Political News

మోడీ చేతులెత్తేశారు.. జ‌గ‌న్‌-కేసీఆర్‌లు కొట్టుకోవాల్సిందే!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. అనేక విష‌యాల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య ఉప్పు-నిప్పుగా ఉన్న ప‌రిస్థితి తెలిసిందే. ప్ర‌ధానంగా నీటి స‌మ‌స్య‌, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ బ‌కాయిలు, విద్యుత్ ఉద్యోగుల స‌మ‌స్య‌(ఇది కొంత ప‌రిష్కార‌మైనా.. ఇప్ప‌టికీ పూర్తిగా ప‌రిష్కారం కాలేదు), హైద‌రాబాద్‌లోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయితే.. ఏపీలో రెండు ప్ర‌భుత్వాలు మారినా.. తెలంగాణ‌లో మాత్రం విభ‌జ‌న త‌ర్వాత నుంచి ఒకే ప్ర‌భుత్వం కేసీఆర్ నేతృత్వంలో కొన‌సాగుతోంది. …

Read More »

ఎంపీ రామ్మోహన్ భావోద్వేగ ప్రసంగాన్ని విన్నారా?

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు.. నినాదం బాగానే ఉన్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మేయాలని డిసైడ్ అయ్యింది. విశాఖ ఉక్కు ప్రస్తావన వచ్చినంతనే.. నష్టాలు వస్తున్నాయి.. విలువైన ప్రజల పన్ను మొత్తాల్ని ఎందుకు వేస్ట్ చేయటం అంటూ కేంద్రం చెబుతున్న మాటల్లోని అసత్యాన్ని కళ్లకు కట్టేలా చెప్పటమే కాదు.. విశాఖ ఉక్కు అమ్మకంపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంలోని డొల్లతనాన్ని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ప్రసంగించారు ఏపీ ఎంపీ రామ్మోహన్ …

Read More »

ఏపీ కొత్త ఎస్ ఈసీ కూడా రెడ్డేనా?

ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్ నూత‌న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హారం మ‌రోసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వైఖ‌రిని తేట‌తెల్లం చేస్తోంద‌ని అంటున్నారు ప‌రి శీల‌కులు. ప్ర‌స్తుతమున్న రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ ప‌ద‌వి కాలం ఈ నెల 31తో ముగియ‌నుంది. ఈ నేపథ్యంలో కొత్త క‌మిష‌న‌ర్ ఎంపిక ప్ర‌క్రియ‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంబించారు. ఇప్ప‌టికే ఆయ‌న ఈ ప‌ద‌వి కోసం.. ముగ్గురి పేర్ల‌తో కూడిన నివేదిక‌ను గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు పంపించారు.గ‌వ‌ర్న‌ర్ ఆమోద …

Read More »

వంగ‌ల‌పూడి అనిత… వాయిస్ తగ్గించడం వెనుక?

టీడీపీ తెలుగు మ‌హిళ‌.. రాష్ట్ర అధ్య‌క్షురాలు.. మాజీ ఎమ్మెల్యే వంగ‌లపూడి అనిత ఏం చేస్తున్నారు ? ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారు ? ఇదీ.. ఇప్పుడు పార్టీలో కీల‌క నేత‌ల ప్ర‌శ్న‌. ప‌ద‌వి అందిపుచ్చుకున్న‌ప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి..జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసి.. మీడియాలో గుర్తింపు పొందారు. అయితే.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం ఆమె సైలెంట్ అయ్యారు. ఇక‌, స్థానిక ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గం.. పాయ‌క‌రావు పేట‌లోనూ పార్టీని ముందుండి …

Read More »

ఆ కీలక మహిళా నేత జీరో అయిపోతున్నారా?

ఉప్పులేటి క‌ల్ప‌న‌. కృష్ణాజిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే. ఆదిలో టీడీపీ నుంచి రాజ‌కీయాలు ప్రారంభించిన ఆమె ఆ పార్టీ త‌ర‌పున వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో ఓడిన ఆమె ఆ త‌ర్వాత వైసీపీ పంచ‌న చేరారు. ఈ క్ర‌మంలో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గిరీ ఆశ‌తో పార్టీ మారి టీడీపీ ప్ర‌భుత్వానికి జై కొట్టారు. ఆ …

Read More »

ఏపీలో ఇసుక తుఫాన్ రాబోతుందా ?

