వచ్చే నెల 17న జరగనున్న తిరుపతి పార్లమెంటు ఎన్నికలో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ నాయకులు ఆదిశగా తమ వ్యూహాలను తెరమీదికి తెస్తున్నారు. ఇటీవల ముగిసిన స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో.. బీజేపీ చావుదెబ్బతింది. కారణాలు ఏవైనా .. కూడా బీజేపీ ఎక్కడా నిలదొక్కుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పట్టుబట్టి.. మిత్రపక్షం జనసేనను కూడా తప్పించి.. తాము దక్కించుకున్న టికెట్‌ను గెలిచి తీరకపోతే.. మిత్ర …
Read More »జగన్‌కు గట్టి దెబ్బ.. మూడుపై పీటముడి..
ఏపీ సీఎం జగన్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలిందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసుకుని.. ఆర్భాటంగా విశాఖకు వెళ్లిపోదామనుకున్న జగన్ వ్యూహానికి హైకోర్టు రూపంలో గట్టి శరాఘాతమే తగిలిందని చెబుతున్నారు. ప్రస్తుతం మూడు రాజధానులకు ప్రజలు ఓకే చెప్పారని.. అందుకే తమకు అన్ని ఎన్నికల్లోనూ సానుకూలంగా ఫలితం ఇచ్చారని ఊరూ వాడా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ నేతలకు తాజాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో గొంతులో వెలక్కాయపడినట్టు అయింది. చంద్రబాబు …
Read More »బీజేపీతో చెడిందా? జగన్ పాలిటిక్స్‌పై జోరందుకున్న విశ్లేషణలు!
రాజకీయాల్లో అంతర్గత.. లోపాయికారీ ఒప్పందాలు.. వంటివి కామన్. అయితే.. ఇవి ఎన్నాళ్లు ఉంటాయి? ఎంత సేపు నిలుస్తాయనేది చెప్పడం కష్టం. ఎవరికి స్ట్రాటజీ వారిది. ఎవరి రాజకీయ సమరం వారిది. ఏపీ విషయానికి వస్తే.. అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్.. కేంద్రంలోని మోడీ సర్కారుకు విధేయుడి గానే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు 25 మంది ఎంపీలను ఇవ్వండి.. హోదాను సాధిస్తానన్న ఆయన 22 మంది …
Read More »మోడి పోరాటం వృధాయేనా ?
క్షేత్రస్ధాయిలో విస్తృతంగా తిరిగి నిర్వహిస్తున్న సర్వే రిపోర్టులు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానలు పెరిగిపోతున్నాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుడిచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిల్లో తమిళనాడు, కేరళలో ఎలాంటి అశలులేవు కమలనాదులకు. అందుకనే తన దృష్టియావత్తు పశ్చిమబెంగాల్ మీదే పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి అనేకమంది హేమాహేమీలు పదే పదే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎలాగైనా సరే …
Read More »బీజేపీ రికార్డు సృష్టిస్తుందా ?
ఇపుడిదే అంశంపై తిరుపతి లోక్ సభ పరిధిలో రాజకీయ నేతలు+ జనాలు కాస్త వ్యగ్యంగానే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ బీజేపీ సృష్టించే రికార్డు ఉపఎన్నికల్లో గెలవటం కాదు, నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) ను దాటడమే. అవును మీరు చదివింది అక్షరాల నిజమే. మొన్నటి అంటే 2019 తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో 13 మంది పోటీచేశారు. వీరిలో ప్రధానపార్టీల అభ్యర్ధులు+ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు అత్యధికంగా …
Read More »షర్మిల ధీమానే వేరు
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల నోటి నుంచి వస్తున్న మాటలు అందరిని ఆకర్షించేలా ఉంటున్నాయి. ప్రజాజీవితంలోకి రావాలనుకునే వారు.. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న విషయాన్ని ఆమెను చూసి నేర్చుకోవాలన్న మాట వినిపిస్తోంది. పార్టీని పెడతానని చెప్పిన రోజు నుంచి.. ప్రతి రోజు ఏదోఒక కార్యక్రమాన్ని నిర్వహించటం.. తాను చెప్పాల్సిన మాటల్ని చెప్పటం కనిపిస్తుంది. అంతేకాదు.. వారంలో ఒకరోజు అయినా పార్టీకి సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్య ఒకటి …
Read More »అదేంది రఘురామ? రూ.237 కోట్లు దారి మళ్లించారా?
