అన్నకు ఇవ్వబోతున్న అరుదైన బహుమానం .. ?

ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు. ఐతే.. ఈసారి ముందుగానే జగన్ అభిమానులు సంబరాలు జరుపుకోవటానికి కారణం ఉంది. ఈ పుట్టినరోజుతో జగన్ 51వ పడిలో పడుతున్నారు. అందుకే ముందుగానే జగనన్నన పుట్టినరోజు సంబరాలు ప్రారంభించారు వైసీపీ నాయకులు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రాలోని ముఖ్య పట్టణాల్లో ఇప్పటికే పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ నేతలు, జగన్ అభిమానులు ముందుండి ఈ వేడుకల్ని జరిపిస్తున్నారు. ముఖ్యంగా నగిరి ఎమ్మెల్యే రోజా జగన్న స్వర్ణోత్సవాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు రోజా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

గుంటూరు, తిరుపతిలో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ వేడుకల్లో రోజా పాల్గొన్నారు. స్టేజ్ పై డీజె స్టెప్పులు వేసి ఓ రేంజ్ లో దుమ్మురేపారు రోజా. ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐతే ప్రతి పుట్టినరోజుకు ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చి జగన్ ను సర్ ప్రైజ్ చేస్తుంటారు రోజా. మరి ఈసారి రోజా ఏం ప్లాన్ చేశారు.. ? ఆ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది.. ?

జగన్ ను జననేత అంటారు. అలాంటి జననేతకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే.. ఆనందపడతారో రోజాకు బాగా తెలుసు. అందుకే 2020లో జగన్ బర్త్ డేకి ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఓ నిరుపేద అమ్మాయిన దత్తత తీసుకుని ఆమె యోగ క్షేమాలు మొత్తం తానే చూసుకుంటానని చెప్పారు రోజా. ఇక 2021 జగన్ పుట్టినరోజుకి మరో ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఇచ్చారు రోజా. నగిరి నియోజకవర్గంలోని మీరాసాబ్ పాలెం అనే ముస్లిం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకుంటానని ప్రామిస్ చేశారు రోజా. ఐతే.. ఈసారి రోజా ఎలాంటి గిఫ్ట్ ప్లాన్ చేశారు అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. జననేత 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న స్పెషల్ బర్త్ డే కాబట్టి, రోజా ఇవ్వబోతున్న గిఫ్ట్ కూడా అంతే స్పెషల్ గా ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారుఐతే.. తనదైన మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ, జగన్ మనసుకు ఆనందం కలిగించే గిఫ్ట్ ఇస్తుందన్నది మాత్రం వాస్తవం. ఆ గిఫ్ట్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ 21 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.