విభజన జరిగి ఎనిమిదిన్నరేళ్లు కావొస్తోంది. ఉమ్మడిగా ఎన్ని ఏళ్లు ఉన్నప్పటికీ ఒకసారి విడిపోవాల్సి వస్తే.. లెక్కలు ఆటోమేటిక్ గా తెర మీదకు వస్తాయి. అది భార్యభర్తల బంధంలో కావొచ్చు. రాష్ట్రాల విషయంలో కావొచ్చు. సాధారణంగా విడిపోవటం అన్న ప్రక్రియ మొదలైనంతనే.. ఆస్తులు.. అప్పుల లెక్కలు రావటం.. ఎవరికేమిటి? అన్న పంచాయితీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఏపీ ప్రజలు విడిపోయే ప్రసక్తే లేదన్న మాట …
Read More »హత్య కేసులో బయటికొస్తే విజయయాత్ర
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు బాబు.. కొన్ని నెలల కిందట ఒక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తన దగ్గరే డ్రైవర్‌గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ కుర్రాడిని కొట్టి చంపిన కేసులో బాబు ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్నారు. బాబునే స్వయంగా సుబ్రహ్మణ్యంను అతడి ఇంటి నుంచి తీసుకెళ్లడం.. తర్వాత తన శవాన్ని కార్లో …
Read More »అబ్బా…! ఏం ప్లాన్ వేశావ్ కన్నా… ?!
కన్నా లక్ష్మీ నారాయణ తెలుగు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు. ఉమ్మడి గుంటూరు జిల్లా పెద కూరపాటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన నేతగా ఆయన్ను ఓటర్లు నిత్యం గుర్తు చేసుకుంటారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఆయన సేవలను ప్రస్తావిస్తుంటారు. ఆయన ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పుకున్నారు. ఆ అవకాశం చేజారిన తర్వాత రాజకీయాల్లో కన్నా కొంచెం నిదానించినట్లే కనిపిస్తోంది. విభజన తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ ను వీడిన కన్నా… …
Read More »వస్తారా? రండి.. రండి.. జనసేన వలకు పెద్ద చేపలు!
ఏపీలో అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న జనసేన.. పెద్ద చేపలు వల విసురుతోందనే వాదన వినిపి స్తోంది. పైకి ఎన్ని విధాలుగా ఆదర్శం ప్రదర్శించాలని అనుకున్నా.. రాజకీయాలు అలా లేవు. ప్రజలు కూడా అలా లేరు(ఇది.. నిజం!). మాకేంటి? అనుకునే వర్గాలు.. మా లాభమేంటి అని భావిస్తున్న ప్రజలు పెరిగిపోతున్నారనేది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో ప్రజలకు డబ్బులు ఇవ్వకపోయినా.. కనీసం వారిని ప్రభావితం చేసే నాయకులు ఇప్పుడు జనసేనకు అవసరం. …
Read More »బీఆర్ఎస్‌ను చూసి సంబర పడుతున్న బీజేపీ
కేంద్రంలో మోదీని గద్దె దించుతానంటూ కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేస్తానంటున్నారు. ఈ రోజు దిల్లీలో పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించబోతున్నారు. తాను ఒక్కో స్టెప్ వేస్తుంటే బీజేపీ భయపడుతుందని కేసీఆర్ అనుకుంటుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం కేసీఆర్ ఒక్కో అడుగు చూసి సంబరపడుతున్నారు. తెలంగాణ దాటి కేసీఆర్ వేసే ప్రతి అడుగూ తమకు లాభదాయకమేనని వారు లోలోన సంతోషిస్తున్నారు. కేసీఆర్ అంటే ఎన్నికల …
Read More »కేసీఆర్ ఏపీకి వస్తే.. వీటికి సమాధానం ఏంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. తన జాతీయ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఖాయం. ఎందుకంటే.. ప్రస్తుతం డిల్లీలో ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కాగానే 2024 సార్వత్రిక సమరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్ని రాష్ట్రాల్లోనూ కలియదిరుగుతారు. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నిస్తారు. ముందుగా ఈ జాబితాలో ఏపీ ఉందని అంటున్నారు. పొరుగునే ఉన్నరాష్ట్రం.. పైగా తనకు తెలిసిన …
Read More »ఏపీకో దండం… ఇక మేం పోతాం…
విశాఖను ఎగ్జిక్యుటివ్ కేపిటల్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. త్వరలో పాలనను సాగర నగరం నుంచి ప్రారంభిస్తానని చాలా రోజులుగా చెబుతున్నారు. ఆ నగరాన్ని అందమైన నందనవనంగా మార్చే ప్రయత్నం ఒక వంతయితే.. అన్ని రకాల వసతులు, కార్యాలయాలు, విద్యా సంస్థలు పెంచడం మరో వంతు అని వైసీపీ వర్గాలు బాకా ఊదుకుంటున్నాయి. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని తాజా పరిస్థితులు చెబుతూనే ఉన్నాయి. ఎంత దాచినా …
Read More »పీఏసీకి పొగ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతే గురూ!!
