. కరోనాతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. త్వరలోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా.. రాజకీయ చర్చ అనూహ్య మలుపు …
Read More »‘ఆంధ్రుల హక్కు’ను కాపాడుకోలేమా?
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’-నినాదం 1960ల దశంలో భారీగా వినిపించింది. కేంద్రం ప్రభుత్వం నిర్వ హణ లో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక చరిత్ర ఉంది. అప్పట్లో ఈ ఉక్కు పరిశ్రమ కోసం.. యావత్ ఆంధ్రప్రదేశ్ ఏకతాటి పై నిలిచింది. దీనిని సాధించేందుకు అనేక ఉద్యమాలు సాగాయి. ఈ క్రమంలోనే 1970, ఏప్రిల్ 17న విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి ప్రధాని ఇందరమ్మ ప్రక టించారు. నవరత్నాల్లో ఒకటిగా …
Read More »అసలు తాము ఏమి చేస్తున్నారో నేతలకు అర్ధమవుతోందా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగాను ఉంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటయ్యా అంటే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ పేరుతో జనసేన పార్టీ తరపున షాడో కమిటిలు ఏర్పాటయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించమే విచిత్రంగా ఉంది. అసలు తాము ఏమి చేస్తున్నారో నేతలకు అర్ధమవుతోందా అన్న సందేహాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. దేవాలయాల నిర్వహణ, దేవాలయాల ఆస్తుల …
Read More »మూడు ఘటనలు-మోడీపై ముప్పేట దాడి..!
స్వతంత్ర భారత దేశంలో గతంలో ఎన్నడూ జరగని.. ఎప్పుడు కనీ వినీ ఎరుగని సంఘటనలు చోటు చేసు కుంటున్నాయి. ఫలితంగా ఈ ఎఫెక్ట్.. ప్రధాని నరేంద్ర మోడీపై ఎక్కువగానే ఉంది. మరీ ముఖ్యంగా అంత ర్జాతీయంగా.. నేను ఎంతో కీర్తి గడించాను. తిరుగులేని పాలనతో.. దూరదృష్టితో అంతర్జాతీయ పొలిటికల్ అవనికపై నా ప్రభ జగజ్జగేయమానంగా మెరిసిపోతోంది!! అని చెప్పుకొనే మోడీకి ఇప్పుడు మూడు ప్రధాన విషయాలు ప్రాణసంకటంగా మారాయి. ఈ …
Read More »పార్లమెంటు క్యాంటీన్లో ఇక సబ్సిడీలుండవ్
పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ క్యాంటీన్‌లో సబ్సిడీపై భోజనం అందిస్తుండడంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంపీలు, రాజ్యసభ సభ్యులంతా సామాన్యుల మాదిరిగా రాయితీలు అందుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. మామూలుగా అయితే, నిరుపేదలకు, కార్మికులకు, కొన్ని రంగాల్లోని ఉద్యోగులకు సబ్సిడీపై క్యాంటీన్ లో భోజనం అందిస్తారని….పార్లమెంటులో మన రాజకీయ నేతలకు సబ్సిడీ ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఈ …
Read More »స్వతంత్ర భారతంలో పెట్రోలు ధర రికార్డు – 100 దాటింది
అనుకున్నదంతా అయ్యింది. ఆరేడేళ్ల క్రితం మోడీ ప్రధానమంత్రి కావటానికి ముందు లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూపాయి.. రెండు పెరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేవి. ఇలాంటివేళ.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆసక్తికరమైన పోస్టులు వచ్చేవి. అసలుసిసలు దేశభక్తుడైన మోడీ కానీ ప్రధానమంత్రి అయితే దేశ రూపురేఖలు మారిపోతాయని.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని పేర్కొన్నారు. అంతేనా.. మోడీ పవర్లోకి వచ్చాక లీటరు పెట్రోల్ రూ.50కి.. డీజిల్ …
Read More »బీజేపీ రథయాత్రపై ‘పంచాయితి’ ఎఫెక్ట్
బీజేపీ నిర్వహించాలని అనుకున్న రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల ధ్వంసం తదితర కారణాలతో బీజేపీ రథయాత్ర చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్రకు రూటుమ్యాపు కూడా రెడీ చేసుకున్నది. యాత్ర కోసం పోలీసులను అనుమతి కూడా కోరారు. అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవటంతో …
Read More »