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన నరసాపురం ఎంపీ వైసీపీ రెబల్.. రఘురామ క్రిష్ణం రాజు మరోసారి తాజా సంచలనంగా మారారు. ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. సొంత పార్టీ మీద అదే పనిగా విమర్శలు గుప్పించటంతో పాటు.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పడేసేలా వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. అలాంటి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. రఘురామ పేరు విన్నంతనే అధికార వైసీపీ నేతలు పళ్లు …
Read More »వ్యూహాత్మక నిర్ణయాలతో.. జగన్ ఆకర్ష్ పాలిటిక్స్
రాజకీయాల్లో వ్యూహాలు అమలు చేయడం వేరు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడం వేరు. వ్యూహాలు కామన్‌గా అన్ని పార్టీల నాయకులు అమలు చేస్తుంటారు. అవి ఒక్కొక్కసారి విజయవంతం అవుతాయి.. కొన్నికొన్ని సార్లు వికటిస్తాయి.. కానీ, వ్యూహాత్మక నిర్ణయాలు.. మాత్రం ఖచ్చితంగా విజయం దిశగానే అడుగులు వేస్తాయని అంటారు పరిశీలకులు. ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్నసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డెక్కి ప్రజల్లోకి వెళ్లినా.. …
Read More »ఆమెకు బీజేపీ టికెట్టు.. వెనుక.. పవన్ సిఫార్సు..!
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఎట్టకేలకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి… రత్నప్రభ.. అత్యంత కీలక సమయంలో కర్ణాటకలో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు.. అవినీతి రహితంగా వ్యవహరించి.. తన సర్వీసులో మంచి రికార్డును కూడా నెలకొల్పారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమెకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. అయితే.. దీని వెనుక.. జనసేన అధినేత పవన్ …
Read More »ఎయిర్ పోర్టు ఓపెనింగ్.. కీలక వ్యాఖ్య చేసిన జగన్
ఒక ఎయిర్ పోర్టుకు రెండు ప్రారంభోత్సవాలా? అంటూ కొందరి విమర్శల నడుమ.. కర్నూలుకు దగ్గర్లోని ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్ పోర్టును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏళ్లకు ఏళ్లుగా కర్నూలు ఎయిర్ పోర్టు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది కల నేటికి తీరింది. చంద్రబాబు హయాంలోనే నిర్మాణం మొదలై పూర్తి చేసుకున్న ఈ ఎయిర్ పోర్టులో మరో మూడు రోజుల్లో ప్రయాణికుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాశ్రయాన్ని ప్రారంభించిన …
Read More »షర్మిల బహిరంగసభ జరుగుతుందా ?
ఇపుడిదే అంశం అందరినీ పట్టి పీడిస్తోంది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం హెడ్ క్వార్టర్స్ లో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు షర్మిల తరపున అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా చరిత్రలోనే జరగని విధంగా బహిరంగసభ అద్దిరిపోవాలని షర్మిల ఇప్పటికే ఆదేశాలు ఇచ్చున్నారు. లక్షమందికి తక్కువ కాకుండా జనాలు హాజరయ్యేట్లుగా ఏర్పాట్లు జరగాలని తన మద్దతుదారులతో ఇప్పటికే గట్టిగా చెప్పారు. అందుకనే ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అయితే తెలంగాణాలో హఠాత్తుగా …
Read More »చిన్నమ్మ విషయంలో అనూహ్య నిర్ణయం
తమిళనాడు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అధికార అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ అలియాస్ చిన్నమ్మను పార్టీలోకి ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ పార్టీలోకి శశికళ రాదలచుకుంటే ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టంగా ప్రకటించారు. పన్నీర్ చేసిన తాజా ప్రకటన తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే పన్నీర్+సీఎం, పార్టీ అధినేత పళనిస్వామి ఒకపుడు చిన్నమ్మను పార్టీలోకి రానీయకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. జైలు నుండి …
Read More »