వైసీపీలో ఇదే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత…. ఆయన లెక్కకు మిక్కిలిగా సలహాదారు పదవులు కేటాయించారు. తనకు ఎన్నికల సమయంలో సాయం చేసిన వారితోపాటు.. మీడియా పరం గా తన వాయిస్‌ను బలంగా వినిపించిన వారిని కూడా ఆయన అక్కున చేర్చుకుని సలహాదారు పదవులకు ప్రమోట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఒకరిద్దరు సలహాదారులు మాత్ర తమ విధులకు దూరంగా.. రాజకీయాలు …
Read More »3 కోట్లతో మంత్రికి ఇల్లు కట్టించిన ఆ అధికారి ఎవరు సోమూ
బీజేపీ ఏపీ చీఫ్.. సోము వీర్రాజు.. అడ్డంగా బుక్కయ్యారు. ఆయన వేసిన వ్యూహం ఆయనకే ఇప్పుడు రివర్స్ అయింది. రాజకీయంగా సంచలనం సృష్టించాలని అనుకున్నారో..ఏమో తెలియదు కానీ.. సోము.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి ఆదారాలను చూపించలేక పోయారు. దీంతో ఇప్పుడు సదరు విమర్శలు.. ఆయనను రాజకీయంగా టార్గట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ.. సోము కొన్ని కీలక కామెంట్లు చేశారు. ఈ …
Read More »మల్లాదిని ప్రమోట్ చేస్తున్నారా? బెజవాడలో మారుతున్న రాజకీయం
బెజవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు సీఎం జగన్.. ప్రమోషన్ ఇవ్వనున్నారా? ఆయనకు కేబినెట్లో బెర్త్ ఖరారవుతుందా? ఇప్పుడు ఇదే అంశంపై బెజవాడలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఆయన ను జగన్ పక్కకు తప్పించారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని కొందరు అంటున్నారు. అయితే.. ఇప్పటికే మంత్రిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌కు …
Read More »తెలంగాణలో పాదయాత్రల సీజన్
తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల్లో జరుగుతున్న మార్పులు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఇంకా షెడ్యూల్ వెల్లడికాని హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. ఆ ఎన్నికల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా మరోవైపు అతణ్ని నిలువరించేందుకు సీఎం కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ కూడా …
Read More »ఆట ఇపుడే మొదలైందా ?
క్రికెటర్ కమ్ సీనియర్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ఇష్టంలేకుండా జరిగిన నియామకం ఇది. అమరీందర్ తో పాటు చాలామంది ఎంపిలు, ఆయన మద్దతుదారులు వ్యతిరేకించినా సిద్దూకి అధిష్టానం పార్టీ పగ్గాలు అప్పగించటంతోనే పంజాబ్ లో అసలైన ఆట మొదలైనట్లయ్యింది. నిజానికి ఏ పార్టీలో అయిన కీలకమైన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి లాంటి పదవుల్లో …
Read More »టీడీపీ వియ్యంకులు జంపేనా…!
వాళ్లిద్దరూ వియ్యంకులు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్రస్ లేరు. అసలు టీడీపీలో వాళ్ల గురించి ఎవ్వరికి తెలియదు. అయితే 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్లో చక్రం తిప్పారు. పైగా ఇద్దరు మంత్రులుగా మామూలు హవా చెలాయించలేదు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఎందుకు యాక్టివ్‌గా ఉండడం… టైం వేస్ట్ అనుకున్నారో ఏమోగాని.. అసలు బయటకు రావడం లేదు.. ఆ ఇద్దరు టీడీపీ …
Read More »అస్త్రాలు సిద్ధం చేసుకున్న టీడీపీ..
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య తీవ్ర యుద్ధమే సాగనుం దని అంటున్నారు పరిశీలకులు. ఏపీ ప్రబుత్వ వైఫల్యాలను పార్లమెంటు వేదికగా ప్రశ్నించేందుకు టీడీపీ ఎంపీలు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. వైసీపీని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య పార్లమెంటు వేదికగా వాగ్యుద్ధం జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ఈ సమావేశంలో 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలపై చర్చ …
Read More »కేంద్రం పై విజయసాయి ఫుల్లు ఫైర్..నిజమేనా ?
అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మామూలుగా అయితే ఇప్పటివరకు బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వైసీపీ నుండి ఎవరు ఇంత గట్టిగా మాట్లాడలేదు. విషయం ఏదైనా ఏదో సర్దుబాటు ధోరణిలోనో, లేదా రిక్వెస్టింగ్ గానో వైసీపీ ఎంపిలు, నేతలు మాట్లాడుతున్నారు. కానీ మొదటిసారి కేంద్రంపై విజయసాయి ఇంతస్ధాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నుండి పార్లమెంటు …
Read More »మోడీ పక్కా ప్లాన్.. వివాదాస్పద బిల్లులకు ఆమోద ముద్ర ఖాయం!
సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు.. ప్రబుత్వానికి ఒక పరీక్ష పెడుతుంటే.. విపక్షాలకు మరో పరీక్ష పెట్టనున్నాయని అంటున్నారు పరిశీలకులు. సమావేశాల నేపథ్యంలో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో అధికార పక్షం బరిలోకి దిగుతోంది. చట్టాలకు సంబంధించి భారీ అజెండా రూపొందించుకుంది. 17 కొత్త బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. కత్తులు నూరుతున్న విపక్షాలు మరోవైపు, ప్రధాన సమస్యలపై సర్కారును …
Read More »తెలంగాణలో టీడీపీ కొత్త బాస్ ఎవరో తెలుసా?
తెలంగాణలో టీడీపీకి కొత్త బాస్ ని ఎంపిక చేశారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీకి నమ్మకంగా పనిచేస్తున్న బక్కని నర్సింహులును టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరటంతో ఆ అవకాశం బక్కని నరసింహులుకు దక్కింది. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మొదట్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చినా …
Read More »రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్.. ఢిల్లీ పర్యటన ఆపేందుకేనా?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారా..? ఆయన ఇంటి వద్ద ఉన్న పోలీసు బలగాలను చూస్తుంటే.. అదే నిజమని ఎవరికైనా అర్థమౌతుంది. కాగా.. ఇప్పుడు ఆయనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఢిల్లీ పర్యటనను అడ్డుకునేందుకే ఈ హౌస్ అరెస్టు చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే వేలం వేసిన కోకాపేట భూముల వేలంలో …
Read More »టీడీపీకి దేవేందర్ గౌడ్ గుడ్ బై చెబుతారా?
టీడీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ దేవేందర్ గౌడ్ మరోసారి టీడీపీకి గుడ్ బై చెబుతారా? త్వరలోనే ఆయన పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన దేవేందర్‌గౌడ్.. అన్నగారు ఎన్టీఆర్ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, తర్వాత చంద్రబాబు హయాంలో రెవెన్యూ, హోం శాఖల మంత్రిగా తర్వాత స్పీకర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ …
Read More »