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది ఇసుక పంపిణీ గురించే..! తాజాగా ఏపీలో ఇసుక మొత్తం ఒకే కంపెనీకి క‌ట్ట‌బెట్ట‌డంపై విప‌క్షాల్లోనే కాకుండా.. అటు అధికార పార్టీ నేత‌ల్లోనూ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల‌కు దీని వ‌ల్ల త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా తాము ఇసుక తీసుకునేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ప్ర‌భుత్వం నిర్ణ‌యంపై మండి ప‌డుతున్నారు. ఇక …

Read More »

అజహరుద్దీన్‌కు కవిత చెక్

హైదరాబాద్ క్రికెట్ ఎంత దారుణమైన స్థితికి చేరుకుందో అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా యువ క్రికెటర్లు ఎంతోమంది వెలుగులోకి వచ్చారు. ఐపీఎల్‌లో సత్తా చాటుకున్నారు. టీమ్ ఇండియా తలుపు తట్టారు. కానీ ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నుంచి మాత్రం క్రికెట్ ప్రతిభ వెలుగులోకి రావట్లేదు. అనుకోకుండా మహ్మద్ సిరాజ్ అనే కుర్రాడు ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకుని టీమ్ ఇండియా స్థాయికి ఎదిగాడు కానీ.. అంతకుమించి ఇక్కడి నుంచి …

Read More »

బీజేపీ పరిస్ధితేంటో ఇక్కడే అర్ధమైపోయిందా ?

గెలిచేస్తామని, పొడిచేస్తామని ఎప్పటినుండో రచ్చ రచ్చ చేస్తున్న బీజేపీ పరిస్దితి ఏమిటో ఇక్కడే అర్ధమైపోయింది. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉనఎన్నికకు పార్టీలు రంగంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ చాలా రోజుల క్రితమే పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఈమధ్యనే వైసీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ కూడా ప్రకటించేసింది కానీ అభ్యర్ధిని కాదు ప్రచార కమిటిని. అవును మీరు …

Read More »

రాహుల్ వ్యూహాత్మక ప్రచారం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తన ప్రచారంలో ప్రధానంగా తమిళనాడు, కేరళపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. కొద్దికాలం ముందునుండే రాహూల్ యువతను టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించచ్చు. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ మహిళా కళాశాలలో చాలాసేపు గడిపారు. అక్కడి విద్యార్ధినులకు మార్షల్స్ ఆర్ట్స్ శిక్షణలో టిప్ప్ నేర్పించారు. జపనీస్ మార్షల్స్ ఆర్ట్స్ ఐకిడో టిప్స్ నేర్పడం కోసం …

Read More »

చంద్రబాబు+పవన్ కలిస్తే ఏమవుతుంది ?

వీళ్ళద్దరి కాంబినేషన్ పై రాజకీయల్లో చర్చలు మొదలయ్యాయి. ఒకపుడు కొంతకాలం కలిసే ఉన్నారు. తర్వాత విడిపోయారు. మళ్ళీ లోపాయికారీగా కలిసి పనిచేశారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తులు పెట్టుకున్న కారణంగా చంద్రబాబునాయుడుకు దూరమయ్యారు. అయితే ఇటీవల జరిగిన పంచాయితి ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ+జనసేన కలిసి పోటీచేశాయి. పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కలవటం సాధ్యంకాలేదు. ఇలా అవసరం, అవకాశం ఉన్నపుడు కలిసి పనిచేయటం …

Read More »

ఓవైపు నోఎంట్రీ బోర్డు.. మరోవైపు రావాలని పిలుపు..

జనసేన కన్ఫ్యూజన్ మామూలుగా లేదు. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలి? స్టాండ్ ఏమిటన్న విషయంలో వారిలో స్పష్టత మిస్ అవుతోంది. ఈ తీరు ఆ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు..ప్రజల్లో చులకన చేసేలా చేస్తోంది. తాజా ఉదంతం కూడా దీనికి నిదర్శనం. ఓపక్క బీజేపీతో మిత్రత్వం.. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలన్ని ఏపీకి వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి పార్టీతో అంటకాగటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని …

Read More »

భార్యను ఓడించిన ఓటర్లకు షాకిచ్చిన మున్సిపల్ ఛైర్మన్

ఏపీలో ఇటీవల ముగిసిన పురపోరుకు సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు.. విమర్శలు వార్తల రూపంలో రావటం తెలిసిందే. అయితే.. వీటన్నింటికి మించినట్లుగా ఉన్న ఒక ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చేసింది. వైరల్ గా మారిన ఈ ఉదంతం వైసీపీ నేతల తీరు ఎలా ఉందన్న విషయం అర్థమయ్యేలా చేయటమే కాదు.. ఇలాంటి వారి తీరు కారణంగా పార్టీని నష్టం వాటిల్లుతుందన్న ఆలోచనలో అధికారులు లేరంటున్నారు. ఇంతకూ జరిగిందేమంటే.. శ్రీకాకుళం …

Read More »