ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాతృమూర్తి వైఎస్ విజయమ్మను తెలంగాణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే పోలీసులు ఆమెను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు విజయమ్మకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మంగళవారం ఉదయం వైటీపీ అధ్యక్షురాలు షర్మిల.. ప్రగతి భవన్‌వైపు తనే కారు నడుపుతూ వచ్చిన క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం షర్మిలను ఎస్ ఆర్. నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తన కుమార్తెను పరా మర్శించి, మద్దతు తెలిపేందుకు ఆమె మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కూడా ప్రత్యేక కారులో ఇంటి నుం చి బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన విజయమ్మ ఇంటికి చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. నేరుగా కారు వద్దకే వెళ్లి.. ఆమెను ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కారు దిగిన విజయమ్మ కొద్ది దూరం పరిగెత్తే ప్రయత్నం చేసి.. పోలీసులను తప్పించుకో వాలని అనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఎంతసేపటికీ కాలుకదపకుండా చేయడంతో విజయమ్మ ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. మేమూ ప్రభుత్వాలు నడిపాం. మాకు అన్నీ తెలుసు. పోలీసుల మొహం నేను చూడనట్టే వ్యవహరిస్తున్నారే అంటూ విజయమ్మ వ్యాఖ్యానించారు.
తనను అడ్డుకుంటే అక్కడే కూర్చుని ఆందోళన చేస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపి.. ధర్నాలు చేయమంటారా? నిరసనలకు పిలుపునివ్వమంటారా? రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వనా? మైకులు తెప్పించి మాట్లాడనా? అని ప్రశ్నించా
Gulte Telugu Telugu Political and Movie News Updates