Political News

జగన్ పార్టీ వీక్ నెస్ తమ్ముళ్లకు తెలిసిపోయిందా?

చట్టసభలు సమావేశమైన వేళ.. అధికార విపక్షాలు ఎత్తులు పైఎత్తులు వేసుకోవటం కామన్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం.. ప్రతిపక్షానికి చుక్కలు చూపించాలని అధికారపక్షం తపిస్తుంటుంది. ఇలాంటివేళ.. అధికారపక్షం కాస్తంత సంయమనంతో వ్యవహరిస్తే.. ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించటం మామూలే. మారిన రాజకీయాలకు తగ్గట్లు.. విపక్షాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అధికారపక్షాలు తన సత్తా చాటటం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఇలాంటప్పుడు తెలివితో ఒకరినొకరు దెబ్బ కొట్టాలే కానీ కండబలాన్ని సభలో ప్రదర్శించటం …

Read More »

చైనాకు డబుల్ లాస్.. ధ్రువీకరించిన అమెరికా

రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినపుడు.. అవతలి వాళ్లే ఎక్కువ నష్టపోయారని.. తమకు జరిగిన నష్టం నామమాత్రమని ఆయా దేశాలు చెప్పుకుంటాయి. ఈ విషయంలో చైనా చేసే అతి గురించి అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య దేశాలైతే యుద్ధంలో తమకు జరిగిన నష్టం గురించి బయటికి చెప్పక తప్పదు. మీడియాలో వార్తలొస్తాయి. అంతర్జాతీయ సమాజానికి విషయం తెలుస్తుంది. కానీ నియంతృత్వ పాలన ఉన్న చైనాలో ఏ సమాచారం బయటికి పొక్కనివ్వరు. కరోనా …

Read More »

చైనాలో.. కరోనా 2.0

కరోనా మహమ్మారిని పుట్టించిన చైనా.. దాన్నుంచి తేలిగ్గానే బయటపడ్డట్లు కనిపించింది. కరోనాకు కేంద్రమైన వుహాన్ నగరం మొదట్లో ఈ మహమ్మారి ధాటికి అల్లాడినప్పటికీ.. లాక్ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంతో వైరస్‌ను పారదోలడంలో విజయం సాధించినట్లు చెప్పుకుంది. అంత పెద్ద చైనా దేశంలో కరోనా ఇతర నగరాలకు విస్తరించలేదు. మొత్తంగా కేసులు లక్ష కూడా దాటలేదు. మరణాలు 5 వేల లోపే ఉన్నాయి. ఇది ప్రపంచానికి చైనా చెప్పిన లెక్క. …

Read More »

జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ప్లస్సా? మైనస్సా?

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలను విపక్ష పార్టీకి చెందిన నేతలు విమర్శించడం సహజం. వాటికి కౌంటర్ గా అధికార పక్షం నుంచి ప్రతి విమర్శలు….సవాళ్లు కామన్. ఇక, అధికారంలో ఉన్నా…ప్రతిపక్షంలో ఉన్నా….సొంతపార్టీపైనే సునిశిత విమర్శలు చేసే నేతలను సస్పెండ్ చేయడం ఏ పార్టీలోనైనా జరిగే తంతే. అయితే, ఓ వైపు సొంత పార్టీని విమర్శిస్తూ…మరో వైపు పొగడ్తలు గుప్పిస్తూ…పార్టీ అధిష్టానానికి …

Read More »

లోకేష్ పై ఏపీ మంత్రి భౌతిక దాడికి ప్రయత్నించారా?

రెండు రోజుల శాసన సభ సమావేశాలు ముగిశాయి. అసెంబ్లీ ఆమోదించి బిల్లులను ప్రవేశపెట్టకుండానే డిప్యూటీ చైర్మన్ మండలిని నిరవధిక వాయిదా వేశారు. అయితే… బడ్జెట్ బిల్లులు పెట్టకుండా సభ ఆపరు అన్న దాంతో వాటికి ముందు రాజధాని బిల్లులు పెట్టి తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును పెట్టాలని అధికార పార్టీ చేసిన ప్రయత్నా్ని ప్రతిపక్షం అడ్డుకుంది. వాదనల అనంతరం చివరకు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టాలని డిప్యూటీ చైర్మన్ …

Read More »

చైనా బార్డర్‌లో ఉద్రిక్తత, మన సైన్యం ఎంత ఉంది?

