కేసీఆర్‌కు బీజేపీ చెక్‌.. ఈట‌ల‌కు బ్లూ ప్రింట్ ఇచ్చారా..?

రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించ‌డం ఒక‌ప్ప‌టి లెక్క‌. కానీ, ఇప్పుడు అస‌లు ప్ర‌త్య‌ర్థులే లేకుం డా చూసుకోవ‌డం ప్ర‌ధాన లెక్క‌గా రాజ‌కీయ పార్టీలు నిర్ణ‌యించుకున్నాయి. ఆదిశ‌గానే అడుగులు వేస్తు న్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్న తెలంగాణ‌, ఏపీల్లో మాత్రం ప్ర‌త్య‌ర్థి పార్టీపై రాజ‌కీయ నేత‌లు ఇలాంటి రాజ‌కీయాలే చేస్తున్నాయి. తెలంగాణ విష‌యాన్ని తీసుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అధికా రంలోకి రావాల‌ని బీజేపీ స్కెచ్ సిద్ధం చేసుకుంది.

సీఎం కేసీఆర్ వంటిబ‌ల‌మైన నాయ‌కుడిని ఓడించ‌డం ద్వారా బీజేపీ పుంజుకునే వ్యూహానికి రెడీ అయిం ది. ఇక‌, ఈ పార్టీ అనుకున్న‌దే త‌డువుగా.. కేసీఆర్‌ను ఓడించేందుకు నాయ‌కుడు దొర‌కాలి క‌దా! అంటా రా? అది కూడా జ‌రిగిపోయింది. తెలంగాణ కేసీఆర్ బాధితుడిని అని చెప్పుకొనే మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ సీఎం పై పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను ఓడించ‌డ‌మే ధ్యేయంగా రాజేంద‌ర్ పావులు క‌దుపుతున్నారు.

ఈయ‌న దూకుడును అర్ధం చేసుకున్న బీజేపీ.. పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే ప‌నిపూర్తి చేసుకోవ‌చ్చ‌ని నిర్ణ‌యిం చుకుందో ఏమో.. వెంట‌నే ఈట‌ల‌ను ఢిల్లీకి పిలిచి.. దిశానిర్దేశం చేసి బ్లూ ప్రింట్ కూడా ఇచ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు.. కాదు.. ఈ సారి త‌న నియోజ‌క‌వ‌ర్గం మార్చుకుంటార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

స‌రే.. కేసీఆర్ ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఆయ‌న‌ను ఓడించి తీరుతాన‌ని ఈట‌ల పంతంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయన గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే,ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఎలా న‌మ్మించాలి.. వారి ఓట్లు ఎలా పొందాలి? అనే విష‌యాల‌పైక‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన ఈట‌ల‌.. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని వారికి వివ‌రించాలని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

పార్టీకి.. రాష్ట్రానికి తాను ఎంతో సేవ చేశాన‌ని.. అయినాకేసీఆర్ త‌న‌కు వెన్నుపోటు పొడిచారంటూ ఆయ‌న ప్ర‌చారం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. మొత్తంగా చూస్తే..కేసీఆర్‌ను ఓడించేందుకు ఈట‌ల రెడీ అయినా.. ఇది స‌క్సెస్ కావాలంటే బ‌లంగానే పోరాడాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.