Political News

బాబుకు మరో షాక్.. ఆ తమ్ముడి తీరని కోరిక తీర్చేందుకు జగన్ రెఢీ

తిరుగులేని అధిక్యతతో దూసుకెళుతున్న ఏపీ అధికారపక్షంలోకి.. విపక్ష టీడీపీకి చెందిన తెలుగు తమ్ముళ్లు పలువురు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్యూలో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారపక్షానికి తిరుగులేని రీతిలో ప్రజాదరణ ఉండటం.. సమీప భవిష్యత్తులో బాబు కోలుకునే అవకాశం లేని నేపథ్యంలో.. ఎవరికి వారు పెట్టాబేడా సర్దుకొని పోయేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ నేతల్లో …

Read More »

అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు..కండిషన్స్ అప్లై

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన అచ్చెన్నాయుడుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో 2 రోజుల్లో అచ్చెన్నాయుడు బెయిల్‌పై విడుదల కానున్నారు. ఈఎస్ఐ స్కాంలో 70 రోజులుగా రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడుకు తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయనకు …

Read More »

ఏపీ మద్యంపై జగన్ పార్టీ ఎంపీ షాకింగ్ వ్యాఖ్యలు

దేశంలో మరెక్కడా లేని రీతిలో కొత్త కొత్త బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతోంది ఏపీ సర్కారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని పూర్తిగా మార్చేయటమే కాదు.. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే సరికొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి. అన్ని రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు కాకుండా.. కొన్ని ప్రత్యేక బ్రాండ్లతో మద్యాన్ని అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అలా అమ్ముతున్న మద్యంపై ఏపీ అధికారపక్ష ఎంపీ ఒకరు …

Read More »

ఏపీ అధికారులకు కొత్త తిప్పలు తెస్తున్న జగనన్న రూ.2వేల మాట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఒక మాట వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కొత్త తిప్పలు తెచ్చి పెడుతోంది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లు.. ఆసుపత్రుల వద్ద తరచూ రచ్చ నెలకొంటోంది. దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక మాటేనని చెబుతున్నారు. కరోనా బారిన పడి క్వారంటైన్ సెంటర్లలో ఉండి ఇళ్లకు వెళ్లే …

Read More »

కోర్టులో జగన్ సర్కారుపై ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పోరు

ఏపీ అధికారపక్షానికి.. ఆంధ్రజ్యోతి మీడియాకు మధ్య నడుస్తున్న పోరు గురించి ఆ రాష్ట్రంలోని పిల్లాడ్ని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఇంతకాలం తమ వార్తలతో జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సదరు మీడియా సంస్థ తరఫున ఒకరు.. తాజాగా న్యాయపోరాటానికి దిగటం ఆసక్తికరంగా మారింది. ఏపీ సర్కారు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు విజయవాడకుచెందిన కిలారు నాగశ్రవణ్. ప్రభుత్వ ప్రకటనల్లో సింహభాగంగా సాక్షి …

Read More »

జగన్ సర్కారుకు బ్యాడ్ డే

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టులో ఎదురు దెబ్బ.. జగన్ సర్కారుకు సుప్రీం కోర్టు షాక్.. ఇలాంటి వార్తలు గత ఏడాది కాలంలో ఎన్ని వచ్చాయో లెక్కే లేదు. ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని కోర్టు సమర్థిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది తప్ప.. కోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలితే అది వార్తగానే అనిపించట్లేదు. ఇది మామూలే కదా అనుకునే స్థాయిలో జగన్ సర్కారుకు కోర్టులో ఎదురు దెబ్బలు తగిలాయి. తాజాగా రాజధాని వ్యవహారంలో …

Read More »

విశాఖ వెళదామంటే.. హైకోర్టు సీన్లోకి వచ్చేసిందిగా..