India-China

భారత్ – చైనా బలగాల మధ్య లఢక్ వద్ద గాల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకొని 20 మంది మన సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా 43 మంది మరణం లేదా గాయాలై భారీ నష్టమే జరిగిందనే వాదనలు ఉన్నాయి. చర్చలు అంటూనే చైనా భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. దీనికి భారత సైనికులు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి బలం …

Read More »

ఇండియాలో మ‌రో లాక్ డౌన్.. ప్ర‌ధాని ఫుల్ క్లారిటీ

దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్‌ను స‌డ‌లించేశారు. అన్ లాక్ పేరుతో థియేట‌ర్లు, జిమ్‌లు లాంటివి మిన‌హా అన్నీ తెరిచేశారు. మాల్స్, ఆల‌యాలు.. అన్ని ర‌కాల దుకాణాలూ ఓపెన్ అయిపోయాయి. దీంతో పాటే క‌రోనా కేసులు కూడా విప‌రీతంగా పెరిగిపోయాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో ఇండియా పీక్స్‌ను చూస్తోందిప్పుడు. ఒక్క రోజుల రెండు వేల‌కు పైగా మ‌ర‌ణాలంటే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ లాక్ డౌన్ పెట్ట‌క త‌ప్ప‌ద‌ని.. …

Read More »

అదే నిజమైతే.. కేసీఆర్ సర్కారుకు షాకే

అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో పలు విమర్శల్ని ఎదుర్కొంటోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఎవరెన్ని చెప్పినా.. మాయదారి రోగానికి ముందస్తుగా నిర్దారణ పరీక్షలు చేయమంటే ససేమిరా అంటూ.. అత్యంత పొదుపును ప్రదర్శిస్తోంది. తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాల్లో రోజువారీగా విస్తారంగా పరీక్షలు నిర్వహిస్తుంటే.. అందుకు భిన్నంగా వ్యవహరించటంలో ఉన్న మర్మం ఏమిటన్నది కేసీఆర్ అండ్ కోకు మాత్రమే అర్థమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. నిర్దారణ …

Read More »

భారత్ – చైనా మధ్య ఘర్షణలు ఇప్పటికి ఎన్ని జరిగాయి?

భారత్ – చైనాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. ఆ మాటకు వస్తే.. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉంది. రెండు దేశాల మధ్యనున్న మూడు సరిహద్దులు వివాదంలో ఉన్నవే. మొండితనంతో పాటు.. తన అవసరాలకు తగ్గట్లు.. తన సరిహద్దు దేశాలతో పేచీ పెట్టుకునే చైనాకు గొడవలు మొదట్నించి అలవాటే. రెండు దేశాల మధ్య ఉన్న మూడు సరిహద్దు ప్రాంతాల్ని చూస్తే.. అందులో మొదటిది మెక్ మోహన్ లైన్.. రెండోది …

Read More »

ఏపీలో ఒక్కరోజు… సంచలన సంఖ్యలో బిల్లులకు ఆమోదం

గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 2 రోజుల అసెంబ్లీ సమావేశాలను చరిత్రలో తొలిసారి చూస్తున్నాం. ఇదంతా కరోనా ప్రభావం. అయితే, వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో సమావేశాల కాలం తగ్గినా బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతోంది. వీరికి 151 మంది మద్దతు ఉండటం ఒకటైతే… ఇతర పార్టీల నుంచి 3 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. పైగా టీడీపీకి చెందిన అచ్చెం నాయుడు రిమాండ్ ఖైదీగా …

Read More »

మ‌ళ్లీ రెచ్చిపోయిన‌ ర‌ఘురామ‌కృష్ణంరాజు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగుర‌వేసిన ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు.. మ‌రోసారి ఫైర్ బ్రాండ్ వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఇటీవ‌లే ఒక వీడియో పెట్టి జ‌గ‌న్, వైకాపా మీద తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న‌.. మ‌రోసారి ఆ పార్టీపై విరుచుకుప‌డ్డారు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వైకాపా ఎమ్మెల్యేల‌కు ఆయ‌న గ‌ట్టిగా బ‌దులిచ్చారు. ఈ సంద‌ర్భంగా ‘‘సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయన్న చందంగా అసెంబ్లీ లాబీలో …

Read More »

ఈ రోజు చనిపోయిన సైనికాధికారి మన వాడట !

ఈ రోజు లడఖ్ పరిధిలోని గాల్వన్ వ్యాలీ వద్ద చైనా – భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించినట్లు ఉదయం వార్తలు విన్నాం కదా. ప్రపంచమంతా చీ కొడుతున్నా చైనా బుద్ధి మారలేదు. అయితే అత్యంత విషాదకరం ఏంటంటే… ఈరోజు దేశం కోసం తుది శ్వాస విడిచిన వ్యక్తి సూర్యాపేట వాసి అని తాజాగా వెల్లడయ్యింది. ఆర్మీ అధికారులు వారి కుటుంబానికి ఈ రోజు సమాచారం ఇవ్వడంతో …

Read More »