Political News

సంచ‌ల‌నంః దేశంలో మ‌రో మూడు కొత్త రాష్ట్రాలు!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుందా? మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు భిన్న‌మైన నిర్ణ‌యం జ‌ర‌గ‌బోతోందా? అంటే అవున‌నే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో నాయకత్వ మార్పు, క్యాబినెట్ విస్తరణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయ‌ని చెప్తున్నప్పటికీ అస‌లు కథ యూపీని విభ‌జించ‌డ‌మ‌ని …

Read More »

ఈటల ఇలా చేయడం ఇది మూడోసారి..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాని స్పీకర్ ఆమోదించారు. కాగా.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఈటలకు ఇది మూడోసారి కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ నిలిచారు. పదవీకాలాం ఉండగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడో సారి కావడం …

Read More »

నిముషానికి 1000 మంది సెర్చ్‌.. జ‌గ‌న్ గురించే..

ఆన్‌లైన్‌లో అనేక విష‌యాల‌పై సెర్చ్ చేస్తుంటారు. కానీ, కొన్ని మాత్ర‌మే రికార్డు సృష్టిస్తాయి. ఇలాంటి వాటిలో మ‌రోసారి.. ట్రెండింగ్‌లో ఉన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. దాదాపు మూడేళ్ల కింద‌ట‌.. ఆయ‌న ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో ఒక‌సారి.. జ‌గ‌న్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసిన వారు.. నిముషానికి 1000 మంది అని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎంచుకున్న సుదీర్ఘ పాద‌యాత్ర‌, ఆయ‌న‌పై ఉన్న కేసులు. …

Read More »

నాతో అంత ఈజీ కాదు.. జగన్ కి ఆర్ఆర్ఆర్ మరో లేఖ

వైసీపీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు పై అనర్హత వేటు వేయాల్సిందిగా వైకాపా చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలు సమర్పించామని భరత్ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజుపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం …

Read More »

కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌… పార్టీకి ప్ర‌ణ‌బ్ కుమారుడి గుడ్ బై?

దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎదురుగాలిని ఎదుర్కోవ‌డం, ప్ర‌తిప‌క్ష పార్టీగా పుంజుకోవాల్సింది పోయి బ‌ల‌హీన‌ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ ఎదురుకానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బెంగాల్ లో అధికార పార్టీ అయిన టీఎంసీలో చేర‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పార్టీలో చేరిక‌ల విష‌యంలో సీరియ‌స్ గా ఉన్న మ‌మ‌తా బెన‌ర్జీ ఈ మేర‌కు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టార‌ని …

Read More »

శరద్ పవార్ టార్గెట్ ఏమిటో తెలుసా ?

మహారాష్ట్రలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశ అత్యున్నత పదవిపై కన్నేశారా ? అవునే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. 2022లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై పవార్ కన్నేసినట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పవార్ భేటీ అయ్యారట. రాష్ట్రపతి ఎన్నికకు వ్యూహకర్త ప్రశాంత్ కు ఏమిటి సంబంధం ? అనే డౌట్ రావచ్చు. తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ …

Read More »

మ‌న‌సులో మాట‌ మొహ‌మాటం లేకుండా చెప్పేసిన జ‌గ‌న్‌.. !

కేంద్ర ప్ర‌భుత్వం, బీజేపీ అగ్ర‌నాయ‌కుల ద‌గ్గ‌ర ఏపీ సీఎం జ‌గ‌న్ మొహ‌మాటం లేకుండా మాట్లాడేశారా ? ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న కుండ బ‌ద్ద‌లు కొట్టారా ? ఇక‌, ఆలోచిస్తూ.. కూర్చుంటే.. రోజులు నెల‌లు సంవ‌త్స‌రాలు కూడా జ‌రిగిపోతాయ‌ని.. ఈ క్ర‌మంలో ఏదైతే అదే జ‌రుగుతుంద‌ని ఆయ‌న కేంద్రం వ‌ద్ద ఉన్న విష‌యాల‌ను క‌క్కేశారా ? అంటే.. ఔన‌నే అంటోంది జాతీయ మీడియా. నిజానికి జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. …

Read More »

మండలి ఛైర్మన్ ఈయనేనా ?

శాసనమండలి ఛైర్మన్ గా ఎవరిని నియమించాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేయటానికి ఇప్పటికే ప్రభుత్వం నుండి నాలుగుపేర్లు గవర్నర్ పరిశీలనకు పంపినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటినుండి పదవుల భర్తీలో సామాజికవర్గాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్న జగన్ ఈ జాబితా విషయంలో కూడా సామాజిక న్యాయం పాటించినట్లు …

Read More »

బీజేపీలోకి హరీష్ రావు కీలక అనుచరుడు..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రభావం.. టీఆర్ఎస్ పై గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఈటల రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయనతోపాటు.. మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మ‌న్ తుల ఉమ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే.. వీళ్లు కాకుండా.. హరీష్ రావు కీలక అనుచరుడు ఒకరు …

Read More »

రఘురామ పై వైసీపీ సీరియస్ యాక్షన్..!

నర్సాపురం ఎంపీ రఘురామ రాజుని ఏదో ఒకటి చేసేదాక.. వైసీపీ నేతలకు నిద్రపట్టేలా కనపడట్లేదు. ఇప్పటికే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసుతో అయినా.. ఆయన సైలెంట్ అవుతారని అందరూ భావించారు. అయితే.. ఆయన ఏమాత్రం తగ్గకుండా.. తిరిగి రెచ్చిపోవడం మొదలుపెట్టారు. దీంతో.. ఈసారి వైసీపీ అధిష్టానం సీరియస్ యాక్షన్‌కు దిగింది. దీనిలో భాగంగా ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. …

Read More »

ఓట్లు వేయించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. సీనియర్ నేత, సోనియా, రాహూల్ కోటరీలో ముఖ్యుడైన వీరప్ప మొయిలీ మాట్లాడుతు కాంగ్రెస్ పునరుజ్జీవనానికి పెద్ద ఆపరేషన్ అవసరమన్నారు. పనిలో పనిగా నాయకత్వం విషయంలో కేవలం వారసత్వంపైనే పార్టీ ఆధారపడేందుకు లేదని చెప్పటం ద్వారా తేనెతుట్టెను కదిపారనే అనుకోవాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్ధితికి సీనియర్లే కారణమని చెప్పాలి. పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ పదవులు, అపరిమతమైన …

Read More »

సీఎం పదవి పోవడం ఖాయమేనా?

కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు పదవీగండం పొంచుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి. చాలాకాలంగా యడ్డీని సీఎంగా దింపేందుకు ప్రత్యర్ధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఎంఎల్ఏల సంతకాల సేకరణ కూడా ఊపందుకుంది. యడ్డీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన ఎంఎల్ఏల సంతకాలతో ఇటీవలే కొందరు నేతలు ఢిల్లీ వెళ్ళి అగ్రనేతలను కలిసినట్లు సమాచారం. యడ్డీ ఎప్పుడు సీఎంగా ఉన్నా ఇదే సమస్య మొదలవుతోంది. …

Read More »