తెలంగాణ రాజకీయాల్లోకి కొత్త రాజకీయ పార్టీతో ఎంట్రీ ఇస్తున్న వైఎస్ రాజన్న కుమార్తె.. షర్మిల టార్గెట్ ఏంటి? ఇప్పటికే రాజకీయ పార్టీకి సంబంధించి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాజన్న రాజ్యం.. పేర్లతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఒక పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. అసలు షర్మిల తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ …
Read More »తమిళనాడును ఆదర్శంగా తీసుకోలేరా ?
రాష్ట్రప్రయోజనాలు మనకు సంపూర్ణంగా సిద్ధించకపోవటానికి రాజకీయ పార్టీలే ప్రధాన కారణమా ? క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనా అనిపిస్తోంది. ప్రతి చిన్న విషయానికి పెద్దగా రాద్దాంతం చేయటం, ఒకరిపై మరొకరు బురద చల్లేసుకోవటం చూస్తుంటే ఈ పార్టీలకు అసలు రాష్ట్రప్రయోజనాలు పట్టవా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఉదాహరణగా తాజాగా మొదలైన వివాదాన్నే తీసుకుందాం. వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయం బయటకు వచ్చిందో …
Read More »అన్నా-చెల్లెళ్ల వ్యూహంతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి.. ప్లాన్ మారింది!!
తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం. ఇప్పటి వరకు బీజేపీ-కాంగ్రెస్ల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న తెలంగాణ సారథి..కేసీఆర్కు వైఎస్ షర్మిల రాజకీయ ఎంట్రీ ఒక పెద్ద కుదుపుగానే భావించాలి. షర్మిల ఎంట్రీని ఏదో ఆషామాషీగానో.. గతంలో నరేంద్ర, విజయశాంతి వంటివారు తీసుకువచ్చిన పార్టీల మాదిరిగానో తీసిపారేసే పరిస్థితి కేసీఆర్కు లేనేలేదు. రాజకీయంగా.. ప్రజా క్షేత్రంలో బలమైన బ్యాక్ గ్రౌండ్ లేని వారికి.. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి …
Read More »కొడుకు కోసం జానారెడ్డి సైలెంట్ స్కెచ్ ?
తొందరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎలాగైనా తన కొడుకు రఘువీర్ రెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎందుకైనా మంచిదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందాన్ని రంగంలోకి దింపారట. రానున్న ఎన్నికల్లో తాను కానీ లేకపోతే తన కొడుకు కానీ రంగంలోకి దిగితే ప్రజాస్పందన ఎలాగుంటుందనే విషయంలో జననాడిని పట్టుకునేందుకు ప్రశాంత్ తో జానారెడ్డి సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణాలో …
Read More »షర్మిలకు కలిసి వచ్చే ఛాన్స్ ఏంటి? తెలంగాణలో ప్రస్తుత పరిస్తితేంటి?
తెలంగాణ రాజకీయ అవనికపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు సిద్ధమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారైపోయింది. సన్నాహక సమావేశం కూడా భారీ ఎత్తున ప్రారంభం కావడంతో అందరి దృష్టీ ఇప్పుడు షర్మిల పార్టీపైనే పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు షర్మిలకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్తితి ఎలా ఉంది? …
Read More »జయలలితను తలపిస్తున్న షర్మిల.. అదే ఆహార్యం.. అంతేకాదు..ఇంకా ఎన్నో!!
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దాదాపు ఖరారైనట్టే! దీనికి సంబంధించిన సన్నాహక సమావేశానికి తొలి అడుగు పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్లోని వైసీపీ ఒకప్పటి కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్కు చేరుకున్న షర్మిల.. ఆదిత్యం.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపించారని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో జయ కూడా అచ్చు ఇలానే వ్యవహరించారు. ఎంజీఆర్ మరణం తర్వాత.. పార్టీని …
Read More »జయ వారసత్వంపై మొదలైన వివాదం
దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వంపై వివాదం రాజుకుంది. జయలలితకు తానే అసలైన వారసురాలినంటూ జైలు నుండి విడుదలైన వీకే శశికళ ప్రకటించారు. ఆమె చేసిన ప్రకటనతో తమిళ రాజకీయాల్లో ముఖ్యంగా ఏఐఏడీఎంకేలో కలకలం మొదలైంది. జయకు తానే అసలైన వారుసురాలినని, పార్టీకి తాను శాశ్వాత ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ చేసిన ప్రకటన పార్టీలో గందరగోళానికి దారితీసింది. పార్టీ తనదేనని మొత్తం పార్టీని తన ఆధీనంలోకి తీసుకుంటానని శశికళ చేసిన ప్రకటనతో …
Read More »పవన్ ఢిల్లీ పర్యటనతో ఉపయోగం ఉంటుందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రాధమిక సూత్రాన్ని ఎప్పుడో మరచిపోయినట్లున్నారు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టినట్లు అప్పుడెప్పుడో చెప్పుకున్న పవన్ ఆ విషయాన్ని ఎప్పుడో పక్కన పడేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఉక్కు ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులు రోడ్డెక్కితే వాళ్ళకు రాజకీయపార్టీల నేతలు మద్దతుగా నిలబడ్డారు. రాజకీయపార్టీల నేతలు కూడా ఆందోళనల్లో పాల్గొంటుంటే బీజేపీ+జనసేన పార్టీల …
Read More »సంచలనం: ఈటెల కొత్త పార్టీ?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు.. పార్టీ సీనియర్.. ఉద్యమంలో కీలకభూమిక పోషించిన మంత్రి ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? కొత్త పార్టీ పెట్టాలన్న యోచనలో ఆయన ఉన్నారా? ఆ దిశగా వేస్తున్న అడుగుల్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీ పెట్టటం అంత సులువు కాదని.. రాంగ్ ట్రాక్ లోకి వెళ్లొద్దంటూ పార్టీ నేతలకు క్లాస్ పీకింది ఈటెలను ఉద్దేశించేనా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. …
Read More »షర్మిల సమావేశంపై పెరిగిపోతున్న ఆసక్తి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురిగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా షర్మిలకు కొత్తగా పరిచయం అవసరం లేదు. యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఆమె దాదాపు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్ను జైలులో పెట్టినపుడు అన్న కోసమని రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర అప్పటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణాలో జిల్లాల్లో కూడా జరిగింది. ఇప్పుడిదంతా చెప్పుకోవటం ఎందుకంటే కొద్దిరోజులుగా షర్మిల కొత్త …
Read More »కేసీఆర్కు పట్టాభిషేకం.. ఓ కోయిల ముందే కూసింది
తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ పట్టాభిషిక్తుడు కావడానికి ఎంతో సమయం లేదన్నది కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ప్రచారం. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, కేటీఆర్ సీఎం కాబోతున్నాడన్న ప్రచారం నిజం కాదని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించినా సరే.. ఆయన మాటల్ని జనాలు నమ్మడం లేదు. కేసీఆర్ ఇలా కొట్టి పారేసిన చాలా విషయాల్లో అందుకు భిన్నంగా జరగడం తెలిసిందే. కొంత కాలంగా టీఆర్ఎస్ ముఖ్య …
Read More »షర్మిలకు కేసీఆర్ బిగ్ వార్నింగ్.. రీజన్ ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. వైఎస్ జగన్ సోదరి.. వైఎస్ షర్మిలకు గట్టి వార్నింగ్ ఇచ్చారా? పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టు షర్మిల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారా? లేక.. రేపు షర్మిల కొత్త పార్టీ కనుక పెడితే.. తన పార్టీకి గట్టి పోటీ ఇస్తుందనే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. …
Read More »