మాజీ మంత్రి, ప్రస్తుతం బీఆర్ ఎస్ నేతగా ఉన్న జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన పై పార్టీ అధిష్టానం వేటు వేసిన విషయం తెలిసిందే. దొరల గడీ నుంచి తాను బయటకు వచ్చిన ట్టు ఉందని అన్నారు. అయితే.. అదేసమయంలో తాను సంధించే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని.. ఆ తర్వాతే తనను సస్పెండ్ చేయాలని ఆయన అల్టిమేటం జారీ చేశారు. “నన్ను సస్పెండ్ …
Read More »రేవంత్ రెడ్డికి ప్రమోషన్
ఆల్రెడీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో అత్యున్నత పదవిలోనే ఉన్నాడు కదా.. కొత్తగా రేవంత్ రెడ్డికి ఏం ప్రమోషన్ వచ్చింది అని ఆశ్చర్యం కలుగుతోందా? ఐతే ఈ ప్రమోషన్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణానికి సంబంధించింది కాదు. ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడ్డది. చూడ్డానికి ఇంకా పెద్ద వయసేమీ కానట్లు కనిపించే రేవంత్.. అప్పుడు తాత అయిపోయాడు. కొన్నేళ్ల కిందటే పెళ్లి చేసుకున్న రేవంత్ ముద్దుల కూతురు నైమిష.. తాజాగా …
Read More »కేసీఆర్ ఐడియా జగన్ కి ఇబ్బందే
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టబోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఫ్యాక్టరీని కొనుగోలు చేయటంలో తెలంగాణా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కేంద్రానికి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఇఓఐ) తెలియజేయబోతోందట. అలాగే వైజాగ్ వెళ్ళి ఫ్యాక్టరీ కొనుగోలుకు అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చి …
Read More »6 నెలల ముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్న జగన్?
ఎన్నికలకు ఆరు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటించడానికి వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారట. అభ్యర్థుల పేర్లు ఇప్పటికే దాదాపు ఖరారైందని.. ప్రకటించడానికి ముహూర్తం కూడా ఫిక్సయిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాలపై పట్టు సాధించాలన్నది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రెండు విడతలలో విడుదల చేస్తారని తెలుస్తోంది. మొదటి విడతలో 80 నుంచి 90 మంది అభ్యర్థులను …
Read More »జగన్ పరువు తీసిన బీజేపీ ఎంపీ
ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అనే ఒక అధ్యక్షుడు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ అనే ముగ్గురు ఎంపీలు ఉన్నా కూడా వారెవ్వరూ ఎప్పుడూ ఏపీలోని అధికార పక్షాన్ని బలంగా విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసినా అది తూతూమంత్రమే. ఏపీలో అరాచకాన్ని కానీ, అభివృద్ది శూన్యతను కానీ ప్రశ్నించిన సందర్భాలు, ప్రజలకు తెలియచెప్పిన సందర్భాలు చాలా తక్కువ. వైసీపీ, జగన్ కేంద్రంలోని బీజేపీ …
Read More »సెల్ఫీలు కోట్లాడుతున్నాయ్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏదో ఒక వివాదం తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ సర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. ఇటీవల రెండు రోజుల కిందట మూ డు జిల్లాల పర్యటనను చంద్రబాబు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, నేతల జోనల్ సమావేశాలను ఆయన చేపట్టారు. తద్వారా.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు..నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదేసమయంలో తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ హయాంలో చేపట్టిన కీలకపథకాలు… …
Read More »తెలుగుదేశం తమ్ముళ్లకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా..!
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చేపడుతున్న కార్యక్రమాలకు కౌంటర్గా ఆయన కూడా.. వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇలా.. గత ఏడాది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది. అంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా.. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు వినడం.. ఈ కార్యక్రమం లక్ష్యం. అదేసమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను …
Read More »వైసీపీ ఆరు నెలల తర్వాతే అసలు పరీక్ష స్టార్ట్…!
అవును.. ఇప్పుడు కాదు.. మరో ఆరు మాసాలు తిరిగిన తర్వాత.. చూడాలి ఏపీ అధికార పార్టీ వైసీపీ పరిస్థితి అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. ఏ అధికార పార్టీ అయినా..ఎన్నికలకు మూడు మాసాల ముందో.. నాలుగు మాసాల ముందో .. మేల్కొం టుంది. అప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల అప్పటికే జరిగిపోయిన తప్పులు సరిచేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పడానికి కుదరదు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న …
Read More »సీపీఎస్ రద్దు చేసేలా నిర్ణయం: లోకేష్ హామీ!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కంట్రిబ్యూటరీ పింఛన్(సీపీఎస్) రద్దుపై టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ సంచలన హామీ ఇచ్చారు. సీఎం జగన్.. 2019ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చారని.. అయితే.. అధికారంలోకి వచ్చాక.. తెలియక ఇచ్చాను.. అప్పట్లో గుర్తించలేక పోయాను.. అని నంగనాచి కబుర్లు చెప్పారని లోకేష్ విమర్శించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారని అన్నారు. అయితే.. …
Read More »ఎంపీ వద్దు ఎమ్మెల్యే ముద్దు…. ఎందుకలా ?
2019లో వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. పార్టీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 22 మంది లోక్ సభ సభ్యులయ్యారు. నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దానితో లోక్ సభ సభ్యుల సంఖ్య 21 వద్ద నిలిచింది. కాలచక్రం గిరగిరా తిరగడంతో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతలోనే టికెట్ల పంచాయతీ …
Read More »షార్ట్స్ వేసుకునే మహిళలు.. శూర్పణఖలు: బీజేపీ నేత
మహిళల దుస్తులు.. వారి వ్యవహారశైలిపై బీజేపీ నేత ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒళ్లంతా కనిపించేలా బట్టలు కనిపించేవా రు.. శూర్పణఖలతో సమానమని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. అలాంటి వారిని అక్కడే.. నడిరోడ్డుపై కొట్టినా తప్పులేదనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. దీనిపై మహిళా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మంచి దుస్తులు ధరించని మహిళలు శూర్పణఖల్లాంటి వారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ …
Read More »బీఆర్ఎస్ ఆదాయం.. 218 కోట్లు.. మరి వైసీపీ మాటేంటి?
పార్టీపరంగా చూస్తే.. అవి స్తానిక పార్టీలు. ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ, ఆదాయం పరంగా చూస్తే.. మాత్రం జాతీయ పార్టీలతో పోటీ పడుతున్నాయి. అవే.. వైసీపీ, బీఆర్ఎస్, బిజేడీ(ఒడిశా అధికార పార్టీ) ఒక్కొక్క పార్టీ ఆదాయం.. 200 కోట్ల పైగానే ఉందని సర్వే తేల్చి చెప్పింది. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) 2021-22 ఏడాదికి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.218 కోట్లను ఆదాయంగా పొందింది. అదే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates