పంచాయితీ ఎన్నికలు తమకు పూర్తి పాజిటివ్ గా మారి.. పురపోరులో అదరగొట్టే ఫలితాల్ని సొంతం చేసుకున్న వేళ.. ఏపీ అధికారపక్షం మాంచి జోష్ లో ఉంది. ఎన్నికలకు ముందు ఉన్న అనుమానాలు.. సందేహాలన్ని ఉత్తవేనని తేలిపోవటమే కాదు.. తమ ఎన్నికల వ్యూహాలు పక్కాగా వర్కువుట్ కావటంపై అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన …
Read More »సోమవారం సభలో కేసీఆర్ నోటి నుంచి కీలక ప్రకటనలు ఇవేనా?
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సోమవారం నాటి సభ వేదికగా మారుతుందని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ బడ్జెట్ మీద మాట్లాడనున్నారు. అదే సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తాను చేయాలనుకున్నపలు ప్రకటనల్ని అప్పుడే చేస్తారని చెబుతున్నారు. దీనికి తోడు.. అప్పటికి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. గతంలో ప్రభుత్వం హామీ …
Read More »బీజేపీది బలుపు కాదు… వాపేగా ?
తెలంగాణలో గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినప్పటి నుంచి బీజేపీ నేతలు చేస్తోన్న హంగామాకు అంతే లేదు. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం గోషామహాల్ సీటుతో సరిపెట్టుకున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా వచ్చిన గెలుపు చూసుకుని తెగ ఎగిరిపడింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ లేకుండా పోయినా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో 48 డివిజన్లలో …
Read More »కమల్ కూడా ఆ ఊబిలో దిగిపోయాడే..
తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదంటూ ఐదేళ్ల ముందు వరకు బల్లగుద్ది చెబుతూ వచ్చాడు కమల్ హాసన్. కానీ జయలలిత మరణించగానే ఆయనకు రాజకీయాలపై ఆశ పుట్టింది. కరుణానిధి కూడా మంచం పట్టడంతో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేద్దామని, అధికారం చేపడదామని ఆశతో రాజకీయాల్లో అడుగు పెట్టాడు కమల్. ఐతే నూతన రాజకీయాలకు శ్రీకారం చుడతానని.. సంప్రదాయ పార్టీల తరహాలో తన పార్టీ ఉండదని ఢంకా బజాయించిన కమల్.. …
Read More »ఆస్తుల్లో అధికార పార్టీలకు మించిన టీడీపీ
వ్యక్తులు.. సంస్థల ఆదాయం.. ఆస్తుల గురించిన సమాచారం ఎప్పుడూ ఆస్తికరంగానే ఉంటుంది. మరి.. రాజకీయ పార్టీల సంగతి? ఎప్పుడూ కాదు కానీ అప్పుడప్పుడే ఈ వివరాలు వెల్లడవుతుంటాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే.. రికార్డుల్లో.. అధికారికంగా విడుదల చేసిన వివరాలు కావటంతో చర్చించుకోవటంలో అర్థముంది. దేశంలోని రాజకీయ పార్టీలకు కొదవ లేదు. వందల్లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. ప్రాంతీయ పార్టీల్లో సంపన్న …
Read More »విశాఖ టీడీపీను ఖాళీ చేసిన వైసీపీ
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో విచిత్రమైన పరిస్దితి తలెత్తింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడై ఇంకా పదిరోజులు కూడా కాలేదు. అప్పుడు టీడీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లలో ఏడుగురు వైసీపీ ఎంఎల్ఏతో భేటీ అయ్యారు. దీంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. భేటి విషయం బయటపడగానే పార్టీ ఏడుగురు కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో టీడీపీ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జీవిఎంసి …
Read More »సోషల్ ఇంజనీరింగ్ లో జగన్ టాప్
ఎన్నికల్లో గెలవటానికి ముఖ్యమైన అంశాల్లో సోషల్ ఇంజనీరింగ్ కూడా చాలా కీలకం. సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజికవర్గాల వారీగా ప్రాధాన్యత ఇవ్వటం. సామాజికవర్గాల దామాషా ప్రకారం టికెట్లు కేటాయించటం, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని పంచటం, పార్టీ పదవుల్లో నియామకాలు చేయటం. సోషల్ ఇంజనీరింగ్ లో చంద్రబాబునాయుడు ఫెయిలైన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది. పార్టీ పెట్టినప్పటి నుండి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీలు మొదటిసారి …
Read More »ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్
తిరుపతి ఉపఎన్నికలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 25వ తేదీనుండి అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపుకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నేతలంతా ప్రచారంలోకి దిగాలంటూ దిశానిర్దేశం చేశారు. మొన్నటి ఎన్నికలో దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటి 2.28 లక్షలు. అప్పటి మెజారిటికి మించి రాబోయే ఎన్నికల్లో రావాలని స్పష్టం చేశారు. అంటే ప్రచారంలో లేదుకానీ సుమారు 5 లక్షల …
Read More »బెంగాల్ బీజేపీలో ట్విస్ట్
సరిగ్గా ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో ముసలం మొదలైంది. ఇంతకాలం మమతాబెనర్జీని ఓడిస్తామని, అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న పార్టీ అగ్రనేతలకు తాజాగా మొదలైన గొడవలు పెద్ద షాక్ ఇచ్చాయి. బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడతలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను పార్టీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా గొడవలు మొదలైపోయాయి. సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని తృణమూల్ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి …
Read More »జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసిన విజయసాయి క్వశ్చన్
తరచూ ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై పలు వర్గాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. ఇక.. అధికార పార్టీకి చెందిన నేతలైతే.. పూనకం వచ్చినట్లుగా అధినేత నిర్ణయాల్ని మెచ్చుకుంటుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా పార్లమెంటులో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు విన్నంతనే జగన్ సర్కారు ఇలా చేస్తుందా? అన్న భావన కలుగక మానదు. రాష్ట్రం ఏదైనా కానీ సంక్షేమ …
Read More »ఇంత వేవ్ ఉన్నా తిరుపతిపై వైసీపీలో ఆందోళన ఎందుకు ?
ఏపీలో ఇప్పుడున్న గాలిలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు మాత్రం పక్కా వైసీపీదే అని చెప్పక తప్పదు. మొన్న పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాల్టీల ఎన్నికలు చూశాక వైసీపీ ప్రభంజనం అడ్డుకోవడం ఇప్పట్లో ఎవరికి సాధ్యం కాదన్న నిర్ణయానికి అందరూ వచ్చేశారు. క్షేత్రస్థాయిలో వైసీపీ మామూలు బలంగా లేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి పరిషత్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికపైనే ఉంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరువు …
Read More »కేసీఆర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే.. ఒక్కటే గుసగుసలు ?
తెలంగాణలో రాజకీయాల్లో కొద్ది రోజులుగా ఎమ్మెల్యేల జంపింగ్‌లకు బ్రేక్ పడింది. అయితే కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ జంపింగ్‌ల పర్వం ప్రారంభం కానుందా ? అంటే అవుననే చర్చలు మొదలయ్యాయి. తెలంగాణకు మరో విపక్ష పార్టీ ఎమ్మెల్యే కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు. గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట …
Read More »