బీజేపీకి ఇటీవల జాతీయ రాజకీయాల్లో వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ, బెంగాల్, తమిళనాడులో బీజేపీకి మామూలు ఎదురు దెబ్బతగల్లేదు. ముఖ్యంగా బెంగాల్ పరాజయాన్ని బీజేపీ నేతలు ఇప్పటకీ జీర్ణించుకోలేకపోతున్నారు. గత సాధారణ ఎన్నికల్లో బెంగాల్లో కేవలం మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు గెలిచిన బీజేపీ మొన్న ఎన్నికలకు ముందు అధికారం మాదే అని నానా హడావిడి చేసేసింది. చివరకు ఫలితాల్లో 75 …
Read More »పాపం.. ఆ డాక్టర్ చనిపోయాడు
గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు మీద విమర్శలు చేసి వివాదాల్లోకెక్కిన డాక్టర్ సుధాకర్ గుర్తున్నాడా? ఆయన శుక్రవారం చనిపోయాడు. సుధాకర్ గుండెపోటుతో తనువు చాలించినట్లు తెలుస్తోంది. సుధాకర్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని.. ఆయన మృతికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ …
Read More »టీడీపీ కోటల్ని కూల్చిన వంశీ-అవినాష్.. !
కృష్ణా జిల్లా పూర్తిగా వైసీపీ వశమైపోతుందా? కంచుకోటలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అవుతుందా ? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లాపై టీడీపీకి మంచి పట్టు ఉంది. ఏ ఎన్నికలైన ఇక్కడ టీడీపీ సత్తా చాటేది. అయితే 2019 ఎన్నికల తర్వాత నుంచే జిల్లాలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 14 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుంటే, టీడీపీ …
Read More »షర్మిల రాజకీయం సైడ్ అయిపోయింది ?
తెలంగాణలో రాజకీయ పార్టీ పెడతానని ఏపీ సీఎం వైఎస్. జగన్ సోదరి వైఎస్. షర్మిల చేసిన ప్రకటనే రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపింది. షర్మిల పార్టీ ప్రకటన తెలంగాణ కంటే కూడా ఏపీలో పెద్ద కుదుపు కుదిపింది. అన్న ఇక్కడ సీఎంగా ఉంటే చెల్లి షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ ఎలా ? పెడతారని పెద్ద చర్చలే నడిచాయి. ఏదేమైనా షర్మిల పార్టీ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆమె …
Read More »ఏపీ ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల రద్దు.. హైకోర్టు సంచలనం
ఏపీలో ఆ మధ్యన జారీ చేసిన ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ కు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. నోటిఫికేషన్ జారీలో నిబంధనల్ని పాటించలేదని పేర్కొంది. సుప్రీం ఆదేశాల్ని పాటించలేదన్న విషయాన్ని పేర్కొన్నారు. పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాల్ని పాటించలదేని.. అందుకే నోటిఫికేషన్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని ఆదేశించింది. …
Read More »ఈటల ఢిల్లీ ప్రయాణం దేనికో ?
మాజీమంత్రి, ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. శని, ఆదివారాల్లో ఢిల్లీలోని పలువురు కీలక నేతలతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. కేసీయార్ తో పడని కారణంగా చాలాకాలంగా ఈటల వ్యవహారం బాగా చర్చనీయంశమవుతోంది. ఈ నేపధ్యంలో భూకబ్జాల ఆరోపణలపై ఒక్కసారిగా ఈటలను వైద్య, ఆరోగ్య శాఖమంత్రిగా పీకేశారు. తర్వాత మంత్రిగా కేసీయార్ బర్తరఫ్ చేశారు. ప్రస్తుతం మాజీమంత్రి టీఆర్ఎస్ లో ఉన్నారో లేదో కూడా కన్ఫ్యూజన్ గానే ఉంది. …
Read More »కరోనా వేళలోనూ సెంటిమెంట్ ను మిస్ కాని కేసీఆర్
ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మిన్ను విరిగి మీద పడినప్పటికి తనదైన స్టైల్ లోనే ఉంటారు తప్పించి.. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే విషయంలో కేసీఆర్ నిశ్చితాభిప్రాయాలు కొన్ని ఉంటాయి. తాను ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని కలుసుకోకూడదన్న దానిపై ఆయన చాలా క్లియర్ గా ఉంటారు. తనకు ఎంత సన్నిహితులైనప్పటికి.. వారికి వారుగా కలుసుకోవాలనుకున్నంతనే కలుసుకోలేని సిత్రం.. కేసీఆర్ …
Read More »కేరళ మోడల్ లో చంద్రబాబు వెళ్ళక తప్పదా ?
