Political News

బీజేపీ నేత‌ల మౌనం.. బాబును స‌మ‌ర్ధిస్తున్నారా..?

రాష్ట్రంలో నిప్పులు కురిశాయి. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకున్నాయి. రాష్ట్ర బంద్ పాటించా యి. మ‌రోవైపు అధికార పార్టీ నిర‌స‌న‌లు చేప‌ట్టింది. చంద్ర‌బాబు దీక్ష‌కు పిలుపు ఇవ్వ‌గానే.. మేం మాత్రం త‌క్కువ‌గా అంటూ.. జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌కు దిగారు. ఇలా పోటాపోటీ దీక్ష‌లు.. నిర‌స‌న‌ల‌తో రాష్ట్రం అట్టుడికింది. ఇక‌, రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌లు తూటాల‌ను మించి పేలాయి. నువ్వొక‌టంటే.. నేరెండంటా.. అంటూ.. వైసీపీ, …

Read More »

కడప రెబల్ స్టార్ మళ్లీ యాక్టివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు కావొస్తోంది. మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే రాష్ట్రంలో వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఆ ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు అంటి ముట్ట‌న‌ట్లుగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు కూడా ఇప్పుడు తిగిరి రాజ‌కీయ పునఃప్ర‌వేశం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అలాంటి నాయ‌కుల్లో ప్ర‌ధానంగా డీఎల్ ర‌వీంద్రారెడ్డి పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. …

Read More »

భ‌ట్టి పై కేటీఆర్ క‌న్ను!

తెలంగాణ‌లో రాజ‌కీయం గ‌తంలో ఉన్న‌ట్లు లేదు. ప‌రిస్థితులు మారాయి. 2014లో రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి అధికార టీఆర్ఎస్ ఆడింది ఆట‌గా సాగింది. కానీ గ‌త రెండేళ్లుగా ఆ ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో త్రిముఖ పోరు నెల‌కొంది. టీఆర్ఎస్‌కు దీటుగా నిల‌బ‌డుతూ బీజేపీ, కాంగ్రెస్ స‌వాలు విసురుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత బండి సంజ‌య్ దూకుడుతో టీఆర్ఎస్‌ను ఇబ్బందులు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. …

Read More »

వైసీపీలో ముస‌లం.. ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య విబేధాలు..?

చిత్తూరు వైసీపీలో ముస‌లం వ‌చ్చిందా? కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాలు చోటు చేసుకున్నాయా ? దీంతో పార్టీలో కీల‌క మార్పుల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌.. పుంగ‌నూరు ఎమ్మెల్యే క‌మ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిలు ఓ ర‌కంగా స్నేహితులు.. రాజకీయంగా చూస్తే.. అంత‌కుమించి.. అన్న రేంజ్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు చేశారు. ముఖ్యంగా టీడీపీని సాధ్య‌మైనంత వ‌ర‌కు జిల్లాలో డైల్యూట్ …

Read More »

వల్లభనేని వంశీ సెల్ఫ్ గోల్ పాలిటిక్స్

రాజ‌కీయాల్లో నేత‌లు తాము ఏం చేసినా చెల్లుతుంద‌నే కాలం చెల్లింది. నాయ‌కుల ప్ర‌తి అడుగును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఒక‌ప్పుడు.. ఇంత విస్తృత మీడియా.. సోష‌ల్ స‌మాచారం లేనిరోజుల్లో.. నాయ‌కులు ఏం చేసినా.. ప్ర‌జ‌ల‌కు తెలిసే స‌రికి స‌మ‌యం ప‌ట్టేది. అయినా.. అప్ప‌టి నాయ‌కులు హ‌ద్దుల్లో ఉండేవారు. ప్ర‌జాసేవ‌, దేశ సేవలో పొరుగు నేత‌ల‌తో పోటీ ప‌డేవారు. స‌రే! ఇప్పుడు మారిన ట్రెండ్‌లో సంపాద‌న‌లోను. అధికారంలోనూ ముందుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో …

Read More »

బాబు టూర్‌.. జ‌గ‌న్ తెగ‌దెంపులు!

టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టిన రాజ‌కీయ వేడి ఇప్పుడు ఢిల్లీ చేర‌నుంది. తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నుండ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్రప‌తిని క‌లిసి రాష్ట్రంలోని ప‌రిస్థితులు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు విష‌యాల‌ను ఆయ‌న‌తో ప్ర‌స్తావించి బాబు రాష్ట్రప‌తి పాల‌న కోరే అవ‌కాశాలున్నాయి. దీంతో బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై అధికార …

Read More »

ఎస్సీ ఓటు బ్యాంకు కోసం.. ప‌వ‌న్ వ్యూహం ఫ‌లించేనా?

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఎలా అయినా ఉండొచ్చు. ఎటు నుంచి ఎటైనా సాగొచ్చు. అయితే.. ఆయా వ్యూహాలు ఏమేర‌కు ఫ‌లితాన్ని ఇస్తాయి? అనేది మాత్రం అత్యంత కీల‌కం. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌యం లో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం మేధావుల మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎవ‌రు అధికారంలోకి రావాల‌న్నా.. కొన్ని కీల‌క సామాజిక వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకోవాల్సిందే. పార్టీ అధినేతల సామాజిక వ‌ర్గాల‌కు తోడు.. రాష్ట్ర జ‌నాభాలో కీల‌కంగా ఉన్న‌.. …

Read More »

ఆ నేత‌లు యూట‌ర్న్‌!

2019 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం ఘోర ప‌రాజ‌యం చెంద‌గానే ఆ పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నాయ‌కులు ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికే రావాల‌నుకుంటున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌మ‌లాన్ని వ‌దిలి సైకిల్ ఎక్కాల‌నుకుంటున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. గ‌తంలో పార్టీ మారిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు సొంత ఇంటికి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వాళ్ల కోసం నియోజ‌క‌వ‌ర్గాల వారీగా …

Read More »

అడ్రస్సే లేని పవన్

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతవరకు అడుగే పెట్టలేదు. ఎక్కడ అడుగు పెట్టలేదంటే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రచారానికి. వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. చనిపోయింది వైసీపీ ఎంఎల్ఏ కాబట్టి, ఆయన భార్య సుధనే పోటీ చేస్తున్నారు కాబట్టి సంప్రదాయం ప్రకారం తాము పోటీ చేసేది లేదని పవన్ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా మరి మిత్రపక్షం బీజేపీ పోటీ మాటేమిటి ? …

Read More »

లోకేష్‌కి భ‌లే ఛాన్స్‌!

ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న‌ను తాను నిరూపించుకునేందుకు నానా తంటాలు ప‌డుతోన్న మాజీ ముంఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్‌కు ఇప్పుడు మంచి అవ‌కాశం దొరికింద‌నే చ‌ర్చ సాగుతోంది. టీడీపీ కార్యాయాల‌పై వైసీపీ శ్రేణుల దాడుల‌ను ఆయుధంగా చేసుకున్న ఈ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన లోకేష్ ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ఆయ‌న‌కు మంచి మైలేజీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రూపంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని …

Read More »

బాబు ఢిల్లీ టూర్‌పై వైసీపీ బెంగ‌

చంద్ర‌బాబు ఢిల్లీ టూర్‌పై వైసీపీ నాయ‌కులు బెంగి పెట్టకున్నారా? సుదీర్ఘ కాలం విరామం త‌ర్వాత‌.. ఢిల్లీ వెళ్తున్న చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌భుత్వంపై ఏం చెబుతారో.. ఏం జ‌రుగుతుందో.. అని త‌ల్ల‌డిల్లుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్తున్న విష‌యం తెలిసిందే. ముందుగానే ఆయ‌న 36 పేజీల‌తో కూడిన లేఖ‌ల‌ను.. ఆయ‌న సంధించారు. ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. స‌హా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద‌ద్‌కు …

Read More »

జగన్, చంద్రబాబుకు జేపీ విజ్ఞప్తి

ఏపీ రాజకీయాలు రచ్చ రంబోలాల తయారయ్యాయి. వ్యక్తిగత దూషణలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ నిలించింది. రాజకీయ పార్టీల నేతలు రాజకీయ విమర్శలు పక్కన పెట్టి దూషణ, భూషణలకు దిగుతున్నారు. టీడీపీ నేత పట్టాభి ఒక్క మాటతో రాష్ట్రం మొత్తం రావణకాష్టమైంది. పట్టాభి వ్యాఖ్యలతో అధికార పార్టీ అగ్గిమీదగుగ్గిలమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడికి దిగారు. పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు. అంతటితో ఆగిపోకుండా …

Read More »