అనుకున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది ఏపీ రాజధాని తరలింపు వ్యవహారం. ఏపీకి ఒక రాజధాని బదులుగా.. ముచ్చటగా మూడు రాజధానుల ఏర్పాటు అంశం తెర మీదకు రావటం.. అందుకు ఏపీ అసెంబ్లీ ఓకే చేయటం.. రాష్ట్ర గవర్నర్ రాజముద్ర వేయటం వరకు జరిగిన విషయాలు తెలిసిందే. అనంతరం హైకోర్టు ఎంట్రీ వేళ.. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడే ఏపీ సర్కారుకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు రాజధాని …

Read More »

అమరావతి: సీఎంతో పాటు, కేబినెట్ కి, బీజేపీ టీడీపీలకు నోటీసులు

అమరావతి రైతులు రాజధాని పరిరక్షణ కోసం ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు వ్యూహాత్మకంగా చట్టం అండగా పోరాడుతున్నారు. రైతుల్లో ఎక్కువమంది చట్టాలు, హక్కులపై అవగాహన ఉన్నవారే కావడంతో ప్రభుత్వాన్ని సులువుగా ఇరుకున పెట్టగలుగుతున్నారు. తాజాగా ఒక అనూహ్యమైన పిటిషను కొత్తకోణంలో హైకోర్టులో దాఖలైంది. ప్రభుత్వం రాజధాని తరలించడానికి దురుద్దేశపూరితమైన చట్టాలను చేసిందని, ఇందులో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములు అయ్యాయని పేర్కొంటూ కొందరు అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు …

Read More »

అదరగొట్టేసే నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ సర్కార్

తప్పులు జరుగుతున్నాయి.. మోసాలు చోటు చేసుకుంటున్నాయి.. నిబంధనల్ని అతిక్రమిస్తున్నారన్న విషయాలు తెలిసినప్పటికీ చూసీ చూడనట్లుగా ఉండటం చాలా ప్రభుత్వాలు చేసేవే. తప్పుల్ని సరిదిద్దేందుకు వీలుగా చట్టాల్ని మరిత కఠినతరం చేస్తే సరిపోతుంది. అలాంటివేమీ చేసేందుకు సిద్ధపడని ప్రభుత్వాల తీరుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు తీసుకున్న దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా నిర్మించే నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు చేసే విధానానికి బంద్ చేస్తూ సంచలన …

Read More »

ఏపీకి ఊపిరి ఆడటం లేదు !

కరోనా కేసుల విషయంలో ఏపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు చాలా రాష్ట్రాలకు భిన్నంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున టెస్టులు చేయించటం.. భారీగా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు.. ప్రైవేటు ఆసుపత్రుల అడ్డగోలు వ్యవహారాలకు చెక్ చెప్పటం.. పేషెంట్లకు ఇచ్చే డైట్ వరకు అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు తానే స్వయంగా చూస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం ఇంత కష్టపడుతున్నా.. కొందరి కారణంగా ప్రభుత్వానికి.. ప్రజలకు జరుగుతున్న నష్టం అంతా …

Read More »

చీరాల టీడీపీ హీరో ఎవరు?

2019 ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీకి బలమైన నేతలు…అంతే బలమైన కేడర్ ఉంది. గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన నాయకులు ఉన్నారు. అయితే, 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ పరిస్థితి ఒక్కసారి మారిపోయింది. టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో అనధికారికంగా చేరిపోయారు. మరికొందరు వైసీపీ ఉక్కపోతకు తట్టుకోలేక ఫ్యాన్ గాలిలో సేద తీరేందుకు సిద్ధమవుతున్నారని టీడీపీ వర్గాలు …

Read More »

బ్యాంకులకు పొంచి ఉన్న డేంజర్ చెప్పిన దువ్వూరి

కరోనా వేళ.. దేశీయ బ్యాంకులు ఎదుర్కొనే ముప్పు గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు తెలుగోడు.. ఆర్ బీఐ మాజీ గవర్నర్ గా పని చేసిన దువ్వూరి సుబ్బారావు. బ్యాంకులకు మొండి బకాయిలు పెరిగిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో ఇదో పెద్ద సమస్యగా మారుతుందన్న విషయాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులకు పెరుగుతున్న మొండి బాకీల్ని తగ్గించేందుకు బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలన్న సూచనను చేస్తున్నారు. మొండి బాకీల్ని పరిష్కరించే …

Read More »