పీఏసీ.. ప్రజా పద్దుల కమిటీ.. ఇది ఏ రాష్ట్రంలో అయినా.. ప్రభుత్వం చేసే ఖర్చులు, వ్యయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ.. హెచ్చరికలు జారీ చేయడం.. ప్రజలు పన్నుల ద్వారా కడుతున్న సొమ్మును ప్రభుత్వాలు ఎలా ఖర్చు చేస్తున్నాయో.. లెక్కలు కోరడం.. దానిని మదింపు చేయడం, శాసన సభకు వివరించడం.. ముఖ్యంగా స్పీకర్‌కు నివేదిక అందించడం అనేది పీఏసీ పని. ఇదేమీ.. ఊరికేనే పనిలేక ఏర్పాటు చేసిన కమిటీ కాదు. …
Read More »ఆ మినిస్టర్ మళ్లీ క్యామెడీ అయిపోయాడుగా..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల నేతలను తిట్టడానికే మంత్రుల్లో కొందరిని కేటాయించి తరచుగా వారితో ప్రెస్ మీట్లు పెట్టించడం చూస్తూనే ఉన్నాం. తొలి రెండున్నరేళ్లు ఈ బాధ్యతను ప్రధానంగా కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు చూశారు. వారి పదవులు ఊడిపోయాక ప్రతిపక్షాలను అదే పనిగా విమర్శించే బాధ్యతను తీసుకున్న మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్ ఒకరు. ప్రధానంగా ఆయన జనసేన అధినేత …
Read More »కేసీఆర్ కు మైండ్ బ్లాక్ చేసిన ఆ ఇద్దరు
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై చాలానే ఉత్సాహం ఉంది. ప్రస్తుతం ఆయన వచ్చే మూడు నాలుగు నెల్లలోనే దేశవ్యాప్తంగా చుట్టేసి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ ఎస్ జాతీయ భవనాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేశారు. అయితే..ఇక్కడ ఆదిలో అనుకున్నంత ఈజీగా పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు కేసీఆర్‌కు పోటీగా ఇద్దరు నాయకులు కేంద్రంలో …
Read More »దేశ రాజధానికి ‘ఏపీ రాజధాని’ సెగ.. రైతుల మరో యాత్ర
ఏపీ రాజధాని అమరావతి రైతులు మరో యాత్రకు రెడీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతిగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ.. ఇప్పటికే రెండు సార్లు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అమరావతి నుంచి అరసవల్లి(ఇది మధ్యలోనే ఆగింది) వరకు పాదయాత్ర చేసిన రైతులు.. ఇప్పుడు తాజాగా.. ఈనెల 17, 18, 19 తేదీల్లో ఢిల్లీ వేదికగా తమ గళం వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ …
Read More »జగన్ ఇంకో 250 పెంచేసాడుగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళ వారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 2,500గా ఉన్న సామాజిక పింఛన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates