జనసేన అధినేత పవన్.. బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2020లోనే ఆయన ఎన్నికలు ముగిసిన సంవత్సరంలోనే బీజేపీ పెద్దలతో పొత్తు కుదుర్చుకున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి మంత్రాంగం నడిపివచ్చారు. ఇక.. అప్పటి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్నానని.. పవన్ చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు తరచుగా పవన్‌ను వివిధ కార్యక్రమాలకు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక, రాష్ట్రంలోనూ అప్పుడప్పుడు.. పవన్.. బీజేపీ రాష్ట్ర చీఫ్.. సోము వీర్రాజు తదితరులతో భేటీ అవుతున్నారు. ఉమ్మడి కార్యక్రమాలకు …
Read More »ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు
ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరుకోబోతున్నాయి. ఇటు అధికార వైసీపీ అటు ప్రధాన ప్రతిపక్షం మధ్య మొదలైన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని టీడీపీ నేత పట్టాభి అనుచితమైన పదాన్ని వాడటం, దాంతో ఒళ్ళు మండిన వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయటంతో రాజకీయంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. దాంతో చంద్రబాబునాయుడు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. దాని తర్వాత 36 గంటల నిరసన దీక్షకు …
Read More »పొలిటికల్ మైలేజ్ కోసమేనా ?
జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు కేవలం రాజకీయంగా మైలేజీ కోసమే అని పోలీసులు తేల్చేశారు. పట్టాభి అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. సీఎంను టార్గెట్ చేసుకునే ఉద్దేశ్యపూరితంగా, సమాజంలో అశాంతిని రేకెత్తించే ఉద్దేశ్యంతోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టుకు తెలిపారు. పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ఎలాంటి అంశాంతి …
Read More »ఎంపీని నిలదీసిన కోర్టు
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టుల్లో సవాలు చేయడం, న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవటమే ఏకైక లక్ష్యంగా కొందరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి వ్యక్తులు, పార్టీల సంగతి ఎలాగున్నా అధికార వైసీపీలో తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ప్రభుత్వాన్ని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోర్టు దుమ్ముదులిపేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు …
Read More »తమ్ముళ్ళకే శీల పరీక్ష పెట్టారా ?
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో నేతలకే శీలపరీక్ష పెట్టినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు పెద్దగా క్రియాశీలకంగా లేరు. సీనియర్లంటే మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా చాలామంది ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా బాగా పెత్తనం చేసిన వారిలో చాలామంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పెద్దగా కనబడటం లేదన్నది వాస్తవం. ఎంతసేపు చంద్రబాబు లేకపోతే లోకేష్ కాకపోతే అచ్చెన్న, బుచ్చయ్య చింతకాయల లాంటి …
Read More »పట్టాభిరామ్ నేపథ్యం తెలుసా?
పట్టాభిరామ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పేరు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల్లో ఒకరిగా కొన్నేళ్లుగా చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్న వ్యక్తి ఇతను. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి పట్టాభిరామ్ స్థాయిలో ఇంత బలంగా పార్టీ గళాన్ని వినిపించిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఏ అంశం మీద అయినా.. బాగా స్టడీ చేసి, ఆధారాలు పక్కన పెట్టుకుని మాట్లాడాడని, ఆరోపణలు …
Read More »బాబు అంచనాలను మించిపోయిందిగా!
ఎటు చూసినా.. పచ్చజెండాలు. కాలు కదిపేందుకు వీలు లేనంతగా తమ్ముళ్లు.. పార్టీ అభిమానులు.. మహి ళా నాయకులు.. ఎటు చూసినా.. బారులు తీరిన జనం.. ఇదీ.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద .. తాజా పరిస్థితి. చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు కనీ వినీ ఎరుగని స్పందన లభించింది. నిజానికి చంద్రబాబు కూడా ఇంత రేంజ్లో స్పందన వస్తుందని ఊహించి ఉండరని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ కార్యాలయంపై జరిగిన …
Read More »ముందస్తు లేనట్టే.. వైసీపీలో ఎందుకీ మార్పు..!
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని.. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ప్లాన్ చేసుకుంటున్నారని.. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపారనే ఇటీవల కాలంలో వార్తలు హల్చల్ చేశాయి. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందస్తుకు ప్లాన్ చేసుకుందని చర్చకూడా నడిచింది. అయితే దీనిలో పీకే టీం.. సర్వే చేస్తున్న మాట వాస్తవమే. అదే సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ కూడా భావించిన మాటా …
Read More »సజ్జలను సైలెంట్ చేస్తారా?
సజ్జల రామకృష్ణారెడ్డి.. పేరుకే అధికార వైసీపీ ప్రభుత్వ సలహాదారు కానీ సీఎం జగన్ తర్వాత అటు ప్రభుత్వంలో.. ఇటు పార్టీలో తానే నంబర్ టూ అనేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల కౌంటర్‌కు ఆయనే సమాధానం ఇస్తారు. ప్రభుత్వంలో ఏ శాఖ గురించి అయినా ఆయనే మాట్లాడతారు. ఆరోగ్యశాఖ విద్యాశాఖ.. ఇలా ఆ శాఖ ఈ శాఖ అని కాకుండా అన్ని శాఖల గురించి ఆయనే మాట్లాడతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. …
Read More »బద్వేలు : కాంగ్రెస్ మైండ్ గేమ్ ఇదేనా
ట్విస్టులతో సాగుతూ మలుపులు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఏకగ్రీవం అవుతుందనుకున్న ఈ ఎన్నికలో ఇప్పుడు ప్రధానంగా అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచాయి. వైసీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ బీజేపీ నుంచి విద్యార్థి నాయకుడు సురేశ్ కాంగ్రెస్ నుంచి పీఎం కమలమ్మ బరిలో దిగారు. అక్టోబర్ 30నే పోలింగ్ ఉండడంతో ఇప్పటికే ప్రచారాన్ని అన్ని …
Read More »తండ్రితో తనయుడికి చెక్ పెట్టేలా రేవంత్ వ్యూహం!
సీనియర్ల మధ్య విభేధాలు.. పదవుల కోసమే కానీ పార్టీ కోసం పని చేయని నాయకులు.. అధికార పార్టీకి సవాలు విసిరే ధైర్యం లేకపోవడం.. ఇలాంటి కారణాల వల్ల గత కొన్నేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఢీలా పడింది. కానీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైనప్పటి నుంచి రాష్ట్రంలో పార్టీ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. అధికార పార్టీపై విరుచుకుపడుతున్న రేవంత్.. సభలు ర్యాలీలు సమావేశాలంటూ కాంగ్రెస్ …
Read More »అద్వానీకి బీజేపీ అందలం.. రీజనేంటంటే!
లాల్ కృష్ణ అద్వానీ.. దాదాపు అందరూ మరిచిపోయిన పేరు. కాదుకాదు.. బీజేపీ నాయకులే అలా మరిచి పోయేలా చేసిన పేరు.. ఇప్పుడు మళ్లీ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఇప్పుడు ఏ రామజన్మ భూమి.. రామమందిరం.. అని బీజేపీ అడుగులు వేస్తోందో.. దానికి పునాదులు వేసింది.. అద్వానీనే! కానీ.. మోడీ హయాంలో 2014 నుంచి నానాటికీ తీసికట్టుగా మారిన అద్వానీ పరిస్థితి.. ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించ డం లేదు. …
Read More »