Political News

‘కేసీఆర్‌ గీసిన గీతను దాటేది లేదు’

స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెక్కి వెక్కి ఏడ్చారు. మంగళవారం క్యాంపు ఆఫీస్ లో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా బోరున విలపించారు. తరువాత కార్యకర్తలతో కలిసి ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ ముందు పడుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. తరువాత కార్యకర్తలతో మాట్లాడుతూ..కేసీఆర్ తనకు ఉన్నత స్థానం కల్పిస్తామన్నారని అన్నారు. ఇప్పుడున్న స్థానం …

Read More »

గంప నెత్తిన ఎంపీ టోపీ

కేసీఆర్ కోసం సీటు త్యాగం చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎంపీ కాబోతున్నారా? ఆయన్ని ఎంపీగా గెలిపించుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కామారెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ తన స్థానాన్ని వదులుకోక తప్పదు. అయితే ఇప్పటికే గంపను …

Read More »

అంతా సంస్కారహీనుడిని కాను: కొడాలి నాని!

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు ఎంతో ముఖ్యమైన రోజు ఆగస్టు 22. సంక్రాంతి తరువాత మెగా అభిమానులకు అంత పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే..అది మెగాస్టార్‌ పుట్టిన రోజే. ఈ వేడుకను అభిమానులు ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే గుడివాడలో కూడా చిరు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చారు. …

Read More »

పట్నంకు అలా గాలమేశారా?

రాజకీయ నీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తిరుగులేదనే పేరుంది. చాణక్య నీతితో ఎప్పుడు ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలన్నది కేసీఆర్కు బాగా తెలుసని చెబుతుంటారు. తాజాగా తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్రెడ్డిని కేసీఆర్ దారిలోకి తేవడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తామనే ఆశ చూపి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకుండా కేసీఆర్ చేశారని టాక్. తాండూర్లో పట్నం మహేందర్రెడ్డి, పైలట్ …

Read More »

కేసీఆర్ చెప్పినా గోడ దూకుడే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించేశారు. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశలు పెట్టుకున్న ఇతర నేతలు నిరాశ పడొద్దని కేసీఆర్ చెప్పారు. పార్టీలో భవిష్యత్లో చాలా అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ పార్టీలు మారే నేతలు వింటారా? ఇప్పటికే పార్టీ జంపింగ్లపై ఆ నేతలు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు ఈ సారి కేసీఆర్ టికెట్ …

Read More »

కవిత కోసమే కామారెడ్డి నుంచి కేసీఆర్

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే గజ్వేల్ ఎలాగో కేసీఆర్ అలవోకగా గెలుస్తారనే టాక్ ఉంది. అలాంటప్పుడు కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారనే విషయం అంతు పట్టడం లేదు. కేసీఆర్ నిర్ణయం వెనుక ఏ వ్యూహం దాగి ఉందో అర్థం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కామారెడ్డి నుంచి ఆయన పోటీ …

Read More »

కామ్రేడ్లను చావుదెబ్బకొట్టిన కేసీయార్

వెయిట్ చేయించి వెయిట్ చేయించి కామ్రేడ్లను మరీ కేసీయార్ చావుదెబ్బ తీశారు. పొత్తుల విషయం ఏమీ తేల్చకుండానే వామపక్షాలను కోలుకోలేని విధంగా కేసీయార్ దెబ్బకొట్టారు. మునుగోడు ఉపఎన్నికలో గెలుపుకోసం వామపక్షాల మద్దతుతీసుకున్నారు. అప్పట్లో వామపక్షాలు కేసీయార్ కు సహకరించకపోతే బీఆర్ఎస్ గెలిచేదే కాదు. ముందుగా ఆ విషయం గ్రహించటం వల్లే వామపక్షాలతో కేసీయార్ సయోధ్య చేసుకున్నారు. నిజానికి అప్పట్లో వామపక్షాలు సహకరించింది రేపటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటానని కేసీయార్ మాట …

Read More »

చేతులెత్తేసిన కవిత

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంటు ఆమధ్య కల్వకుంట్ల కవిత ఢిల్లీలో తెగ హడావుడి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి తప్పించుకునేందుకే ప్రతిపక్షాల మద్దతుందని చూపించుకునేందుకు మాత్రమే కవిత హడావుడి చేశారని అప్పట్లోనే బాగా ప్రచారం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం ఎందుకు టికెట్లు ఇవ్వటంలేదని విచిత్రమైన వాదన వినిపించారు. అప్పట్లో కవిత హడావుడి చేసి అందరు ఆశ్చర్యపోయారు. సీన్ కట్ చేస్తే సొంతపార్టీలోనే మహిళలకు …

Read More »

వంశీ మౌనం వెనుక కారణమేంటి?

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. ఆ నియోజకవర్గం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే టీడీపీకి వెన్నుముక లాంటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి అక్కడ టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఎందుకంటే సైకిల్ గుర్తుపై గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుడిగా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా వైసీపీకి గట్టి షాక్‌ ఇచ్చి ఫ్యాన్‌ …

Read More »

నా చావుకు సానుభూతి ఉండకూడదు: పోసాని!

సినీ నటుడు పోసాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాజకీయాల్లో ఉంటూ కీలక వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు పోసాని. ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న పోసాని.. తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న ఆటు పోట్లను వెల్లడించారు. తాజాగా పోసాని ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చావు గురించి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.నేను చస్తే.. …

Read More »

మార్గదర్శిలో తనిఖీలకు ఏపీ హైకోర్టు బ్రేక్

మార్గదర్శి చిట్ ఫండ్స్ పై, రామోజీరావుపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే #TeluguPeopleWithRamojiRao ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేయవద్దని సిఐడి అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచించింది. తాము తదుపరి మధ్యంతర ఉత్తరాలు ఇచ్చేవరకు ఈ వ్యవహారానికి సంబంధించి …

Read More »

ఏపీలో దొంగ ఓట్లు…ఇద్దరు అధికారులు సస్పెండ్

ఏపీలో ఓట్ల నమోదు ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దొంగ ఓట్లను జాబితాలో చేరుస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ సీనియర్ నేత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గతంలో ఉరవకొండలో పర్యటించారు. అనంతపురంలో 6000 దొంగ …

Read More »