ఈ ప్రపంచంలో ఏ రంగం అయినా వారసత్వం అనేది కామన్ అయిపోయింది. సినిమారంగంలో స్టార్ హీరోగా ఉన్న వాళ్లు తమ వారసులను పరిచయం చేస్తున్నారు. రాజకీయాల్లో వారసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే కుటుంబానికి చెందిన నాలుగైదు తరాల నేతలు రాజ్యాలను ఏలేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ రాజకీయ వారసురాలు అసెంబ్లీ గడప తొక్కాలన్న …
Read More »జగన్, కేసీఆర్లను ఇరికించేసిన షర్మిల
ఓవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంటే.. ఇంకోవైపు ఆయన సోదరి షర్మిళ తెలంగాణలో వైఎస్సార్ తెలాంగాణ పార్టీ పేరుతో రంగంలోకి దిగడం పట్ల అందరూ నోరెళ్లబెడుతున్నారు. అన్నతో విభేదిస్తే ఆయనకు పోటీగా ఏపీలో పార్టీ పెట్టాలి కానీ.. ఇలా తెలంగాణలో వచ్చి పార్టీ నెలకొల్పడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప జిల్లాలో పుట్టి పెరిగి అక్కడ భాష, యాసనే మాట్లాడే షర్మిళ …
Read More »షర్మిల హామీ అమలయ్యేదేనా ?
తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ (వైఎస్సార్టీపీ)ని ఏర్పాటు చేసిన సందర్భంగా వ్యవస్ధాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలా మాటలే చెప్పారు. దాదాపు గంటన్నరపాటు చేసిన ప్రసంగంలో తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఘనత గురించి చాలానే చెప్పారు. తెలంగాణాకు వైఎస్ చేసిన సేవలను అమలుచేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. వైఎస్ పాలనను, కేసీయార్ పాలనలోని వ్యత్యాసాన్ని పదే పదే ప్రస్తావించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకాన్ని షర్మిల పదే …
Read More »అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు కిషన్ రెడ్డి..!
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో.. బీజేపీ నేత కిషన్ రెడ్డి కి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి పదవి నుంచి… కేంద్ర కేబినేట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో.. కిషన్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లివిరిస్తున్నాయి. తాజాగా.మెగాస్టార్ చిరంజీవి కూడా కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశం యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్నారు. …
Read More »జెండా ఎత్తేయటమేనా ?
తెలంగాణాలో పార్టీ నిర్మాణం తనకు కష్టసాధ్యమైన వ్యవహారమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పేశారు. తాజాగా ఆయన మాటలు విన్నతర్వాత తెలంగాణాలో జనసేన పార్టీ నడిపే విషయంలో చేతులెత్తేసినట్లు అర్ధమైపోతోంది. అప్పటికేదో ఏపిలో పార్టీ పరిస్ధితి బ్రహ్మాండంగా ఉందని అనుకునేందుకు లేదు. కాకపోతే పార్టీ నిర్వహణ కష్టంగా ఉందని ఏపి విషయంలో ఇంకా ప్రకటించలేదంతే. పార్టీ పెట్టినప్పటినుండి ఏ రోజు కూడా పవన్ సీరియస్ రాజకీయాలు చేసింది లేదు. …
Read More »రేవంత్ టేకాఫ్ బాగానే ఉంది కానీ…
కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి టేకాఫ్ బాగానే ఉంది. చాలా కాలం తర్వాత పార్టీ ఆఫీసు గాంధీ భవన్లో మంచి జోష్ కనిపించింది. సీనియర్లలో కొందరు తప్ప చాలామంది హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడిన మాటలు, చేసిన హెచ్చరికలు, వేసిన సెటైర్లు బాగానే పేలాయి. మెజారిటి మీడియా కవరేజి కూడా బాగానే ఇచ్చింది. ఇక్కడ విచిత్రమేమిటంటే మెజారిటి మీడియా యాజమాన్యాలు కాంగ్రెస్ కు …
Read More »టీడీపీ కంచుకోటలో ఎవరికి వారే.. యమునా తీరే..!
మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారింది బెజవాడ టీడీపీ పరిస్థితి. ఇప్పటికే నేతలు కలిసిరాక.. పార్టీ కార్యక్రమాలు జరగడం లేదు. పట్టుమని పదిమంది కూడా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎవరికి వారే మోనార్క్లుగా రాజకీయం వెలగబెడుతున్నారనే విమర్శలు వస్తున్నా.. ఏ ఒక్కరూ చలించడంలేదు. ఒక ఎమ్మెల్యే (తూర్పు), ఒక ఎంపీ ఉన్నారనే మాటే తప్ప.. పార్టీలో జవసత్వాలు నింపేందుకు కానీ, కార్యకర్తల కష్టాలు తీర్చేందుకు కానీ.. …
Read More »బీసీ ఉద్యమాలు.. ఒక రాజకీయ వ్యూహం!
బీసీలు.. ఈ మాట అనగానే రాజకీయ పార్టీలకు, నేతలకు ఎనలేని ప్రేమ పొంగిపోతుంది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామనికూడా వారు ప్రకటించుకుంటారు. అయితే.. వాస్తవంలోకి వచ్చే సరికి.. ఏపీలో ఏ ప్రబుత్వం ఉన్నా.. బీసీలు ఎప్పటికప్పుడు ఉద్యమం పేరిట దూకుడుగా ఉంటూనే ఉన్నారు. మరి దీనికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. బీసీల కు ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేస్తామని కూడా ఇటీవల కాలంలో బీసీ సంఘాల నాయకులు కేసన శంకర్రావు …
Read More »బాబు తేల్చని ‘రాజకీయం’.. అక్కడ పరిస్థితి దారుణం!
రాజకీయంగా అపర చాణిక్యుడు అనేపేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత.. చంద్రబాబు.. అనుసరిస్తున్న ఉదాశీన వైఖరితో .. పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత.. పలువురు నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. చాలా మంది నేతలు.. ఇతర పార్టీల్లో చేరారు. మరికొందరు తటస్థంగా మారారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకుని ముందుకు నడిపించే నేతలు కరువయ్యారు. అయితే.. కొన్నాళ్ల కిందట.. పార్టీ పార్లమెంటరీ.. …
Read More »వైసీపీలో బిగ్ బాంబ్ పేలనుందా ?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఈ టైటిల్ గురించే చర్చ నడుస్తోంది. వైసీపీలో బిగ్ బాంబ్ త్వరలోనే పేలనుందా ? అంటే అవుననే అంటున్నారు. వైసీపీలో పదవుల విషయంలో లెక్కే లేదు. ఏ పదవి వచ్చినా పార్టీ నేతలకే… మరో మూడేళ్ల పాటు ఏ చిన్న పదవి కూడా ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలకు వెళ్లే ఛాన్సే లేదు. నామినేటెడ్ పదవి అయినా, ఎన్నికలు జరిగినా …
Read More »మోడీలో భయం స్పష్టంగా తెలుస్తోందిగా !
వచ్చే ఏడాదిలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నరేంద్రమోడిలో టెన్షన్ ఏ స్ధాయిలో పెంచుతున్నాయో స్పష్టంగా అర్ధమైపోతోంది. తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ప్రక్షాళనను గమనిస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది. తాజా మంత్రివర్గంలో నరేంద్రమోడి 77 మందిని తీసుకున్నారు. వీరిలో ఒక్క యూపీ నుండే 14 మంది మంత్రులున్నారు. 77 మందిలో 14 మంది ఒక్కరాష్ట్రం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మామూలు విషయం కాదు. అలాగే గతంలో ఏ ప్రభుత్వంలో …
Read More »వారసులు వద్దు అంటున్న జగన్… ?
జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో సారి ఏపీలో గెలవాలని చూస్తున్నారు. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే వైసీపీ గెలుపు మళ్లీ అంత సులువు కాదన్న మాట ఉంది. 2019 ఎన్నికలు వేరు, ఆ ఊపు వేరు. నాడు జగన్ ని ఒక్కసారి అయినా సీఎంగా చూడాలని జనాలు ఆరాటపడ్డారు. అలాగే పార్టీ మొత్తం జగన్ కోసం కష్టపడింది. ఇపుడు మాత్రం అలాంటి వారావరణం లేదు అనే …
Read More »