పార్టీ బలోపేతం అవ్వాలన్నా, పూర్వవైభవం రావాలన్నా అర్జంటుగా చంద్రబాబునాయుడు కేరళనే ఆదర్శంగా తీసుకోవాలేమో. తొందరలో కేరళకు ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపధ్యంలో 20వ తేదీన కొలువు తీరబోతున్న మంత్రివర్గంలో అందరు కొత్తముఖాలే కనబడబోతున్నాయి. సీపీఎం నుండి ప్రమాణం చేయబోయే 12 మంది మంత్రులూ కొత్తవారే. ఇక సీపీఎం భాగస్వామ్య పార్టీ అయిన సీపీఐ, కేరళా కాంగ్రెస్ కూడా కొత్త వారికే అవకాశాలు కల్పించాలని …
Read More »తారక్ కోసం లోకేష్ వచ్చాడు.. బాబు రాలేదు
జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన అవసరానికి వాడుకుని వదిలేశాడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. 2009 ఎన్నికల ముంగిట ప్రచారానికి తారక్ సాయం తీసుకోవడం, అప్పుడు అతడికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇవ్వడం.. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అతణ్ని పట్టించుకోకపోవడం.. పైగా ఆ పరాజయాన్ని తెలుగుదేశం వర్గాలు అతడికి ఆపాదించే ప్రయత్నం జూనియర్ రాముడి అభిమానులను బాధించిన మాట వాస్తవం. తారక్ను ఆదరిస్తే, …
Read More »కేసీయార్ చేసిన పని జగన్ చేయగలరా ?
కరోనా వైరస్ రోగుల్లో ఆత్మ స్ధైర్యాన్ని నింపే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కేసీయార్ ను ఫాలో అయితే బాగుంటుంది. ముఖ్యమంత్రయిన దగ్గర నుండి కేసీయార్ గాంధి ఆసుపత్రిలోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. తనకు ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైనా సోమాజిగూడలోని కార్పొరేట్ ఆసుపత్రికే వెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు మాత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు. కేసీయార్ గాంధిలో అడుగుపెట్టింది వైద్య పరీక్షల కోసంకాదు. కరోనా వైరస్ రోగులను …
Read More »కేసీఆర్ ను ఈటల ఇంతగా భయపెట్టారా?
నిజమే… ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే… టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు… మొన్నటిదాకా తన కేబినెట్ లో ఓ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్ ను చూసి బాగానే భయపడినట్టున్నారు. ఈటలను ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్… ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. త్వరలో అది కూడా జరిగే తీరుతుందన్న వాదనలైతే వినిపిస్తున్నాయి. కేబినెట్ నుంచి గెంటేయబడ్డా… ఈటల ఇంకా టీఆర్ఎస్ …
Read More »ముగ్గురు ముగ్గురే.. ఒక్కరు మాస్కు పెట్టుకోరా జగన్?
విషయం ఏదైనా కావొచ్చు. చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. కరోనా విషయంలో ఏ చిన్న ఏమరపాటు సరికాదు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన చుట్టు ఉన్నవారు ఎందుకు మర్చిపోతున్నారు. ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఏపీ సీఎం ముఖానికి మాస్కుపెట్టుకోకపోవటం తెలిసిందే. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పించి ఆయన ముఖానికి మాస్కు పెట్టుకోరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ …
Read More »